హెచ్ఐవీ బాధితులందరినీ బీపీఎల్ కేటగిరీలోకి తీసుకురావాలని గోవా యోచిస్తోంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మీకాంత్ పర్సెంకర్ తెలిపారు. రాష్ట్ర జనాభాలో ప్రధానంగా తీరప్రాంతాల్లో ఉన్న వారిలో ఒక శాతం మంది హెచ్ఐవీ సోకినవారేనని ఓ అధికారి తెలిపారు. వీరందరినీ దారిద్ర్యరేఖకు దిగువ స్థాయికి తేవడం వల్ల వాళ్లకు అన్ని రకాల సదుపాయాలు సులభంగా లభిస్తాయని అన్నారు.
ఈ విషయాన్ని గోవా ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గ సహచరులతో కూడా చర్చిస్తానని పర్సెంకర్ అసెంబ్లీ ప్రాంగణంలో విలేకరులకు తెలిపారు. గోవాలో ఇప్పటికీ 14వేల మందికి పైగా హెచ్ఐవీ సోకినవారు ఉన్నారని, రాబోయే ఐదేళ్లలో ఈ సంఖ్యను సున్నాకు తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు.
బీపీఎల్ కేటగిరీలోకి హెచ్ఐవీ బాధితులు!!
Published Fri, Aug 8 2014 4:18 PM | Last Updated on Sat, Sep 2 2017 11:35 AM
Advertisement
Advertisement