తీవ్రమైన కిడ్నీసమస్యలతో బాధపడుతున్న హెచ్‌ఐవీ (HIV) రోగులకు భారీ ఊరట లభించనుంది. హెచ్‌ఐవీ ఉన్న వ్యక్తుల మధ్య కిడ్నీ మార్పిడి సురక్షితమని కొత్త అధ్యయనంద్వారా వెల్లడైంది. హెచ్‌ఐవీఉన్న వ్యక్తులు, ఎయిడ్స్ వైరస్‌తో జీవిస్తున్న వ్యక్తుల నుంచి కిడ్నీలను సురక్షితంగా స్వీకరించవచ్చని ఈ స్టడీ తేల్చింది. జీవించి ఉన్నపుడు ఇచ్చినా, లేదా మరణం తరువాత కిడ్నీలను దానం చేసినా రెండింటినీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయవచ్చని తెలిపింది.
న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో బుధవారం ప్రచురించబడిన ఈ కొత్త అధ్యయనాన్ని అమెరికాలో నిర్వహించారు. 198 కిడ్నీ మార్పిడికేసులను పరిశీలించి, దానం చేసిన అవయవం ఎయిడ్స్ వైరస్ ఉన్న వ్యక్తి నుండి వచ్చినా లేదా లేని వ్యక్తి నుండి వచ్చినా ఇదే ఫలితాలను పరిశోధకులు గుర్తించారు. గత నెలలో, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ పరిశోధనా అధ్యయనాల ప్రకారం ఈ రకమైన మూత్రపిండాలు , కాలేయ మార్పిడిని అనుమతించే నియమ మార్పును ప్రతిపాదించింది. దీనికి ఆమోదం లభిస్తే ఇది రాబోయే సంవత్సరంలో అమల్లోకి వస్తుందని రావచ్చు.
హెచ్‌ఐవీ పాజిటివ్, కిడ్నీ ఫెయిల్ అయిన రోగులపై ఈ అధ్యయనం జరిగింది. HIV-పాజిటివ్‌తో మరణించిన దాత లేదా HIV-నెగటివ్ మరణించిన దాత నుండి అవయవాన్ని స్వీకరించి,నాలుగేళ్లపాటు ఈ పరిశోధన నిర్వహించారు. అలాగే హెచ్‌ఐవీ పాజిటివ్ దాతల నుంచి కిడ్నీలు పొందిన సగం మందిని హెచ్‌ఐవీ లేని దాతల నుంచి వచ్చిన వారితో పోల్చారు. వీరిలో 13మంది రోగులకు,ఇతర సమూహంలోని నలుగురికి వైరస్ స్థాయిలు పెరిగాయి. దీనికి హెచ్‌ఐవీ మందులను సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఇలా జరిగి ఉండవచ‍్చని NYU లాంగోన్ హెల్త్‌కు చెందిన అధ్యయన సహ-రచయిత డాక్టర్ డోరీ సెగెవ్ చెప్పారు. తమ పరిశోధన అద్భుతమైన ఫలితాలనిచ్చిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment