ఆర్నాల్డ్ చిల్డ్రన్ హోమ్‌లో చిన్నారులు
- అనాథ చిన్నారులకు ఆశ్రయం
- పదో వసంతంలోకి వడివడిగా అడుగులు
- దాతల సహకారంతో బాధితులకు అండగా...
గజ్వేల్‌రూరల్: చుట్టూ పచ్చని చెట్లు.. ఆహ్లాదకరమైన వాతావరణం.. అందులోకి వెళ్తుంటే ఓ ఉద్యానవనంలోకి వెళ్ళినట్లు ఉంటుంది. ప్రజ్ఞాపూర్ నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో రాజీవ్ రహదారికి పక్కన 2.2ఎకరాల విశాలవంతమైన ప్రాంతంలో ఉన్న ‘ఆశాజ్యోతి’కి ప్రతి నిత్యం వివిధ ప్రాంతాల నుంచి హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌తో బాధపడుతున్న వారు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుని వెళుతుంటారు. మరి కొందరు అక్కడే ఉండి వైద్య చికిత్స పొందుతున్నారు.
వీరితో పాటు మరో 35మంది వరకు (తల్లి... తండ్రిని కోల్పోయిన) హెచ్‌ఐవీ బాధిత అనాథ చిన్నారులు ఆశ్రయం పొందుతూ తమ జీవితకాలాన్ని పొడిగించుకుంటున్నారు. వారికి ఉచితంగా మందులను ఇవ్వడంతో పాటు పౌష్టికరమైన ఆహారాన్ని అందిస్తూ బాధితులను అక్కున చేర్చుకుంటుంది ‘ఆశాజ్యోతి’... 2006లో ఏర్పాౖటెన ఈ కేంద్రం పదో వసంతంలోకి అడుగులు వేస్తోంది.
‘ఆశాజ్యోతి’ ఏర్పాటు
2006 ఆగస్టు 8న గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ గ్రామ శివారులో ఎస్‌వీడీ(సొసైటీ ఆఫ్ డివైన్‌వర్డ్ మిషన్)్ఙదైవవాక్కు సభ’ సంస్థకు చెందిన హైదరాబాద్ ఫ్రావిన్స్ వారు ‘ఆశాజ్యోతి’ని ఏర్పాటు చేశారు. అప్పటì భారీ పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డి దీన్ని ప్రారంభించారు. ఆరోగ్య కార్యక్రమాల్లో భాగంగా హెచ్‌ఐవీ/ఎయిడ్స్ సోకి జీవించే వారిని పరామర్శించడంతో పాటు వారి బాధలను విముక్తి చేసేందుకు అతి ముఖ్యమైన సేవా కార్యక్రమంగా పరిగణించి, నిరాశ, నిసృ్పహలకు గురైన వారి జీవితాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో ఈ సంస్థ ఏర్పాౖటెంది. 2012 నుంచి ఫాదర్ ఆల్వీన్ డైరెక్టర్‌గా, ఫాదర్ ఫెలిక్స్ సుపీరియర్‌లుగా ఈ కేంద్రాన్ని నడిపిస్తున్నారు.
సేవలు
ప్రజ్ఞాపూర్‌లో గల ఆశాజ్యోతి కేంద్రం(క్లస్టర్) నుంచి మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల పరిధిలోని హెచ్‌ఐవీ బాధితులకు సేవలందిస్తున్నారు. రోజు సుమారు 25మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వైద్య చికిత్సలు పొందుతున్నారు. ఇక, పదుల సంఖ్యలో ఆశ్రయం పొందుతూ చికిత్స తీసుకుంటున్నారు.
ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల నుంచి సుమారుగా 7200 మంది వచ్చి ఈ కేంద్రం నుంచి చికిత్స పొందగా..6,362 మంది బయటి నుంచి వచ్చిన వారు ఆశ్రయం పొంది చికిత్స చేయించుకున్నారు. వీరికి గజ్వేల్ పట్టణానికి చెందిన వైద్యుడు మల్లయ్య రోజూ వైద్య చికిత్స అందిస్తున్నారు. అలాగే మెడిసిటీకి చెందిన చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ బీ.రంగారెడ్డి (ప్రతి ఆదివారం), గజ్వేల్ ఎస్‌పీహెచ్‌పీవో రామకృష్ణ (ప్రతి సోమవారం) ‘ఆశాజ్యోతి’కి వచ్చి బాధితులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు.
ప్రభుత్వం నిధుల విడుదలకు చర్యలు చేపట్టాలి
ఒక్క తెలంగాణాలో మాత్రమే ‘ఆశాజ్యోతి’ హెచ్‌ఐవీ/ఎయిడ్స్ కేర్ సెంటర్ ఉంది. గతంలో ఈ కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులను రద్దు చేయడంతో ఎస్‌వీడీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ‘ఆశాజ్యోతి’ని కొనసాగిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం నిధుల మంజూరుకు చర్యలు చేపడితే మరింత మంది హెచ్‌ఐవీ బాధితులకు మెరుగైన చికిత్సను అందించేందుకు వీలు కలుగుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ చూపి బాధితుల్లో వెలుగులు నింపాలి. – ఆశాజ్యోతి సంస్థ డైరెక్టర్ ఫాదర్ ఆల్వీన్
అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి
‘జీవోదయ’ సంస్థ ఆధ్వర్యంలో ‘ఆశాజ్యోతి’ క్లస్ట ర్ పరిధిలో హెచ్‌ఐవీ/ ఎయిడ్స్ నిర్మూలనకు విశేషంగా కళాజాత కా ర్యక్రమాలను నిర్వహిస్తు న్నారు. వీటితో పాటు గ్రామాల అభివృద్ధి, మహిళ, యువత, రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ఆటపాటల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. అయితే నిధుల కొరత వల్ల ప్రజల్లోకి పూర్తిస్థాయిలో వెళ్ళలేక దాతల సహకారం కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ చూపి సాంస్కృతిక కళామండలి ఆధ్వర్యంలో కళాజాతకార్యక్రమాలను
నిర్వహిస్తే బాగుంటుంది. – జీవోదయ సంస్థ డైరెక్టర్, ‘ఆశాజ్యోతి’ సంస్థ సుపీరియర్ ఫాదర్ ఫెలిక్స్‌రోచ్
దాతల సహకారం మరువలేనిది
‘ఆశాజ్యోతి’కి ప్రభుత్వం నిధులు నిలిపివేయడంతో హెచ్‌ఐవీ బాధితులు, అనా«థ చిన్నారులు ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో దాతలు ముందుకు వచ్చి అం దించిన సేవలు, సహకారం మరువలేనిది. ప్రభుత్వం చొరవ చూపి ఆశాజ్యోతికి నిధులు వచ్చేలా చూడాలి. – ‘ఆశాజ్యోతి’ సంస్థ కోఆర్డినేటర్ వీరబాబు