hiv patients
-
గుడ్ న్యూస్: హెచ్ఐవీ రోగుల మధ్య కిడ్నీ మార్పిడి సురక్షితమే!
తీవ్రమైన కిడ్నీసమస్యలతో బాధపడుతున్న హెచ్ఐవీ (HIV) రోగులకు భారీ ఊరట లభించనుంది. హెచ్ఐవీ ఉన్న వ్యక్తుల మధ్య కిడ్నీ మార్పిడి సురక్షితమని కొత్త అధ్యయనంద్వారా వెల్లడైంది. హెచ్ఐవీఉన్న వ్యక్తులు, ఎయిడ్స్ వైరస్‌తో జీవిస్తున్న వ్యక్తుల నుంచి కిడ్నీలను సురక్షితంగా స్వీకరించవచ్చని ఈ స్టడీ తేల్చింది. జీవించి ఉన్నపుడు ఇచ్చినా, లేదా మరణం తరువాత కిడ్నీలను దానం చేసినా రెండింటినీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయవచ్చని తెలిపింది.న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో బుధవారం ప్రచురించబడిన ఈ కొత్త అధ్యయనాన్ని అమెరికాలో నిర్వహించారు. 198 కిడ్నీ మార్పిడికేసులను పరిశీలించి, దానం చేసిన అవయవం ఎయిడ్స్ వైరస్ ఉన్న వ్యక్తి నుండి వచ్చినా లేదా లేని వ్యక్తి నుండి వచ్చినా ఇదే ఫలితాలను పరిశోధకులు గుర్తించారు. గత నెలలో, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ పరిశోధనా అధ్యయనాల ప్రకారం ఈ రకమైన మూత్రపిండాలు , కాలేయ మార్పిడిని అనుమతించే నియమ మార్పును ప్రతిపాదించింది. దీనికి ఆమోదం లభిస్తే ఇది రాబోయే సంవత్సరంలో అమల్లోకి వస్తుందని రావచ్చు.హెచ్ఐవీ పాజిటివ్, కిడ్నీ ఫెయిల్ అయిన రోగులపై ఈ అధ్యయనం జరిగింది. HIV-పాజిటివ్‌తో మరణించిన దాత లేదా HIV-నెగటివ్ మరణించిన దాత నుండి అవయవాన్ని స్వీకరించి,నాలుగేళ్లపాటు ఈ పరిశోధన నిర్వహించారు. అలాగే హెచ్ఐవీ పాజిటివ్ దాతల నుంచి కిడ్నీలు పొందిన సగం మందిని హెచ్ఐవీ లేని దాతల నుంచి వచ్చిన వారితో పోల్చారు. వీరిలో 13మంది రోగులకు,ఇతర సమూహంలోని నలుగురికి వైరస్ స్థాయిలు పెరిగాయి. దీనికి హెచ్ఐవీ మందులను సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఇలా జరిగి ఉండవచ్చని NYU లాంగోన్ హెల్త్‌కు చెందిన అధ్యయన సహ-రచయిత డాక్టర్ డోరీ సెగెవ్ చెప్పారు. తమ పరిశోధన అద్భుతమైన ఫలితాలనిచ్చిందన్నారు. -
హెచ్ఐవీ బాధితులా? డోంట్ వర్రీ.. సంబంధం చూసి పెడతారు
కొన్ని రకాల ఆరోగ్య సమస్యల పేరు పలకడానికి సైతం కొంతమంది సిగ్గుపడుతుంటారు. అలాంటిది ఆ రోగంతో బాధపడుతోన్న రోగికి మరో రోగి భాగస్వామి అయితే ఆ జంట మరికొంతకాలం సంతోషంగా జీవిస్తారని భావించిన అనిల్ వాలివ్ అలాంటి వారికి దగ్గరుండి మరీ పెళ్లి సంబంధాలు కుదురుస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తున్నాడు. పుణేకు చెందిన యాభైఏళ్ల అనిల్ వాలివ్ ప్రస్తుతం డిప్యూటీ రీజనల్ ట్రాన్స్పోర్ట్ అధికారి (ముంబై)గా పనిచేస్తున్నాడు. అది 2005... అనిల్‌కు ఎంతో ఇష్టమైన స్నేహితుడు హెచ్ఐవీ సోకి తన కళ్లముందే చనిపోవడం. అతని కొడుకుకి కూడా హెచ్ఐవీ సోకడం అనిల్‌ను ఎంతో బాధించింది. తన స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక... ‘‘హెచ్ఐవీ వచ్చినంత మాత్రాన అంతటితో జీవితం అయిపోదు. వాళ్లకు భాగస్వామి ఉంటే జీవితం మరికొన్నాళ్లపాటు బావుంటుంది’’ అన్న ఉద్దేశ్యంతో 2005లో పాజిటివ్ సాథి వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. ప్రారంభంలో తన పైఅధికారులు కూడా ప్రోత్సహించడంతో వెబ్‌సైట్‌తోపాటు.. వివాహ వేదికలూ నిర్వహించేవాడు. అలా మొదలైన పాజిటివ్ సాథీ డాట్‌కామ్ క్రమంగా విస్తరించి నేడు వేలమంది పాజిటివ్ రోగుల పెళ్లిళ్లకు వారధిగా నిలుస్తోంది. బ్రెయిన్ సర్జరీ అయినప్పటికీ.. ఒకపక్క ఉద్యోగం... మరోపక్క సామాజిక సేవచేస్తోన్న అనిల్‌కు 2015లో బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో సర్జరీ చేయించుకున్నాడు. పూర్తిగా కోలుకున్న తరువాత కూడా సామాజిక సేవలో మరింత మునిగి పోయాడు. తాను చేసే సాయం సమాజం మెరుగుపడడానికి ఉపయోగపడాలని నిర్ణయించుకుని హెచ్ఐవీ రోగులకు పెళ్లి సంబంధాలు కుదర్చడాన్ని మరింత సీరియస్‌గా తీసుకున్నాడు. హెచ్వీ రోగికి మరో హెచ్ఐవీ జతను జోడిస్తూ ఇప్పటిదాకా వేలమంది పెళ్లిళ్లకు సాయపడుతూనే ఉన్నాడు. అంటరానివారిగా చూస్తుండడంతో... ఆర్టీవో అధికారిగా అనేకమందిని కలుస్తుంటాడు అనిల్. ఒకరోజు రహదారి భద్రత, ట్రాఫిక్ నియమాల గురించి వస్తువులు రవాణా చేసే డ్రైవర్లకు ఉపన్యాసం ఇస్తున్నాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న ట్రక్కు డ్రైవర్లలో దాదాపు అందరు హెచ్ఐవీ సోకిన వారే అని తెలిసింది. హెచ్ఐవీ అని తెలియగానే..కుటుంబ సభ్యులు, చుట్టాలు, స్నేహితులు అంటరానివారుగా చూస్తూ, తమని వదిలేశారని అనిల్‌కు కన్నీటితో తమ బాధను వెళ్లబోసుకున్నారు డ్రైవర్లు. ముందునుంచి హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న వ్యక్తులపై ఉన్న సానుభూతితో...హెచ్ఐవీ సోకిన డ్రైవర్ల జాబితా తీసుకుని డాక్టర్ల దగ్గరకు వెళ్లి వారికి ట్రీట్మెంట్ అందించాలని కోరాడు. కొంతమంది ముందుకు రావడంతో వాళ్లతో డ్రైవర్లకు వైద్యం అందిస్తూ సామాజిక కౌన్సెలింగ్‌ను అందిస్తున్నాడు. వీరిలో ఆసక్తి ఉన్నవారికి జతను వెదికిపెడుతున్నాడు. ఎన్నిసైట్లు వెతికినా... పాజిటివ్ అమ్మాయిలకోసం ఎన్ని మ్యాట్రిమొనీ సైట్లు వెతికినా ఎక్కడా హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నవారికి సంబంధాలు చూసే సైటు ఒక్కటీ కనిపించలేదు. దీంతో తనే స్వయంగా సైటుని ప్రారంభించాలనుకున్నాడు. ఇందుకోసం ఆసుపత్రులలోని హెచ్ఐవీ రోగుల డేటాను సేకరించాడు. వారి అనుమతితోనే positivesaathiను ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ సైట్లో కొన్ని వేలమంది తమ జతకోసం రిజిస్టర్ చేసుకుని ఉన్నారు. ఇప్పటిదాకా మూడు వేలమందికిపైగా ఈ సైట్ ద్వారా వివాహం చేసుకున్నారు. అర్ధంతరంగా పోకుండా.. సైట్ నిర్వహణ అంత సులభంగా లేదు. కొంతమంది నకిలీ ప్రొఫైల్స్ తో రిజిస్టరు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లన్నీ సరిచూసుకోవడం కష్టం. ఎక్కువమంది తమ కులానికి చెందిన వారిని మాత్రమే పెళ్లిచేసుకోవాలనుకుంటున్నారు. ఇటువంటి సమస్యలు ఉన్నప్పటికీ పాజిటివ్ రోగులకు జతను వెతికే పనిలో నేను బిజీగా ఉన్నాను. ఇలా పెళ్లిళ్లు జరిగితే హెచ్ఐవీ వ్యాప్తి కొంతవరకైనా నిరోధించవచ్చవచ్చు. వాళ్లు అంటరాని వాళ్లలా అర్ధంతరంగా చనిపోకుండా, కొంతకాలం అయినా తోడుతో ఆనందంగా జీవిస్తారు. – అనిల్ వాల్వి -
World AIDS Day 2022: ఒక్క ‘షాట్’తో ఎయిడ్స్‌కు దూరం
ఎయిడ్స్‌పై మానవుని పోరాటం చివరి దశకు చేరింది. అందువల్ల ఎయిడ్స్ రోగులు ధైర్యంగా ఉండవచ్చు. 2020లో జరిగిన అధ్యయనాల ప్రకారం హెచ్ఐవీ రోగుల్లో 40 శాతం మంది డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. కొందరు ఆత్మహత్యలకూ పాల్పడుతున్నారు. నిజానికి ఎయిడ్స్ ఉన్నా పెళ్లి చేసుకోవచ్చని రోగులు గుర్తించాలి. ఎయిడ్స్‌పై అవగాహన పెంచడానికి 1988 నుంచీ ప్రతీ ఏడాదీ డిసెంబర్ 1వ తేదీని ‘ప్రపంచ ఎయిడ్స్ దినం’గా పాటిస్తున్నాము. ఈ ఏడు ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితి సంయుక్తంగా ‘సంఘీభావంతో – ఎయిడ్స్ నివారణ బాధ్యతల్లో భాగస్వామ్యం కావాలి’ అనే నినాదాన్ని ఇచ్చాయి. జీవితాంతం మాత్రలు వాడటానికి 70 శాతం రోగులు ఇష్టపడటం లేదు. అందుకే మధ్యలో మందులు ఆపేయడం, అస్తవ్యస్థంగా మందులు వాడడం ద్వారా అర్థాంతరంగా హార్ట్ ఎటాక్ లేదా పక్షవాతం, టీబీ, కేన్సర్లు, అంధత్వం, మెనింజైటీస్, ఇతర అవకాశవాద సంక్రమణ వ్యాధులకు గురవుతూ నిర్వీర్యమై పోతున్నారు. ఒకప్పుడు ఎయిడ్స్ అంటే మరణవాంగ్మూలం అనేవారు. అయితే నాలుగు దశాబ్దాల్లో శాస్త్రవేత్తలు ఈ వ్యాధిపై విజయం సాధించి చికిత్సను అందుబాటులోకి తెస్తున్నారు. అత్యంతాధునికమైన ‘బ్రాడ్లీ నూట్రలైజింగ్ ఏంటీ బాడీస్’ (బీఎన్ఏబీఎస్) చికిత్స త్వరలో అందుబాటులోకి వస్తుంది. మూడు లేక నాలుగు బీఎన్ఏబీఎస్ల ను కలిపి రోగి శరీరంలోకి పంపిస్తే అవి అన్ని రకాల హెచ్ఐవీ స్ట్రెయిన్స్నీ పూర్తిగా నిర్మూలిస్తాయని ప్రఖ్యాత మెడికల్ జర్నల్ ‘నేచర్’ ధ్రువీకరించింది. ‘న్యూ ఇంగ్లాండ్ జనరల్ ఆఫ్ మెడిసిన్’లో తాజాగా వెలువడిన పరిశోధన ఫలితాల ప్రకారం ఓకాబ్రియా ఇంజక్షన్ సంవత్సరానికి ఒకటి లేదా రెండు పర్యాయాలిస్తే హెచ్ఐవీ సమూలంగా నాశన మవుతుందని తేలింది. హెచ్ఐవీని పూర్తిగా నయం చేయడానికి (సీఆర్ఐపీఆర్) ‘క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్ స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్’ అని పిలువబడే జీన్ ఎడిటింగ్ విధానానికి అమెరికా ‘ఫుడ్ అండ్ డ్రగ్ ఎడ్మినిస్ట్రేషన్’ (ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది. ఏంటీబాడీస్ ఇంజక్షన్లను వాడటం, కిక్ అండ్ కిల్ లాంటి అత్యాధునిక వైద్య విధానాన్ని అనుసరించడం వంటివాటి ద్వారా ఈ రోజో రేపో ఎయిడ్స్‌పై పూర్తి విజయాన్ని మన వైద్యులు ప్రకటించనున్నారు. (క్లిక్: అందమైన అమ్మాయి.. ఆమె ఓ డాక్టర్! టీనేజ్ అఫైర్‌ను గుర్తు చేసుకుని.. చివరికి) - డాక్టర్ కూటికుప్పల సూర్యారావు ప్రముఖ వైద్యనిపుణులు, అంతర్జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థ సభ్యులు (డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినం) -
హెచ్ఐవీ బాధితులకు హెపటైటిస్ వ్యాక్సిన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని హెచ్ఐవీ బాధితులందరికీ హెపటైటిస్ వ్యాక్సిన్ వేయాలని ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే హెచ్ఐవీ బాధితులకు హెపటైటిస్–బి వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. ప్రస్తుతమున్న హెపటైటిస్ బాధితుల్లోనూ హెచ్ఐవీ సోకిన వారే ఎక్కువగా ఉన్నారని ఆరోగ్య శాఖ పరిశీలనలో తేలింది. రాష్ట్రవ్యాప్తంగా 1.90 లక్షల మంది హెచ్ఐవీ బాధితులున్నారు. వీరంతా రాష్ట్రంలోని 45 యాంటీ రిట్రోవైరల్ టెస్టింగ్ (ఏఆర్టీ) సెంటర్లలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ సెంటర్లలోనే వీరికి వ్యాక్సిన్ వేయాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అలాగే బోధనాస్పత్రుల్లో కూడా వ్యాక్సిన్ వేస్తారు. ముందుగా వైద్య పరీక్షలు చేసి.. ఆ తర్వాతే వ్యాక్సిన్ వేయాలని ఆదేశాలిచ్చారు. వైద్య పరీక్షలు చేశాక హెపటైటిస్ ఉందని భావిస్తే.. వారిని వెంటనే మోడల్ ట్రీట్మెంట్ సెంటర్లకు పంపించి వైద్యమందిస్తారు. ముందుగా ఏఆర్టీ సెంటర్లలో పనిచేస్తున్న వైద్య అధికారులందరికీ ప్రత్యేక శిక్షణ ఇస్తారు. టెస్టులు, చికిత్సలకు సంబంధించిన సాంకేతిక సహకారాన్ని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అందిస్తుంది. -
ఎయిడ్స్ ఉందన్న విషయం దాచి పెళ్లి.. బిడ్డను కోల్పోయా..
వెబ్‌డెస్క్: అన్యోన్య దాంపత్యానికి తొలి మెట్టు నమ్మకం... దాపరికాలు, అరమరికలు లేకుంటేనే సంసారం సాఫీగా సాగిపోతుంది.. కానీ పెళ్లి అనే బంధమే అబద్ధంతో మడిపడితే... అది కూడా ఒక భర్త భార్య దగ్గర అస్సలు దాచకూడని విషయం దాస్తే... దాని కారణంగా ఆమె కన్నబిడ్డను కోల్పోవాల్సి వస్తే.. ఆ స్త్రీ పడే వేదన వర్ణనాతీతం. అస్సాంకు చెందిన జాహ్నవీ గోస్వామి ఇలాంటి బాధను అనుభవించారు. అయితే, భర్త కారణంగా హెచ్ఐవీ బారిన పడిన ఆమె.. అందరిలా కుంగిపోకుండా ధైర్యంగా ముందుకు సాగారు. తనలాంటి ఎంతో మంది బాధితులకు అండగా నిలుస్తున్నారు. తన ఆశ్రమంలో ఉన్న చిన్నారులతో ‘అమ్మా’ అని పిలిపించుకుంటూ, వారి కేరింతల్లో తన కూతుర్ని చూసుకుంటున్నారు. ఎంతో మందికి ఆదర్శప్రాయురాలైన జాహ్నవి గురించిన వివరాలు ఆమె మాటల్లోనే.. 17 ఏళ్లకే పెళ్లి.. ‘‘పదో తరగతిలోనే చదువు మానేయాల్సి వచ్చింది. పదిహేడేళ్లకు పెళ్లి. పెద్దలు కుదిర్చిన వివాహం మాది. మావారు ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడేవారు. ఎందుకిలా అవుతుంది అని అడిగినందుకు నన్ను తీవ్రంగా తిట్టి, కొట్టి హింసించేవారు. కానీ, ఒకరోజు ఆయన వేసుకుంటున్న టాబ్లెట్లు నా కంటపడ్డాయి. ఇవేంటని ప్రశ్నించాను. విటమిన్ టాబ్లెట్లు అన్నారు. అయినా, నాకెందుకో అనుమానం తీరలేదు. ఇలా కాలం సాగిపోతుండగా... గర్భవతిని అయ్యానన్న విషయం తెలిసింది. అమ్మ కాబోతున్నానన్న సంతోషం ముందు ఈ బాధలేమీ పట్టించుకోలేదు. కానీ, ఎప్పుడైతే ఆడబిడ్డకు జన్మనిచ్చానని తెలిసిందో.. నా భర్త ఆస్పత్రికి వచ్చి మరీ నన్ను తీవ్రంగా కొట్టారు. కేవలం మగ పిల్లాడిని కనేందుకే నన్ను పెళ్లి చేసుకున్నానంటూ ఇష్టం వచ్చినట్లు తిట్టారు. 3 నెలలకు మళ్లీ ఆయనకు అనారోగ్యం. ఈసారి డాక్టర్లు భయంకరమైన నిజం చెప్పారు. నా భర్తకు ఎయిడ్స్ సోకింది. పర స్త్రీలతో లైంగిక సంబంధాలు.. ఈ విషయం గురించి నిలదీశాను. పెళ్లికి ముందే ఆయనకు ఈ విషయం తెలుసట. బిజినెస్ ట్రిప్పులకు వెళ్లినపుడు చాలా మంది స్త్రీలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నారట. కానీ కుటుంబ సభ్యుల ఒత్తిడితో మా వాళ్ల దగ్గర నిజం దాచి నన్ను వివాహం చేసుకున్నారట. అది కూడా అబ్బాయికి జన్మనిస్తే వారి వంశం నిలబడుతుందనే ఆశతో.. నా గుండె ముక్కలైంది. ఈ చేదు నిజాన్ని జీర్ణించుకునేలోపే నా భర్త చనిపోయాడు. అంతలోనే మరో షాక్.. ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటే నాకూ, నా కూతురు కస్తూరికి హెచ్ఐవీ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. నా ప్రపంచం చీకటైపోయింది.. నా బిడ్డను ఒడిలో పెట్టుకుని ఎంతలా ఏడ్చానో నాకే తెలుసు. అత్తింటి వారు మమ్మల్ని పట్టించుకోలేదు. పైగా వేధింపులకు గురిచేశారు. విధిలేక పుట్టింటికి చేరాను. నేను ఉన్నానని తెలిసి చాలా మంది మా ఇంటికి రావడమే మానేశారు. దీంతో దుఃఖం పొంగుకొచ్చింది. నేనూ, నా బిడ్డ ఆస్పత్రిలో చేరాం. అక్కడ డాక్టర్లకు కూడా హెచ్ఐవీ పేషెంట్లకు ముట్టుకోవడం అంటే భయమే. ఎలాగోలా కాలం వెళ్లదీస్తున్న సమయంలో.. కస్తూరికి టీబీ వచ్చింది. రెండేళ్ల వయసులో తను నా నుంచి శాశ్వతంగా దూరమైంది. నా ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సరైన చికిత్స లేని కారణంగా నా బిడ్డను కోల్పోవాల్సి వచ్చిందని కోర్టులో కేసు వేశాం. నా గురించి ఈ విషయాలన్నీ తెలిసి, మా స్కూల్ ప్రిన్సిపల్ నన్ను కలవడానికి వచ్చారు. నా టీచర్లను కూడా తీసుకువచ్చారు. నా మనసు కస్తూరి జ్ఞాపకాల నుంచి పుస్తకాల వైపు మళ్లేలా చేశారు. నా అక్కాచెల్లెళ్లు వారు కూడబెట్టుకున్న డబ్బుతో నన్ను చదివించారు. అలా సోషల్ వర్క్‌లో మాస్టర్స్ చేశాను. కానీ హెచ్ఐవీ ఉన్న కారణంగా నన్ను ఎవరూ ఉద్యోగంలోకి తీసుకోలేదు. ఒక్క నెలలో 13 ఇళ్లు మారాల్సి వచ్చింది. అప్పుడే హైకోర్టులో నా పిటిషన్ విచారణకు వచ్చింది. కూతురి మరణానికి నష్టపరిహారంగా 2 లక్షల రూపాయలా లేదంటే, ఉద్యోగమా ఈ రెండు ఆప్షన్లను నా ముందు ఉంచింది. నేను రెండోదాన్నే ఎన్నుకున్నాను. అస్సాం రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సొసైటీలో హెచ్ఐవీ పేషెంట్లకు కౌన్సిలింగ్ ఇచ్చే ఉద్యోగానికి కుదిరాను. పేషెంట్ల తరఫున పోరాడాను. అమ్మా అన్న పిలుపే అమితానందం నా సేవలు వినియోగించుకున్న ఎంతో మంది నా దగ్గరికి వచ్చి ధన్యవాదాలు చెప్పేవారు. సేవా కార్యక్రమాలు మరింత విస్త్రృతం చేయాలనే సంకల్పంతో 2004లో అస్సాం నెట్వర్క్ ఆఫ్ పాజిటివ్ పీపుల్ అనే సంస్థను నెలకొల్పాను. ఇందులో హెచ్ఐవీ పేషెంట్లే వాలంటీర్లు. ఈ వ్యాధి బారిన చిన్నారుల కోసం.. నా కూతురు కస్తూరి జ్ఞాపకార్థం అనాథాశ్రమాన్ని స్థాపించాను. వారి చదువు, పోషణ, చికిత్సకు అయ్యే ఖర్చును మా సంస్థ చెల్లిస్తుంది. ప్రతి ఏడాది కస్తూరి పుట్టిన రోజు చిన్నారులతో కలిసి కేక్ కట్ చేస్తాను. పేషెంట్లకు నిత్యావసర వస్తువులు పంపిస్తాను. అయితే, వీటన్నింటి కంటే నాకు ఎక్కువ సంతోషాన్నిచ్చే విషయం ఏమిటంటే.. ఆ పిల్లలంతా నన్ను ‘అమ్మా’ అని పిలవడమే’’ అని తన జీవితంలో జరిగిన ఘటనల గురించి జాహ్నవి హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. కాగా, ఈశాన్య రాష్ట్రాల్లో హెచ్ఐవీ పేషెంట్ అన్న విషయం బహిర్గతం చేసిన తొలి మహిళగా ఆమె నిలిచారు. ‘‘హెచ్ఐవీ పాజిటివ్ అయిన వాళ్లు.. జీవితంలో ఎందుకు పాజిటివ్(సానుకూలంగా) ఉండకూడదు. అలాంటి మార్గాన్ని ఎందుకు ఎంచుకోకూడదు’’ అనేది ఆమె తరచూ చెప్పే మాట. -
ఆ మత్తులో ఏంచేశానో.. 20 ఏళ్లకే హెచ్ఐవీ బారినపడ్డా
ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు తప్పు చేయడం సహజం. అయితే తాము చేసిన తప్పును గ్రహించి సరిదిద్దుకోని భవిష్యత్తును సరికొత్తగా నిర్మించుకునేవారు కొందరే ఉంటారు. ఈ కోవకు చెందిన వారే వాన్లాల్రువాటీ కోల్ని. మిజోరంకు చెందిన కోల్ని బాల్యంలోనే మత్తుపదార్థాలకు బానిసైంది. ఇరవై ఏళ్లకే హెచ్ఐవీ బారిన పడింది. అనేక ఇబ్బందులు ఎదురవ్వడంతో తను ప్రయాణించే మార్గం సరైనది కాదని గ్రహించి తన జీవితాన్ని చక్కదిద్దుకోవడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే తనలా బాధపడుతోన్న వారికి అండగా నిలుస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. ఐజ్వాల్‌కు చెందిన 37 ఏళ్ల వాన్లాల్రువాటి కోల్నికి ఎలా అయిందో కానీ చిన్నప్పుడే డ్రగ్స్ అలవాటయింది. ఆ మత్తులో తను ఏం చేస్తుందో తనకి తెలిసేది కాదు. ఫలితంగా 20 ఏళ్లకే హెచ్ఐవీ బారిన పడడంతో శరీరంపై నొప్పితో కూడుకున్న గుల్లలు వచ్చి వాటి నుంచి చీము కారేది. దీంతో తను చికిత్స తీసుకునే ఆసుపత్రి సిబ్బంది ఆమె దగ్గరకు రావడానికి కూడా వెనకాడేవారు. ఒకపక్క శారీరక బాధ, మరోపక్క సమాజం చూపే చీదరింపులు తనని మానసికంగా కుంగదీశాయి. ఎలాగైనా ఈ పరిస్థితి నుంచి బయటపడాలనుకుంది కోల్ని. పాజిటివ్ ఉమెన్స్ నెట్వర్క్ ఆఫ్ మిజోరం మారాలనుకున్న వెంటనే... డ్రగ్స్ తీసుకోవడం మానేసి ఇంటికి దగ్గర్లో ఉన్న ప్రార్థనామందిరానికి వెళ్లడం ప్రారంభించింది. వాళ్ల బోధలతో తనని తాను మానసికంగా దృఢపరచుకుంది. సమాజంలో ఛీత్కారానికి గురవుతోన్న హెచ్ఐవీ రోగులను ఆదుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే 2007లో ‘పాజిటివ్ ఉమెన్స్ నెట్వర్క్ ఆఫ్ మిజోరం’(పీడబ్ల్యూన్ఎమ్) పేరిట సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ద్వారా హెచ్ఐవీతో బాధపడుతోన్న మహిళలను ఒక చోటకు చేర్చి వారిని మానసికంగా, ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రోత్సహించడం ప్రారంభించింది. హెచ్ఐవీ రోగుల హక్కులు కాపాడడం, వైద్యసాయం, పునరావాసం ఏర్పాటు చేయడం, వారికి ప్రభుత్వం అందిస్తోన్న పథకాలను అనుసంధానించడం, వివిధ రకాల వొకేషనల్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం...ఇలా ఇప్పటి వరకు ఆమె సంస్థ ద్వారా సుమారు పదివేలమందికి పైగా లబ్ధి పొందారు. కోవిడ్–19 మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలోనూ ఎన్జీవో గూంజ్, యూఎన్ ఎయిడ్స్ సంస్థలతో కలిసి డ్రగ్స్ వ్యసనపరులను ఆదుకునేందుకు కృషిచేస్తున్నారు. సమాజంలో ఎదురైన అనేక చీత్కారాలను దాటుకోని నిబద్ధతతో తన పీడబ్ల్యూఎన్ఎమ్ సంస్థను ముందుకు నడిపిస్తోన్న కోల్నికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 2019లో హెల్త్ కేటగిరీలో ‘ఉమెన్ ఎక్సెంప్లార్ అవార్డు ఆమెను వరించింది. ‘‘ప్రస్తుత కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న ఈ సమయంలోనూ సరైన జాగ్రత్తలు పాటిస్తూ మా పరిధిలో చేయగలిగిన సాయం చేస్తున్నాం. గత 18 ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ, ఎన్నో నేర్చుకున్నాను. ఈ అనుభవాలే నన్ను ముందుకు నడిపిస్తున్నాయి’’ అని కోల్ని చెప్పింది. -
‘సుష్మ స్పర్శ వారి జీవితాలను మార్చింది’
తిరువనంతపురం: చెరగని చిరునవ్వుకు, నిండైన భారతీయతకు నిలువెత్తు నిదర్శనం సుష్మా స్వరాజ్. దేశ ప్రజలందరిని తన బిడ్డలుగా ప్రేమించగలిగిని అతి కొద్ది మందిలో సుష్మా స్వరాజ్ ఒకరు. ప్రపంచ నలుమూలల ఉన్న భారతీయులు ఎవరూ సాయం కోరినా తక్షణమే స్పందించేవారు సుష్మా స్వరాజ్. ప్రాంతాలకు, పార్టీలకతీతంగా అభిమానులను సంపాదించుకున్న సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి గుండె పోటుతో మరణించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా మొత్తం చిన్నమ్మ జ్ఞాపకాల్లో తరిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సుష్మకు సంబంధించిన ఓ ఫోటో ఇంటర్నెట్లో తెగ వైరలవుతోంది. వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా హెచ్ఐవీ రోగులంటే చిన్న చూపు ఇంకా పోలేదు. నేటికి ఆ వ్యాధి పట్ల ఎన్నో అపోహలు. 2020లోనే ఇలా ఉంటే.. 2003 కాలంలో పరిస్థితులు ఎలా ఉండేవో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో హెచ్ఐవీ వ్యాధి బారిన పడిన ఇద్దరు చిన్నారులను దగ్గరకు తీసుకుని.. స్పర్శ, కౌగిలించుకోవడం ద్వారా ఈ వ్యాధి సంక్రమించదని సమాజానికి ఓ సందేశం ఇచ్చారు సుష్మా స్వరాజ్. ట్విటర్ యూజర్ పియు నాయర్ పోస్ట్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ‘తల్లిదండ్రుల కారణంగా ఈ చిన్నారులకు ఎయిడ్స్ వ్యాధి సోకింది. దాంతో వీరు చదువుతున్న పాఠశాల యాజమాన్యం.. ఈ చిన్నారులను స్కూల్ నుంచి తొలగించింది. ఇతర ఏ స్కూల్లో కూడా వీరిని చేర్చుకో లేదు. దాంతో చిన్నారుల తాత ఈ విషయాన్ని అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం దృష్టికి తీసుకు వెళ్లారు. దీనిపై స్పందించిన కలాం వారు చదువుకోవడానికి మార్గం చూపడమే కాక ఈ పిల్లల కోసం ఓ ప్రత్యేక ట్యూటర్ని కూడా ఏర్పాటు చేశారు. వీరి గురించి తెలిసిన సుష్మా స్వరాజ్ ఆ రాష్ట్ర పర్యటన సందర్భంగా చిన్నారులను కలుసుకుని ప్రేమగా దగ్గరకు తీకున్నారు. స్పర్శ, కౌగిలించుకోవడం ద్వారా ఎయిడ్స్ వ్యాప్తి చెందదని తెలిపారు’ అంటూ నాయర్ ఈ ఫోటోని ట్వీట్ చేశాడు. నేడు సుష్మా స్వరాజ్ చనిపోయారనే వార్త తెలిసి ఈ పిల్లల తాత తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ‘ఆ రోజు సుష్మాజీ నా మనవల పట్ల చూపిన ప్రేమ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. ఈ పిల్లల చదువకు అవసరమైన సాయం అందేలా సుష్మాజీ ఏర్పాట్లు చేశారు. ఆమె చేసిన మేలును జీవితాంతం మరవలేం’ అన్నారు. ఈ ఇద్దరు పిల్లల్లో ఒకరు 2010లో మృతి చెందగా.. మరొకరికిప్పుడు 23 ఏళ్లు. -
అందరికీ ఆరోగ్యం.. అదే మా నినాదం
జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రతి ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తోంది. డబ్ల్యూహెచ్ఓ ఏర్పడిన రోజునే ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. 1948లో జెనీవాలో తొలిసారిగా జరిగిన డబ్ల్యూహెచ్ఓ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. 2019 సంవత్సరంతో డబ్ల్యూహెచ్ఓ 70 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సంవత్సరానికి గాను ‘అందరికీ ఆరోగ్య రక్షణ’ అనే నినాదాన్ని ఇచ్చింది. ‘కుల, మత, జాతి, ప్రాంత, ఆర్థిక తేడాలు లేకుండా అందరికీ ఒకే విదమైన ఆరోగ్య రక్షణ, నాణ్యమైన సేవలు అందించడం అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధోనం గెహెబ్రేస్స్ తెలిపారు. ఆయన ఆదివారం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో తమ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పత్రిక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెడ్రోస్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో అనేక దేశాల్లో ప్రభలుతున్న వ్యాధులను, అనారోగ్యం వల్ల సంభవించే మరణాలను నిర్మూలించేందుకు తమ సంస్థ చాలా కృషి చేస్తోందని, అయినప్పటికీ ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికి కూడా ప్రపంచంలో సగం జనాభాకు తగిన వైద్యం అందడం లేదని, కొన్ని దేశాల్లో కనీస వైద్య సౌకర్యాలు లేక గర్భిణీ మహిళలు అవస్థలు పడుతున్నారని, చాలా మంది పిల్లలకు రోగనిరోధక టీకాలు కూడా అందడం లేదని టెడ్రోస్ ఆవేదన వ్యక్తం చేశారు. మరికొన్ని దేశాల ప్రజలకు సరైన సమయంలో వైద్యం అందక హెచ్ఐవీ, టీబీ, మలేరియా బారిన పడి చనిపోతున్నారని, 2019 సంవత్సరంతో ఇవన్నీ ఆగిపోవాలని కోరుకుంటున్నాట్లు తెలిపారు. పేద వారికి కూడు, గూడు, గుడ్డతో పాటు ఆరోగ్యం కూడా కనీస సదుపాయంగా కల్పించాలన్నదే తమ ముఖ్య ఉద్దేశ్యమని, అందుకే 2019లో ‘అందరికి ఆరోగ్య రక్షణ ప్రతి ఒక్కరికి, ప్రతి చోటుకు’ అనే నినాదంతో ప్రజలందరికి ఆరోగ్య భద్రత కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామని వెల్లడించారు. -
విల‘పింఛన్’!
కర్నూలు(హాస్పిటల్): తమ రోగాన్ని ఎవరికీ చెప్పుకోలేని అభాగ్యులు వారు. తెలిసో తెలియకో చేసిన తప్పునకు హెచ్ఐవీ బారిన పడి జీవితాంతం బాధపడుతూ నరకం అనుభవిస్తున్నారు. వారి ఇబ్బందులను గుర్తించి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పింఛన్ వచ్చేలా ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం దీనిని నీరుగారుస్తోంది. మొత్తం బాధితుల్లో 10 శాతం మందికి కూడా పింఛన్ ఇవ్వడం లేదు. అది కూడా అరకొరగా ఇస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 19,863 మంది ఎయిడ్స్ బాధితులు.. జిల్లాలో 2009 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు 6,65,187 మందికి వైద్య పరీక్షలు చేయగా 18,776 మందికి హెచ్ఐవీ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అలాగే 5,58,661 మంది గర్భిణులను పరీక్షించి 1,087 మందికి ఈ వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. మొత్తంగా జిల్లాలో 19,863 మంది ఎయిడ్స్ బాధితులు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తేల్చింది. సాధారణ ప్రజల్లో 1.38శాతం, గర్భిణుల్లో 0.06 శాతం మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఇందులో ఏఆర్టీ చికిత్స కోసం నమోదు చేసుకున్న వారి సంఖ్య అక్టోబర్ వరకు 19,377 మంది కాగా క్రమం తప్పకుండా మందులు వాడుతున్న వారి సంఖ్య కేవలం 9,894 మంది మాత్రమే. ఏఆర్టీ ప్లస్ కేంద్రాల్లో రెండో రకం మందులు క్రమం తప్పకుండా వాడుతున్న వారి సంఖ్య 205. అయితే వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం అందడంలేదు. బాధితులకు అరకొర సేవలు ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రుణాల కోసం వంద మంది దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు ఒక్కరికీ మంజూరు కాలేదు. ఐసీడీఎస్ ద్వారా 600 మంది హెచ్ఐవీ బాధిత చిన్నారులకు డబుల్ న్యూట్రిషన్ గోప్యంగా అందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఐసీడీఎస్‌లోని ఐసీపీఎస్ ద్వారా 135 మంది చిన్నారులకు మాత్రమే ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నెలకు రూ.500 ఇస్తున్నారు. 222 మందికి మాత్రమే పింఛన్ జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారం 19,863 మంది హెచ్ఐవీ బాధితులు ఉన్నారు. కానీ ఇప్పటి వరకు 222 మందికి మాత్రమే రూ.1000ల చొప్పున ఫించన్ అందిస్తున్నారు. అందులోనూ కొందరికి సక్రమంగా అందడం లేదు. అధికారులు ఆన్లైన్లో అందరి వివరాలు పంపినా మంజూరు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందరికీ పింఛన్ మంజూరు చేయాలని కోరాం హెచ్ఐవీ బాధితుల వివరాలన్నీ ప్రభుత్వానికి పంపించాం, అందరికీ పింఛన్ మ ంజూరు చేయాలని కోరాం. ఏఆర్టీ కేం ద్రంలో గతంలో నెలకోసారి మాత్రమే మం దులు ఇచ్చేవారు. ప్రస్తుతం మూడు నెలలకు సరిపడా మందులు ఒకేసారి తీసుకెళ్లే అవకాశం కల్పించాం. – డాక్టర్ చంద్రారావు,అడిషనల్ డీఎంహెచ్ఓ -
హెచ్ఐవీ రోగులకు ‘ఆన్లైన్ వివాహ వేదిక’
తోడు కోసం వెతుక్కుంటున్న హెచ్ఐవీ/ఎయిడ్స్ రోగులకు ఆన్లైన్ వివాహ వేదికలు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి.. సూరత్ కేంద్రంగా పనిచేసే గుజరాత్ స్టేట్ నెట్వర్క్ ఆఫ్ పీపుల్ సంస్థ(జీఎస్‌ఎన్‌పీ+) అహ్మదాబాద్ ఐఐఎం సాంకేతిక సహకారంతో తాజాగా ఆన్లైన్ వివాహ వేదికను ప్రారంభించింది. ఈ వ్యాధితో బాధపడుతున్న రోగులు తమ సమస్యను కుటుంబ సభ్యులకు కూడా చెప్పడానికి ఇష్టపడరు. చాలా గోప్యంగా వైద్యులను కలిసి అవసరమైన మందులు వాడుతుంటారు. ఇలాంటి వారికి అదే సమస్యతో బాధపడుతున్న వారు తోడుంటే, మానసిక స్థైరం కల్పిస్తే మెరుగైన జీవితాన్ని గడిపే అవకాశం ఉందన్న లక్ష్యంతో ఈ సంస్థ ఆన్లైన్ వివాహ సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ రోగుల సమస్యలపై గుజరాత్ కేంద్రంగా ఈ సంస్థ పనిచేస్తోంది. గుజరాత్‌లోనే 68 వేల మంది ఏఆర్టీ సెంటర్‌కు వెళ్తున్నారని జీఎస్‌ఎన్‌పీ వ్యవస్థాపకురాలు దక్షా పటేల్ తెలిపారు. పెళ్లి చేసుకోవాలనే ఆసక్తి ఉన్న హెచ్ఐవీ పాజిటివ్ రోగులతో ఇప్పటికే జీఎస్‌ఎన్‌పీ+ ఆరు వివాహ వేదికలను నిర్వహించింది. గత పదేళ్లలో ఈ వేదికల ద్వారా 245 మంది వివాహం చేసుకున్నారు. వివాహ వేదికలో 1900 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మ్యాట్రీమోనీ సర్వీసును ప్రారంభించాలని అనేక మంది ఒత్తిడి తేవడంతో ఆన్లైన్ సేవలు ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వారి ఇరువురి కుటుంబాల్లోని పెద్దలను ముందు కలిసి ఈ విషయం చెబుతాం..భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు www.gsnpplus.orgలో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని త్వరలో కల్పిస్తున్నారు. ఇలా మొదలైంది రాసిక్ భువా అనే యువకుడికి వివాహం నిశ్చయం అయిన తర్వాత హెచ్ఐవీ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. దీంతో ఆ వివాహాన్ని రద్దు చేసుకున్నాడు. హెచ్ఐవీ రోగులకు భువా అప్పటి నుంచి కౌన్సిలింగ్ మొదలు పెట్టాడు. నవశ్రీ అనే యువతి అతడ్ని కలిసింది. తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. మ్యాట్రీమోనియల్ సర్వీసు, తర్వాత ఆన్లైన్ వివాహ వేదిక ప్రారంభించడానికి ఈ సంఘటనే తమకు ప్రేరణ అని జీఎస్‌ఎన్‌పీ+ నిర్వాహకులు తెలిపారు. -
ఆ అధికారికి ఎయిడ్స్ బాధితులంటే వివక్ష!
కర్నూలు(హాస్పిటల్): హెచ్ఐవీ/ఎయిడ్స్ బాధితుల పట్ల జిల్లా ఎయిడ్స్ నియంత్రణాధికారి డాక్టర్ దేవసాగర్ వివక్ష చూపుతున్నారని మానవ హక్కుల కమిషన్, ప్రిన్సిపల్ సెక్రటరీలకు నేస్తం పాజిటివ్ నెట్వర్క్ అధ్యక్షురాలు బి. సుధారాణి గత నెలలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మానవ హక్కుల కమిషన్ నుంచి వచ్చిన నోటీసుల మేరకు బుధవారం డాక్టర్ దేవసాగర్, సుధారాణిలను డీఎంహెచ్ఓ డాక్టర్ జేవీవీఆర్‌కే ప్రసాద్ విచారణ చేశారు. గత నెల 10వ తేదీన ‘ఇంటర్నేషనల్ క్యాండిల్ మెమోరియల్ డే’ కార్యక్రమానికి డాక్టర్ దేవసాగర్‌ను ఆహ్వానించడానికి వెళితే ‘టీబీతో కూడిన హెచ్ఐవీ బాధితులను కాకుండా హెచ్ఐవీ ఉన్న వారిని మాత్రమే పిలవాలి. వారిని కూడా తనకు దూరంగా ఉంచాలని’ దేవసాగర్ చెప్పారని సుధారాణి ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను కూడా ఆయన కార్యాలయంలోకి రానిచ్చేవారు కాదని, దూరంగా ఉండి మాట్లాడాలని చెప్పేవారని ఆరోపించారు. జాతీయ స్థాయిలో వివక్ష ఉండకూడదని అనేక కార్యక్రమాలు తమ సంస్థ చేస్తుంటే జిల్లా అధికారే ఇలా వ్యవహరించడం బాధ కలిగించిందని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఈ విషయమై డాక్టర్ దేవసాగర్ వివరణ ఇస్తూ తాను ఏనాడూ హెచ్ఐవీ బాధితుల పట్ల వివక్ష చూపలేదని, క్యాండిల్ లైట్ ప్రోగ్రామ్‌కు కూడా ఓపెన్ ప్లేస్‌లో నిర్వహించాలని చెప్పాను తప్ప దూరంగా ఉంచాలని అనలేదని వివరణ ఇచ్చుకున్నారు. దీనిపై డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ఇలాంటి వివక్ష మళ్లీ పునరావృతం కాకూడదని, ఇకపై ఇద్దరూ కలిసి పనిచేసుకోవాలని చెప్పి పంపించారు. -
ఎదురుచూపులే..
► హెచ్ఐవీ రోగులకు పింఛన్ల మంజూరులో వివక్ష ►5389 మంది ధరఖాస్తు చేసుకుంటే 3005 మందికి మంజూరు విజయనగరం ఫోర్ట్ : సాలురు మండలానికి చెందిన ఓ హెచ్ఐవీ రోగి ఏడాది కిందట పింఛన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. అరుుతే అతనికి ఇంతవరకు పింఛన్ మంజూరు కాలేదు. అలాగే చీపురుపల్లి మండలానికి చెందిన ఒకరు ఏడాది కిందట పింఛన్‌కు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకపోరుుంది. ఇది ఈ ఇద్దరి పరిస్థితే కాదు.. జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది పింఛన్ల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఏఆర్టీ కేంద్రంలో 8025 మంది పేర్లు నమోదయ్యారుు. ఇందులో 7746 మంది పెద్దలు కాగా 279 మంది పిల్లలున్నారు. ఏళ్ల తరబడి.. పింఛన్ల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులను అడిగితే ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉందని చెబుతున్నారని, పాలకులను అడిగితే ఇదుగో.. అదుగో అంటూ కాలయాపన చేస్తున్నారని రోగులు వాపోతున్నారు. హెచ్ఐవీ రోగుల సంక్షేమానికి పాటు పడుతున్నామని గొప్పలు చెబుతున్న చంద్రబాబు సర్కార్‌కు వీరి బాధలు కనిపించడం లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అల్లాడుతున్న రోగులు జిల్లాలో 90 శాతం మంది రోగులు నిరుపేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారే. కొంతమందికి కూలీ చేస్తే గాని పూటగడవని పరిస్థితి. హెచ్ఐవీ రోగులు పౌష్టికాహారం తీసుకోవాలి. లేనిపక్షంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో పింఛన్ సొమ్ము కొంతైనా ఆసరాగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి మిగిలిన వారందరికీ పింఛన్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 3005 మందికి మాత్రమే.. పింఛన్ల కోసం 5389 మంది దరఖాస్తు చేసుకోగా ఇంతవరకు 3005 మందికి మాత్రమే పింఛన్లు మంజూరయ్యారుు. ఇంకా 2384 మందికి మంజూరు కాకపోవడంతో వారంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. దశలవారీగా.. దశల వారీగా పింఛన్లు మంజూరవుతారుు. దరఖాస్తు చేసుకున్న రోగులందరికీ పింఛన్లు మంజూరవుతారుు. ఇందులో ఆందోళన చెందాల్సిన పని లేదు. - జి. శంకర్రావు,ఏఆర్టీ సీనియర్ వైద్యాధికారి -
డిప్రెషన్‌తో పెరిగే గుండెపోటు ముప్పు
హెచ్ఐవీ బాధితులు తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతుంటే.. వాళ్లకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అప్పటికే హెచ్ఐవీ ఉండి, దాంతోపాటు మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ (ఎండీడీ) కూడా ఉన్న బాధితులు ఎక్కువగా మూడ్ సంబంధిత సమస్యలతో బాధపడతారని, దానివల్ల ఎప్పుడూ విపరీతమైన బాధ, ఏ విషయం మీదా ఆసక్తి ఉండదని... ఈ కారణాలతో ఎక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (ఏఎంఐ) లేదా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందన్నారు. బాగా ప్రభావవంతమైన యాంటీ రెట్రోవైరల్ థెరపీతో వాళ్ల జీవనకాలం పెరుగుతుందని, హెచ్ఐవీ శరీరంలో ఉన్నా ఎక్కువ కాలం బతుకుతారని వివరించారు. కానీ అదే సమయంలో వారికి గుండెకవాటాలకు సంబంధించిన వ్యాధులు (కార్డియో వాస్క్యులర్ డిసీజెస్ - సీవీడీ) వచ్చే ప్రమాదం పెరుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే వీళ్లకు హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్, కిడ్నీ వ్యాధులు తదితరాలకు మందులు ఇస్తుంటే మాత్రం ఈ తరహా ముప్పు కొంతవరకు తగ్గినట్లు కనిపించింది. హెచ్ఐవీ ఉన్నవారితో పాటు.. సాధారణ ప్రజల్లో ఎండీడీ ఉన్నవాళ్లకు కూడా ఇలాంటి ముప్పు ఉండొచ్చని, అయితే వీరికి మాత్రం మరింత ఎక్కువగా ఉంటుందని అమెరికాలోని వాండెర్‌బిల్ట్ యూనివర్సిటీ స్కూలుకు చెందిన మాథ్యూ ఎస్ ఫ్రీబెర్గ్ చెప్పారు. హెచ్ఐవీ బాధితులలో సీవీడీ ముప్పును తగ్గించడానికి చేపట్టాల్సిన చర్యల గురించి అత్యవసరంగా ఆలోచించాలని తెలిపారు. ఈ పరిశోధన వివరాలను జామా కార్డియాలజీ సంస్థ ఆన్లైన్లో ప్రచురించింది. -
అభాగ్యుల్లో ఆశాజ్యోతి
అనాథ చిన్నారులకు ఆశ్రయం పదో వసంతంలోకి వడివడిగా అడుగులు దాతల సహకారంతో బాధితులకు అండగా... గజ్వేల్‌రూరల్: చుట్టూ పచ్చని చెట్లు.. ఆహ్లాదకరమైన వాతావరణం.. అందులోకి వెళ్తుంటే ఓ ఉద్యానవనంలోకి వెళ్ళినట్లు ఉంటుంది. ప్రజ్ఞాపూర్ నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో రాజీవ్ రహదారికి పక్కన 2.2ఎకరాల విశాలవంతమైన ప్రాంతంలో ఉన్న ‘ఆశాజ్యోతి’కి ప్రతి నిత్యం వివిధ ప్రాంతాల నుంచి హెచ్ఐవీ/ఎయిడ్స్‌తో బాధపడుతున్న వారు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుని వెళుతుంటారు. మరి కొందరు అక్కడే ఉండి వైద్య చికిత్స పొందుతున్నారు. వీరితో పాటు మరో 35మంది వరకు (తల్లి... తండ్రిని కోల్పోయిన) హెచ్ఐవీ బాధిత అనాథ చిన్నారులు ఆశ్రయం పొందుతూ తమ జీవితకాలాన్ని పొడిగించుకుంటున్నారు. వారికి ఉచితంగా మందులను ఇవ్వడంతో పాటు పౌష్టికరమైన ఆహారాన్ని అందిస్తూ బాధితులను అక్కున చేర్చుకుంటుంది ‘ఆశాజ్యోతి’... 2006లో ఏర్పాౖటెన ఈ కేంద్రం పదో వసంతంలోకి అడుగులు వేస్తోంది. ‘ఆశాజ్యోతి’ ఏర్పాటు 2006 ఆగస్టు 8న గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ గ్రామ శివారులో ఎస్వీడీ(సొసైటీ ఆఫ్ డివైన్వర్డ్ మిషన్)్ఙదైవవాక్కు సభ’ సంస్థకు చెందిన హైదరాబాద్ ఫ్రావిన్స్ వారు ‘ఆశాజ్యోతి’ని ఏర్పాటు చేశారు. అప్పటì భారీ పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డి దీన్ని ప్రారంభించారు. ఆరోగ్య కార్యక్రమాల్లో భాగంగా హెచ్ఐవీ/ఎయిడ్స్ సోకి జీవించే వారిని పరామర్శించడంతో పాటు వారి బాధలను విముక్తి చేసేందుకు అతి ముఖ్యమైన సేవా కార్యక్రమంగా పరిగణించి, నిరాశ, నిసృ్పహలకు గురైన వారి జీవితాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో ఈ సంస్థ ఏర్పాౖటెంది. 2012 నుంచి ఫాదర్ ఆల్వీన్ డైరెక్టర్‌గా, ఫాదర్ ఫెలిక్స్ సుపీరియర్లుగా ఈ కేంద్రాన్ని నడిపిస్తున్నారు. సేవలు ప్రజ్ఞాపూర్‌లో గల ఆశాజ్యోతి కేంద్రం(క్లస్టర్) నుంచి మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల పరిధిలోని హెచ్ఐవీ బాధితులకు సేవలందిస్తున్నారు. రోజు సుమారు 25మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వైద్య చికిత్సలు పొందుతున్నారు. ఇక, పదుల సంఖ్యలో ఆశ్రయం పొందుతూ చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల నుంచి సుమారుగా 7200 మంది వచ్చి ఈ కేంద్రం నుంచి చికిత్స పొందగా..6,362 మంది బయటి నుంచి వచ్చిన వారు ఆశ్రయం పొంది చికిత్స చేయించుకున్నారు. వీరికి గజ్వేల్ పట్టణానికి చెందిన వైద్యుడు మల్లయ్య రోజూ వైద్య చికిత్స అందిస్తున్నారు. అలాగే మెడిసిటీకి చెందిన చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ బీ.రంగారెడ్డి (ప్రతి ఆదివారం), గజ్వేల్ ఎస్పీహెచ్పీవో రామకృష్ణ (ప్రతి సోమవారం) ‘ఆశాజ్యోతి’కి వచ్చి బాధితులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వం నిధుల విడుదలకు చర్యలు చేపట్టాలి ఒక్క తెలంగాణాలో మాత్రమే ‘ఆశాజ్యోతి’ హెచ్ఐవీ/ఎయిడ్స్ కేర్ సెంటర్ ఉంది. గతంలో ఈ కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులను రద్దు చేయడంతో ఎస్వీడీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ‘ఆశాజ్యోతి’ని కొనసాగిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం నిధుల మంజూరుకు చర్యలు చేపడితే మరింత మంది హెచ్ఐవీ బాధితులకు మెరుగైన చికిత్సను అందించేందుకు వీలు కలుగుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ చూపి బాధితుల్లో వెలుగులు నింపాలి. – ఆశాజ్యోతి సంస్థ డైరెక్టర్ ఫాదర్ ఆల్వీన్ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి ‘జీవోదయ’ సంస్థ ఆధ్వర్యంలో ‘ఆశాజ్యోతి’ క్లస్ట ర్ పరిధిలో హెచ్ఐవీ/ ఎయిడ్స్ నిర్మూలనకు విశేషంగా కళాజాత కా ర్యక్రమాలను నిర్వహిస్తు న్నారు. వీటితో పాటు గ్రామాల అభివృద్ధి, మహిళ, యువత, రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ఆటపాటల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. అయితే నిధుల కొరత వల్ల ప్రజల్లోకి పూర్తిస్థాయిలో వెళ్ళలేక దాతల సహకారం కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ చూపి సాంస్కృతిక కళామండలి ఆధ్వర్యంలో కళాజాతకార్యక్రమాలను నిర్వహిస్తే బాగుంటుంది. – జీవోదయ సంస్థ డైరెక్టర్, ‘ఆశాజ్యోతి’ సంస్థ సుపీరియర్ ఫాదర్ ఫెలిక్స్రోచ్ దాతల సహకారం మరువలేనిది ‘ఆశాజ్యోతి’కి ప్రభుత్వం నిధులు నిలిపివేయడంతో హెచ్ఐవీ బాధితులు, అనా«థ చిన్నారులు ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో దాతలు ముందుకు వచ్చి అం దించిన సేవలు, సహకారం మరువలేనిది. ప్రభుత్వం చొరవ చూపి ఆశాజ్యోతికి నిధులు వచ్చేలా చూడాలి. – ‘ఆశాజ్యోతి’ సంస్థ కోఆర్డినేటర్ వీరబాబు -
బతికుండగానే చంపేస్తున్నారు!
- హెచ్ఐవీ రోగుల ఆవేదన - చికిత్సకోసం వెళితే చిత్రవధ చేస్తున్నారని నిట్టూర్పు - కింగ్‌కోఠి మెడికల్ ఆఫీసర్ తీరుపై అసహనం - ఇతర సెంటర్లకు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్న వైనం సాక్షి, సిటీబ్యూరో: చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న హెచ్ఐవీ (ఎయిడ్స్) రోగులకు ఆదరణ కరువైంది. ఓ వైపు సకాలంలో మందులు అందక ఇబ్బందులు పడుతుంటే.. మరో వైపు చికిత్స కోసం వెళ్లిన వీరిని వైద్యుల తీరు మరింత కుంగిపోయేలా చేస్తోంది. ఆప్యాయంగా పలకరించాల్సిన ఏఆర్టీ(యాంటీ రెట్రల్ వైరల్ సెంటర్) మెడికల్ ఆఫీసర్లు తమ సూటిపోటి మాటలతో మనోవేదనకు గురి చేస్తున్నారు. దీంతో రోగులు చావడానికైనా సిద్ధపడుతున్నారు కానీ.. చికిత్సకు వెళ్లేందుకు మాత్రం నిరాకరిస్తున్నారు. నగరంలో సుమారు లక్ష మంది వరకు హెచ్ఐవీ బాధితులు ఉండగా, వీరి కోసం గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, ఎర్రగడ్డలోని ఛాతి ఆస్పత్రి, కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రులలో ఏఆర్టీ సెంటర్లు ఏర్పాటు చేశారు. చికిత్స కోసం ఆయా కేంద్రాలకు వెళ్తున్న వీరికి అక్కడి సిబ్బంది తమ మాటలతో బతికుండగానే నరకం చూపిస్తున్నారు. 140 మంది రోగులు బదిలీ... కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రి ఏఆర్టీ సెంటర్లో 2,900 మంది రోగులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో సీడీ4 కౌంట్ 350 కన్న తక్కువ ఉన్న వారు 1,250 మంది వరకు ఉన్నారు. వీరికి ప్రతి నెలా సీడీ4 కౌంట్ పరీక్ష చేసి, మందులు సరఫరా చేస్తారు. ఇక్కడ పని చేస్తున్న మెడికల్ ఆఫీసర్ తీరుతో వీరంతా మానసిక క్షోభకు గురవుతున్నారు. దీంతో ఇక తాముఈ సెంటర్‌కు రాలేమని, వేరే సెంటర్‌కు ట్రాన్స్ఫర్ చేయాలని కోరుతున్నారు. ఇక్కడ పని చేస్తున్న సిబ్బంది సైతం తమకు బదిలీ కావాలని వేడుకుంటున్నారు. ఇలా ఇప్పటికే సుమారు 140 మంది రోగులు ఇక్కడి నుంచి వేరే సెంటర్‌కు వెళ్లి పోయారంటే మెడికల్ ఆఫీసర్ వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పని చేస్తున ్న డాటా మేనేజర్ రోగుల సంక్షేమానికి ఉపయోగించాల్సిన నిధులను పక్కదారి పట్టించినట్లు తెలిసింది. ఫర్నిచర్, కంప్యూటర్ల కొనుగోళ్లలో తప్పుడు కొటేషన్లు చూపించి ఎక్కువ బిల్లులు డ్రా చేశారనే ఆరోపణలున్నాయి. మరో ఆసక్తికరమైన అంశమేమంటే ఇదే వ్యక్తి ఉదయం కింగ్‌కోఠి ఏఆర్టీ సెంటర్లో పని చేసి, సాయంత్రం ఉస్మానియా ఆరోగ్యశ్రీ విభాగంలో పని చేస్తుండటం. ఉస్మానియాలో తీవ్ర అంతరాయం... ఉస్మానియా ఆస్పత్రి ఏఆర్టీ సెంటర్ అవుట్ పేషంట్ విభాగానికి రోజూ 250-300 మంది రోగులు వస్తుండగా, వీరికి చికిత్స చేయడానికి ఒకే మెడికల్ ఆఫీసర్ ఉన్నారు. దీంతో వైద్య సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. చికిత్స కోసం వచ్చిన కొంతమంది రోగులకు టీబీ ఉండటంతో వారు దగ్గినప్పుడు గాలి ద్వారా ఇతరులకు వ్యాపిస్తోంది. గాంధీలో సరిపడు మందులు ఇవ్వకపోవ డంతో తరచూ రోగులు ఆందోళనకు దిగుతున్నారు. ఇక నిలోఫర్ నవజాత శిశువుల ఆస్పత్రిలోని ఏఆర్టీ సెంటర్లోని మెడికల్ ఆఫీసర్ సమయానికి రాకపోవడం, ఒక వేళ వచ్చిన మధ్యాహ్నం రెండు గంటలకే తిరుగు ప్రయాణం కడుతుండటం వల్ల సరిహద్దు జిల్లాల నుంచి వచ్చే రోగులకు అవస్థలు తప్పడం లేదు. -
బీపీఎల్ కేటగిరీలోకి హెచ్ఐవీ బాధితులు!!
హెచ్ఐవీ బాధితులందరినీ బీపీఎల్ కేటగిరీలోకి తీసుకురావాలని గోవా యోచిస్తోంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మీకాంత్ పర్సెంకర్ తెలిపారు. రాష్ట్ర జనాభాలో ప్రధానంగా తీరప్రాంతాల్లో ఉన్న వారిలో ఒక శాతం మంది హెచ్ఐవీ సోకినవారేనని ఓ అధికారి తెలిపారు. వీరందరినీ దారిద్ర్యరేఖకు దిగువ స్థాయికి తేవడం వల్ల వాళ్లకు అన్ని రకాల సదుపాయాలు సులభంగా లభిస్తాయని అన్నారు. ఈ విషయాన్ని గోవా ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గ సహచరులతో కూడా చర్చిస్తానని పర్సెంకర్ అసెంబ్లీ ప్రాంగణంలో విలేకరులకు తెలిపారు. గోవాలో ఇప్పటికీ 14వేల మందికి పైగా హెచ్ఐవీ సోకినవారు ఉన్నారని, రాబోయే ఐదేళ్లలో ఈ సంఖ్యను సున్నాకు తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు.