మూగ జీవాల కోసం ఎన్‌జీవో
షెల్టర్, ఆంబులెన్స్ సేవలు
దయగల దాతలు సాయం చేయండి!
నటి రేణుకా దేశాయ్ శుభవార్తను ఫ్యాన్స్‌తో పంచుకుంది. చిన్న నాటి కల నెలవేరింది అంటూ ఇంటూ ఇన్‌స్టాలో ఒకపోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఇది నెట్టింట సందడి చేస్తోంది.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ, వ్యక్తిగత విషయాలతో పాటు , ఆసక్తికరమైన విషయాలను పంచుకోవడం, పలు సామాజిక అంశాలపై స్పందించడం అలవాటు. అలాగే అభిమానుల సాయంతో తోచిన సహాయం చేస్తూ ఉంటుంది. పర్యావరణం, మూగ జంతువుల సంరక్షణకు సంబంధించి ఏదో ఒక పోస్ట్ పెడుతూ అవగాహన కల్పిస్తూ ఉంటుంది. తాజాగాలో ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో చెప్పుకొచ్చింది. క్తికరమైన విషయాన్ని తన ఫ్యాన్స్‌తో షేర్ చేసింది. తనకు చిన్నప్పటినుంచి జంతువులు ముఖ్యంగా కుక్కలు, పిల్లులు మీద ఇష్టం ఎక్కువ అనీ, పెద్దాయ్యక వాటి కోసంఏదైనా చేయాలని కోరిక ఉండేదని, కోవిడ్ సమయంలో దీని ప్రాధాన్యతను తాను మరింత గుర్తించానని తెలిపింది. ఎట్టకేలకు ఇన్నాళ్లకు ఒక ఎన్‌జీవోను రిజిస్టర్ చేసినట్టు వెల్లడించింది. గతంలో ప్రమాదాలకు గురైన కుక్కలు లాంటివాటిని రక్షించడంలో తనకు చాలామంది గొప్పవాళ్లు సాయం చేశారని తెలిపింది. ఇపుడిక తానే స్వయంగా ఒక సంస్థను, ఆంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పింది. అలాగే ఈ ప్రయాణంలో మరింత ముందుకు పోవాలంటే దాతల సాయం కూడా చాలా అవసరం అంటూ, సాయం చేసి, మూగజీవాల రక్షణలో తనకు తోడుగా నిలవాలని విజ్ఞప్తి చేసింది.
‘‘ఈ రోజు నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు, చిన్ననాటి కల నెరవేరింది, అందుకే క్షణాన్ని మీ అందరితో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ తన సంస్థకు సంబంధించిన వివరాలను, తన ఆశయాలను ఈ వీడియోలో చెప్పుకొచ్చింది. దీనిపై నెటిజన్లు ఆమెను ఆభినందిస్తున్నారు. జంతువుల సంరక్షణ, వైద్య సాయం అందించే క్రమంలో విజయం సాధించాలి అంటూ విషెస్ అందించారు.
Comments
Please login to add a commentAdd a comment