World AIDS Day 2022: ఒక్క ‘షాట్‌’తో ఎయిడ్స్‌కు దూరం | World AIDS Day 2022: Theme, Slogan, Latest Medicine, Vocabria Injection | Sakshi
Sakshi News home page

World AIDS Day 2022: ఒక్క ‘షాట్‌’తో ఎయిడ్స్‌కు దూరం

Published Wed, Nov 30 2022 8:01 PM | Last Updated on Wed, Nov 30 2022 8:02 PM

World AIDS Day 2022: Theme, Slogan, Latest Medicine, Vocabria Injection - Sakshi

ఎయిడ్స్‌పై మానవుని పోరాటం చివరి దశకు చేరింది. అందువల్ల ఎయిడ్స్‌ రోగులు ధైర్యంగా ఉండవచ్చు. 2020లో జరిగిన అధ్యయనాల ప్రకారం హెచ్‌ఐవీ రోగుల్లో 40 శాతం మంది డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. కొందరు ఆత్మహత్యలకూ పాల్పడుతున్నారు. నిజానికి ఎయిడ్స్‌ ఉన్నా పెళ్లి చేసుకోవచ్చని రోగులు గుర్తించాలి. ఎయిడ్స్‌పై అవగాహన పెంచడానికి 1988 నుంచీ ప్రతీ ఏడాదీ డిసెంబర్‌ 1వ తేదీని ‘ప్రపంచ ఎయిడ్స్‌ దినం’గా పాటిస్తున్నాము. 

ఈ ఏడు ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితి సంయుక్తంగా  ‘సంఘీభావంతో – ఎయిడ్స్‌ నివారణ బాధ్యతల్లో భాగస్వామ్యం కావాలి’ అనే నినాదాన్ని ఇచ్చాయి. జీవితాంతం మాత్రలు వాడటానికి 70 శాతం రోగులు ఇష్టపడటం లేదు. అందుకే మధ్యలో మందులు ఆపేయడం, అస్తవ్యస్థంగా మందులు వాడడం ద్వారా అర్థాంతరంగా హార్ట్‌ ఎటాక్‌ లేదా పక్షవాతం, టీబీ, కేన్సర్లు, అంధత్వం, మెనింజైటీస్, ఇతర అవకాశవాద సంక్రమణ వ్యాధులకు గురవుతూ నిర్వీర్యమై పోతున్నారు. 

ఒకప్పుడు ఎయిడ్స్‌ అంటే మరణవాంగ్మూలం అనేవారు. అయితే నాలుగు దశాబ్దాల్లో శాస్త్రవేత్తలు ఈ వ్యాధిపై విజయం సాధించి చికిత్సను అందుబాటులోకి తెస్తున్నారు. అత్యంతాధునికమైన ‘బ్రాడ్లీ నూట్రలైజింగ్‌ ఏంటీ బాడీస్‌’ (బీఎన్‌ఏబీఎస్‌) చికిత్స త్వరలో అందుబాటులోకి వస్తుంది. మూడు లేక నాలుగు బీఎన్‌ఏబీఎస్‌ల ను కలిపి రోగి శరీరంలోకి పంపిస్తే అవి అన్ని రకాల హెచ్‌ఐవీ స్ట్రెయిన్స్‌నీ పూర్తిగా నిర్మూలిస్తాయని ప్రఖ్యాత మెడికల్‌ జర్నల్‌ ‘నేచర్‌’ ధ్రువీకరించింది. ‘న్యూ ఇంగ్లాండ్‌ జనరల్‌ ఆఫ్‌ మెడిసిన్‌’లో తాజాగా వెలువడిన పరిశోధన ఫలితాల ప్రకారం ఓకాబ్రియా ఇంజక్షన్‌ సంవత్సరానికి ఒకటి లేదా రెండు పర్యాయాలిస్తే హెచ్‌ఐవీ సమూలంగా నాశన మవుతుందని తేలింది.

హెచ్‌ఐవీని పూర్తిగా నయం చేయడానికి (సీఆర్‌ఐపీఆర్‌) ‘క్లస్టర్డ్‌ రెగ్యులర్లీ ఇంటర్‌ స్పేస్డ్‌ షార్ట్‌ పాలిండ్రోమిక్‌ రిపీట్స్‌’ అని పిలువబడే జీన్‌ ఎడిటింగ్‌ విధానానికి అమెరికా ‘ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ ఎడ్మినిస్ట్రేషన్‌’ (ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది. ఏంటీబాడీస్‌ ఇంజక్షన్లను వాడటం, కిక్‌ అండ్‌ కిల్‌ లాంటి అత్యాధునిక వైద్య విధానాన్ని అనుసరించడం వంటివాటి ద్వారా ఈ రోజో రేపో ఎయిడ్స్‌పై పూర్తి విజయాన్ని మన వైద్యులు ప్రకటించనున్నారు. (క్లిక్: అందమైన అమ్మాయి.. ఆమె ఓ డాక్టర్‌! టీనేజ్‌ అఫైర్‌ను గుర్తు చేసుకుని.. చివరికి)


- డాక్టర్‌ కూటికుప్పల సూర్యారావు 
ప్రముఖ వైద్యనిపుణులు, అంతర్జాతీయ ఎయిడ్స్‌ నివారణ సంస్థ సభ్యులు
(డిసెంబర్‌ 1 ప్రపంచ ఎయిడ్స్‌ దినం)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement