world aids day
-
World Aids Day: పొంచే ఉంది.. కొంచెం జాగ్రత్త!
ఎయిడ్స్ పీడ బయటపడ్డ తొలినాళ్లలో తీవ్రమైన అనారోగ్యం, దారుణంగా క్షీణించి కదిలే కంకాళాల్లా ఉండే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. దాంతో ఎయిడ్స్ జబ్బు అంతరించి పోయిందేమో అనే అపోహ ప్రజల్లో ఏర్పడింది. అయితే, వాస్తవం మాత్రం పూర్తిగా అందుకు విరుద్ధం. ఇటీవలి కోవిడ్ రోజుల తర్వాత నుంచి హెచ్ఐవి వ్యాప్తి మళ్లీ పెరిగింది. దాంతో... నేడు ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగానైనా మరోమారి ఈ అంశంపై చర్చ జరగాల్సిన నేపథ్యంలో ఈ కథనం. తాజా లెక్కల ప్రకారం 2023 డిసెంబరు నాటికి 25 లక్షల మంది హెచ్ఐవి రోగులతో ప్రపంచంలోనే భారతదేశం రెండవ స్థానంలో వుంది. భారతీయ జనాభాలో తెలుగు రాష్ట్రాల ప్రజలు కేవలం ఆరు శాతమే అయినా... దేశంలోని హెచ్ఐవి బాధితుల్లో మాత్రం 20% మంది తెలుగువారే. అంటే... మన దేశంలోని ప్రతి ఐదుగురు బాధితుల్లో ఒకరు తెలుగు వ్యక్తి కావడం విషాదం. వ్యాప్తికి కారణాలు...ఎయిడ్స్, హెచ్ఐవీ మూడు విధాలుగా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది. అవి... .లైంగిక చర్యతో పురుషుల వీర్యం, స్త్రీ జననేంద్రియ స్రావాలు కలవడం రక్తంలో రక్తం కలవడం అంటే ఎయిడ్స్ ఇన్ఫెక్షన్లు ఉన్నవారి రక్తం ఆరోగ్యకరమైన వారి రక్తంతో కలవడం .బాధితురాలైన మహిళ నుంచి బిడ్డకు. నివారణ... చాలా వైరస్ జబ్బుల్లాగే చాలాకాలం పాటు దీనికీ నిర్దిష్టమైన చికిత్స లేదు. అయితే ఇప్పుడు చికిత్స అందుబాటులో ఉంది. కానీ అసలు ఎయిడ్స్‌కు గురై మందులతో జబ్బును అదుపులో ఉంచుకోవడం కంటే నివారణ చాలా మేలు. ఇది మూడు రకాలుగా వ్యాపిస్తుందని తెలుసు కాబట్టి ఆ మూడు అంశాలకు సంబంధించిన నివారణ మార్గాలు అవలంబిస్తే దీన్నుంచి పూర్తిగా దూరంగా ఉండవచ్చు. పైన పేర్కొన్న వ్యాప్తి కారణాలను బట్టి తీసుకోవాల్సిన నివారణ చర్యలివి... లైంగిక చర్యతో వ్యాప్తి చెందుతుంది కాబట్టి వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాలి. పార్ట్నర్తో నమ్మకంగా వ్యవహరించాలి. సెక్స్‌లో పురుషులు తప్పనిసరిగా కండోమ్ వాడకం వాడాలి. మహిళలకు కొన్ని దేశాలలో ఫిమేల్ కండోమ్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. మద్యం మత్తులో కండోమ్ లేకుండా నిర్లక్ష్యంగా లైంగికచర్యకు పాల్పడే ప్రమాదం ఉన్నందున మద్యానికి దూరంగా ఉండటం చాలా అవసరం. రక్తంతో రక్తం కలవడం వల్ల ఎయిడ్స్ వ్యాప్తి చెందుతుందన్న అంశాన్ని గుర్తుంచుకుని ఒక నీడిల్ ఒకరికే పరిమితం చేయాలి. ఇక మాదక ద్రవ్యాలు వాడేవారు మత్తులో ఒకరు వాడిన సిరంజ్లే మరొకరు వాడితే... ఎయిడ్స్ వ్యాప్తిచెందుతుందన్న అంశాన్ని గుర్తుపెట్టుకుని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. ఇక తల్లి నుంచి బిడ్డకు అనేది సాధారణంగా భర్త కారణంగా భార్యకూ... ఆమెకు జబ్బు విషయం తెలియక... తీరా గర్భవతి అయ్యాక... తన తప్పేమీ లేకుండానే బిడ్డకు సంక్రమింప జేయడంతో అమాయకపు చిన్నారులు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఇలా ఈ వ్యాధి బారిన పడ్డ తల్లుల నుంచి చిన్నారులకు వ్యాధి వ్యాప్తి చెందకుండా (ప్రొఫిలాక్సిస్ చికిత్సగా) నివరపైన్ అనే నోటి ద్వారా ఇచ్చే మందు లేదా ఇంజెక్షన్‌ను తల్లికి ఇస్తారు. అలాగే బిడ్డ పుట్టాక అవసరాన్ని బట్టి ఆ చిన్నారికీ ఈ మందునిస్తారు. సాధారణ వ్యాప్తి మార్గాలకు ఇవీ నివారణలు. దీనికి తోడు అత్యంత వివక్షకు గురయ్యే ట్రాన్స్ జెండర్, గే, సెక్స్ వర్కర్లకు ఈ వ్యాధిపై అవగాహన వచ్చేలా, వారిలో చైతన్యం పెరిగేలా హెచ్ఐవి నివారణ కార్యక్రమాలను రూపొందించాలి. చికిత్స...చికిత్సకు ముందుగా అసలు ఎయిడ్స్ అంటే ఏమిటి, హెచ్ఐవీ అంటే ఏమిటో తెలుసుకోవడం అవసరం. ఎయిడ్స్‌కు కారణమయ్యే వైరస్‌ను హెచ్‌ఐవీగా... అంటే ఆ సంక్షిప్త అక్షరాలను విడమరిస్తే ‘హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియెన్సీ వైరస్’గా చెబుతారు. హెచ్ఐవీ వైరస్ సోకాక... మానవుల్లో సహజంగా ఉండే వ్యాధి నిరోధకత (ఇమ్యూనిటీ) నశిస్తుంది. దాంతో చాలా మామూలు జబ్బు బారిన పడ్డా...అది ఎప్పటికీ నయం కాకుండా, దానివల్లనే మరణించే ప్రమాదం ఉంటుంది. ఈ జబ్బును కలిగించే వైరస్‌ను హెచ్ఐవీ అంటారు. ఇక హెచ్ఐవీ సోకగానే వ్యాధి బయటకు కనిపించదు. క్రమంగా వ్యాధి నిరోధక కణాలన్నీ నశిస్తూ ΄ోవడం వల్ల... ఒక దశ తర్వాత ఏ చిన్న ఇన్ఫెక్షన్ సోకినా అది నయం కాని స్థితి వస్తుంది. ఆ కండిషన్‌నే ఎయిడ్స్ అంటారు. హెచ్ఐవి / ఎయిడ్స్ జబ్బు జీవితకాలపు వ్యాధి. ఒకసారి జబ్బు బారిన పడ్డవాళ్ల జీవితమంతా ఇక మందులు వాడాల్సే ఉంటుంది. పైగా అవి ఖరీదైనవి. యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్ అని పిలిచే ఆ మందులను వాడుతూ, హెచ్ఐవీని అదుపులో పెట్టుకుంటూ ఉండటమే ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్స. హెచ్ఐవి – ఎయిడ్స్ జబ్బుకి పెద్ద ఎత్తున మందులు అందుబాటులోకి రావడం, ప్రభుత్వ వైద్యశాలలలో వీటిని ఉచితంగా అందజేయడంవల్ల ప్రస్తుతం చాలామంది వ్యాధిగ్రస్తులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ దాదాపు సాధారణ మానవుల పూర్తికాల ఆయుర్దాయంతోనే వీళ్లూ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. డా. యనమదల మురళీకృష్ణ, సాంక్రమిక వ్యాధుల నిపుణులు (చదవండి: కోడిపుంజులాంటి హోటల్..! ) -
ఇక ఎయిడ్స్‌కు చరమగీతం!
ఒకప్పుడు మశూచి వ్యాధి బారిన పడి లక్షలమంది మరణించేవారు. అలాగే ప్లేగ్ వ్యాధితో కూడా! అలాంటి భయంకరమైన రోగాలు ఇప్పుడు కలికానికి కూడా లేవు. దీనికి కారణాలు ఆ రోగాలను మట్టుబెట్ట డంలో జరిగిన నిరంతర కృషి.1980వ దశకంలో ఎయిడ్స్ అంటే మరణం. దీని బారిన పడినవారు బతికి ఉన్నా, చచ్చినవారితో సమానం అన్నట్టుగా సమాజం పరిగణించిన రోజులు అవి. హెచ్ఐవీ పాజిటివ్ అని తెలియ గానే గుండెలో బండ పడినట్లే భావించి మానసికంగా మరణా నికి చేరువయ్యేవారు. ఎయిడ్స్ తాకిడికి అమెరికా లాంటి అగ్ర దేశాలు కూడా విలవిలలాడి పోయాయంటే అప్పట్లో ఈ వ్యాధి కలిగించిన భయోత్పాతాన్ని అర్థం చేసుకోవచ్చు. అది ఆనాటి ముఖచిత్రం. ఈనాడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మందే లేదనుకున్న ఈ వ్యాధికి తగిన మందులు లభిస్తున్నాయి. ఇప్పుడు ఎయిడ్స్ ఒక దీర్ఘకాలిక వ్యాధి మాత్రమే! ఎయిడ్స్‌కు గురి కాకుండా ఎలాగూ కాపాడుకోవచ్చు. ఒకవేళ వచ్చిందని తెలిసినా, 72 గంటల లోపు పోస్ట్ ప్రొఫలాక్సిస్ మందులు వాడి దాని బారి నుంచి బయటపడవచ్చు. తొమ్మిదేళ్ల క్రితమే క్యూబాలో హెచ్ఐవీ ఎయిడ్స్, సిఫిలిస్ వ్యాధులను పూర్తిగా తుడిచి పెట్టారు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎయిడ్స్ గురించి భయపడాల్సిన అవసరం ఇక ఎంత మాత్రం లేదని, గట్టిగా ప్రయత్నిస్తే, మొత్తం ప్రపంచానికి ఎయిడ్స్ నుంచి విముక్తి కలిగించవచ్చనే గట్టి సందేశాన్ని ఆ దేశం ప్రపంచ దేశాలకు పంపింది. ఎయిడ్స్ పాజిటివ్ దంపతులు నేడు చికిత్స తీసుకొని, ఆ వ్యాధి లక్షణాలు లేని, ఆరోగ్యవంతమైన పిల్లలను కనవచ్చు. హెచ్ఐవీ పాజిటివ్ వాళ్ళు... ఆ వ్యాధి సోకని వాళ్ళను నిక్షేపంగా వివాహం చేసు కొని, ఎలాంటి భయ సంకోచాలూ లేకుండా హాయిగా కాపు రాలు చేసుకోవచ్చు. అనేక శాస్త్రీయ పరిశోధనల పుణ్యమా అని అలాంటి చికిత్సా పద్ధతులు, ఈనాడు సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చాయి. బీపీ, షుగర్ బాధితులు అతి తక్కువ ఖర్చుతో ప్రతి రోజూ క్రమం తప్పకుండా మాత్రలు వాడుతూ ఆరోగ్యంగా సాధారణ జీవితం గడుపున్న మాదిరిగానే, ఎయిడ్స్ రోగులు కూడా 30 రూపాయలు ఖరీదు చేసే ఒక్క మాత్రను క్రమం తప్పకుండా రోజూ వేసుకుంటూ, తగు విశ్రాంతి, పోషకా హారం తీసుకుంటూ క్రమశిక్షణతో జీవితం గడిపితే, 80 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఆరోగ్యంగా, ఆనందంగా, ఉల్లాసంగా జీవించవచ్చు. ఈ విషయాన్ని ప్రఖ్యాత వైద్య జర్నల్ ‘లాన్ సెట్’, ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధక బృందం, పలు అధ్య యన సంస్థలు అధికారికంగా ప్రకటించాయి.వైద్యపరంగా ఇంతటి భరోసా లభిస్తున్నా, ఎయిడ్స్ రోగులు మానసికమైన భయాందోళనలతో చికిత్సకు దూరంగా ఉంటూ అల్లాడిపోతున్నారు. రోజువారీ వాడాల్సిన మాత్రలు తమ దగ్గర ఉంటే పక్కవారికి తెలిస్తే, పరువు పోతుందనే భయంతో సక్రమంగా వాడకుండా కోరి ప్రమా దాన్ని తెచ్చి పెట్టుకుంటున్నారు. ఇంత ప్రగతి సాధించినా ఇప్పటికీ సామాన్యులే కాక, విద్యాధికులైన హెచ్ఐవీ రోగులు కూడా అపోహలు, మూఢ నమ్మకాలతో శాస్త్రీయంగా ఎలాంటి నిర్ధారణ కాని పొడులు, కషాయాలతో వ్యాధిని మరింత ముదరబెట్టుకొంటున్నారు. కొందరు పాము విషం తీసుకుంటే ఈ వ్యాధి తగ్గిపోతుందనే ప్రచారాలు నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డిసెంబర్ ఒకటవ తేదీ ప్రపంచ ఎయిడ్స్ దినం కోసం ‘అందరం కలసి శ్రమిద్దాం– ఎయిడ్స్‌ను నిరోధిద్దాం‘ అన్న నినాదాన్ని ప్రకటించింది. 2030 నాటికి ఎయిడ్స్ లేని ప్రపంచాన్ని సృష్టించడానికి, ఆధునిక చికిత్సా పద్ధతులపై ప్రజల్లో అవగాహన పెంచాలని సంకల్పించింది. హెచ్ఐవీ ఎయిడ్స్ వ్యాధి నూటికి నూరుపాళ్ళు నివారించే వీలున్న వ్యాధి కనుక నిరంతరం దీనిపై ప్రజల్లో అవ గాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలి. ఆత్మహత్యల నిరోధానికి కౌన్సెలింగ్ ఇస్తున్న తరహాలోనే ప్రజలకు అందుబాటులో ఎయిడ్స్ కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఒక టోల్ ఫ్రీ నంబరుతో రోగులకు, సలహాలు, సూచనలు ఇచ్చే కార్యక్రమం చేపడితే మరిన్ని సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. తామెవరు అన్నది పైకి తెలిసే అవకాశం ఉండదు కనుక రోగులు నిర్భయంగా, ఎలాంటి సంకోచమూ లేకుండా వైద్యులను సంప్రతించి సక్రమంగా చికిత్స తీసుకునే వీలుంటుంది. నిర్మూలనకు మంచి అవకాశాలు ఉన్న ఎయిడ్స్ వ్యాధి ముప్పును ప్రపంచానికి పూర్తిగా తప్పించాలంటే కలసికట్టు కృషి అవసరం. ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, వైద్యులు పరస్పర సహకారంతో ప్రజల్లో, ప్రత్యేకించి ఎయిడ్స్ బాధితుల్లో చక్కటి అవగాహన కల్పించే ప్రయత్నాలు నిరంతరం చేయగలిగితే... మశూచి, ప్లేగు వ్యాధుల మాదిరిగానే అతి త్వరలోనే ఎయిడ్స్ అనే భయంకర రోగాన్ని ప్రపంచం నుంచి తరిమివేయడం అసాధ్యం ఏమీ కాదు. అలాంటి శుభ దినం త్వరలోనే రాగలదని ఆశిద్దాం. డా‘‘ కూటికుప్పల సూర్యారావు వ్యాసకర్త ‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీత, అంతర్జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థ సభ్యులు ‘ 93811 49295(నేడు ప్రపంచ ఎయిడ్స్ దినం) -
ఎయిడ్స్ విధ్వంసాన్ని నివారిద్దాం!
మానవ చరిత్రలో ఎయిడ్స్ వ్యాధి సృష్టించిన విధ్వంసం, బీభత్సం, విషాదాలతో ఏ ఒక్క ఇతర అంశాన్నీ సరిపోల్చలేము. 1981 జూన్‌లో బయటపడిన ఎయిడ్స్ అత్యధిక కాలంగా కొనసాగుతున్న ప్రపంచ పీడ. 42 ఏళ్ల కాలంలో ఎనిమిది కోట్ల 56 లక్షల మంది ఎయిడ్స్ జబ్బుకు దారి తీసే హెచ్ఐవీ క్రిమి బారిన పడ్డారు. ఇప్పటికే నాలుగు కోట్ల నాలుగు లక్షల మంది ఎయిడ్స్ జబ్బుతో మరణించారు. చాలా ప్రపంచ పీడలు పరిమిత కాలంలోనే కల్లోలాన్ని సృష్టించి పోతుంటాయి. కానీ ఎయిడ్స్ జీవితకాలపు సాంక్రమిక జబ్బు. అందువల్ల హెచ్ఐవీ సోకిన వారు, వారి కుటుంబాలు నిరంతర చికిత్సతో, అప్పుడ ప్పుడు తలెత్తే అనారోగ్యాలతో ఆర్థికంగా కష్టాల పాలవుతుంటారు. సకాలంలో తగిన చికిత్స అందనిచో వారి కథ విషాదాంతమవు తుంది. ఎయిడ్స్ జబ్బుకి కారణమైన హెచ్ఐవీ క్రిమి ప్రధానంగా లైంగికంగా వ్యాప్తి చెందుతుంది. అన్ని సాంక్రమిక వ్యాధుల వలెనే... హెచ్ఐవీ వ్యాప్తికి అవగాహన లేమి, పేదరికం, ఆరోగ్య వైద్య సదుపాయాల కొరత, చదువు లేకపోవడం ముఖ్యమైన కారణాలు. ఈ పరిస్థి తులు నెలకొని ఉన్న ఆఫ్రికా, ఆసియా దేశా లలో హెచ్ఐవీ ప్రబలంగా వ్యాపించింది. 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్ల 90 లక్షల మంది ఎయిడ్స్‌తో బాధపడు తున్నారు. వీరిలో 15 లక్షల మంది 15 సంవత్సరాల లోపువారే. ప్రపంచవ్యాప్తంగా 2022లో ఆరు లక్షల 30 వేల మంది ఎయిడ్స్ జబ్బుతో చనిపోయారు. 17 లక్షల మంది కొత్తగా హెచ్ఐవీ బారిన పడ్డారు. భారతదేశంలో అందుబాటులో ఉన్న 2019 వివరాల మేరకు 23 లక్షల 49 వేల మంది హెచ్ఐవీ సంక్రమించిన వారున్నారు. వీరిలో పది లక్షల మంది మహిళలు. అదే ఏడాది దేశంలో దాదా పుగా 60 వేలమంది ఎయిడ్స్‌తో మరణించారు. తెలుగు రాష్ట్రాలలో దాదాపు 5 లక్షల మంది హెచ్ఐవీ బాధితులున్నారని అంచనా. సహారా ఎడారికి దిగువన ఉన్న దక్షిణాది ఆఫ్రికాలోని బోట్స్వానా, ఉగాండా,జింబాబ్వే, జైరి, స్వాజిలాండ్, ఇథియోపియా, కాంగో, మలావి వంటి దేశాలలో హెచ్ఐవీ బయటపడిన మొదటి దశకంలో 15 నుండి 49 సంవత్సరాల మధ్య వయసు వారిలో 40 శాతం మంది వరకూ హెచ్ఐవీ బారిన పడ్డారు. వారు అనారోగ్యంతో ఫ్యాక్టరీలకు, పనులకు వెళ్లలేక పోవడంతో ఆ యా దేశాలలోని ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. వైద్యశాస్త్రంలో అనేక కొత్త విధానాలకు హెచ్ఐవీ / ఎయిడ్స్ దారులు చూపింది. ఒక జబ్బు కోసం పరిశోధన చేసి రూపొందించిన మందును వేరే జబ్బుకు వాడే ప్రక్రియ (రీపర్పసింగ్ డ్రగ్)ను మొదట హెచ్ఐవీ చికి త్సలోనే ప్రవేశపెట్టారు. ప్రస్తుతం జిడోవుడిన్గా పిలుస్తున్న అజిడోథైమిడిన్ మందును క్యాన్సర్ చికిత్స కోసం రూపొందించారు. కాగా జిడోవుడిన్ ఔషధం హెచ్ఐవీ వృద్ధిలో పాత్ర ఉన్న ఒక ఎంజైము పనిని అడ్డుకొని, దాని వృద్ధిని నిరోధిస్తుంది. అందువల్ల అజిడోథైమిడిన్ని హెచ్ఐవీ పీడ ప్రారంభమైన ఐదు సంవత్సరాల తర్వాత, 1987 మార్చిలో హెచ్ఐవీ చికిత్సకు మొదటి ఫలవంతమైన చికిత్సగా ప్రవేశపెట్టారు. హెచ్ఐవీ చికిత్సలో వాడే కొన్ని మందులను ఈ క్రిమి సోకే అవకాశం ఉన్న వారికి ముందుగానే ఇవ్వడం మూలంగా సంక్ర మణను అడ్డుకునే విధానాన్ని నిపుణులు రూపొందించారు. దీనినే ‘ప్రీఎక్స్పోజర్ ప్రొఫై లాక్సిస్’ అంటారు. ఇది హెచ్ఐవీకే పరిమిత మైన కొత్త నిరోధక విధానం. ప్రపంచ వ్యాప్తంగా హెచ్ఐవీ–ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించడంతో హెచ్ఐవీ వ్యాప్తిని చాలా వరకు తగ్గించగలిగాము. ఎయిడ్స్ జబ్బుకి దారి తీసే హెచ్ఐవీ క్రిమి ప్రధానంగా ఆ క్రిమి సోకిన వారితో లైంగిక చర్యలో పాల్గొన్నందు వల్లనే వ్యాప్తి చెందుతుంది. హెచ్ఐవీ బాధితురాలు అయిన తల్లి నుండి గర్భస్థ శిశువుకి కూడా వచ్చే అవకాశం ఉంది. ఎయిడ్స్ వ్యాధి గ్రస్థులు, ఎయిడ్స్ వల్ల తమ వారిని కోల్పోయిన బాధితులు, హెచ్ఐవీకి గురయ్యే ప్రమాదం ఉన్నవారు– ఈ సమూహాలకు చెందినవారు ఎయిడ్స్‌పై అవగాహన కల్పించ డానికి ముందుండాలని ‘యూఎన్ ఎయిడ్స్’ పిలుపునిచ్చింది. డాక్టర్ యనమదల మురళీకృష్ణ వ్యాసకర్త సాంక్రమిక వ్యాధుల నిపుణులు మొబైల్: 94406 77734 (నేడు ప్రపంచ ఎయిడ్స్ డే) -
ఎయిడ్స్ విజృంభణ.. 3,380 మంది మృతి!
ఖమ్మం వైద్యవిభాగం : జిల్లాలో ఎయిడ్స్ మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ వ్యాధితో ప్రతీనెల మరణాలు నమోదవుతున్నాయి. జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ద్వారా నివారణ చర్యలు తీసుకుంటున్నా వ్యాధి వ్యాప్తి ఆగడం లేదు. అయితే, ప్రజల్లో అవగాహన కల్పించే చర్యలు అంతగా లేకపోవటంతో వ్యాధి వ్యాప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ప్రతీనెల 50కి పైగా హెచ్ఐవీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అయితే ఇవి అధికారిక లెక్కలు మాత్రమే! అనధికారికంగా చాలా మంది వ్యాధి బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. ఎయిడ్స్ మహమ్మారిని తరిమికొట్టేలా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏటా డిసెంబర్ 1న ఎయిడ్స్ డేగా జరుపుకుంటున్న నేపథ్యాన కథనం. 3,380 మంది బాధితులు మృతి జిల్లాలో ఎయిడ్స్ బారిన పడి మృతి చెందే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 2006 నుండి ఇప్పటి వరకు 3,380 మంది మృతి చెందగా, ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 310 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు 47,487 మందికి హెచ్ఐవీ నిర్ధారణ పరీక్షలు జరపగా 310 మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. ఇందులో 28,105 గర్భిణుల్లో పరీక్షలు చేయగా11 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. అలాగే, 15 ఏళ్లలోపు పిల్లలు 80 మంది వ్యాధితో బాధపడుతున్నారు. కాగా, హెచ్ఐవీ బాధితుల కోసం జాగృతి, ఇతర స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తూ వారి ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నాయి. ఇక జిల్లాలో ఎయిడ్స్ వ్యాధి నియంత్రణ కోసం నాలుగు ఐసీటీసీ కేంద్రాలు, 36 ఎఫ్‌ఐసీటీసీ కేంద్రాలు, ఒక ఏఆర్టీ కేంద్రం, రెండు లింక్ ఏఆర్టీ కేంద్రాలు, ఒక సురక్ష క్లినిక్, 9 రక్త నిధి కేంద్రాలు పనిచేస్తున్నాయి. అయితే, కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యాన అటు ప్రభుత్వం, ఇటు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యాన మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి్సన ఆవశ్యకత ఉందని తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 16,307 పాజిటివ్ కేసులు జిల్లాలో గత ఏడాది 15,995 మంది హెచ్ఐవీ బాధితులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ ప్రస్తుతం సంఖ్య పెరిగింది. ఇప్పు డు జిల్లాలో 16,307 పాజిటివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ద్వారా తెలుస్తోంది. వీరు ఖమ్మం ఏఆర్టీ కేంద్రంలో పేర్లు నమోదు చేసుకున్న వారే కాగా, పేర్లు నమోదు చేసుకోని వారి కూడా ఉంటారని సమాచారం. ఎయిడ్స్ వ్యాధి సోకిన వారిలో ప్రతీనెల క్రమం తప్పకుండా 6,160 మంది మందులు వాడుతుండగా, 2,780 మంది పెన్షన్ పొందుతున్నారు. తెలంగాణలో ఎయిడ్స్ బాధితుల్లో హైదరాబాద్, మహబూబ్‌నగర్ తర్వాత ఖమ్మం మూడో స్థానంలో ఉండడం గమనార్హం. ఎయిడ్స్‌ను తరిమికొట్టేందుకు కృషి జిల్లా నుంచి ఎయిడ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నాం. వ్యాప్తిని అరికట్టేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. మందుల కొరత లేకుండా చూస్తూ, బాధితులందరూ మందులు వాడేలా చూస్తున్నాం. పీహెచ్‌సీలకు వచ్చే వారిలో 10 శాతం తక్కువ కాకుండా హెచ్ఐవీ టెస్టులు చేయిస్తున్నాము. ర్యాలీలు, కళాజాతాల ద్వారా ఎయిడ్స్ వ్యాధి తీవ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. – డాక్టర్ ఎల్. ప్రవీణ, అడిషనల్ డీఎంహెచ్ఓ, ఎయిడ్స్ అండ్ లెప్రసీ -
World AIDS Day 2022: ఒక్క ‘షాట్’తో ఎయిడ్స్‌కు దూరం
ఎయిడ్స్‌పై మానవుని పోరాటం చివరి దశకు చేరింది. అందువల్ల ఎయిడ్స్ రోగులు ధైర్యంగా ఉండవచ్చు. 2020లో జరిగిన అధ్యయనాల ప్రకారం హెచ్ఐవీ రోగుల్లో 40 శాతం మంది డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. కొందరు ఆత్మహత్యలకూ పాల్పడుతున్నారు. నిజానికి ఎయిడ్స్ ఉన్నా పెళ్లి చేసుకోవచ్చని రోగులు గుర్తించాలి. ఎయిడ్స్‌పై అవగాహన పెంచడానికి 1988 నుంచీ ప్రతీ ఏడాదీ డిసెంబర్ 1వ తేదీని ‘ప్రపంచ ఎయిడ్స్ దినం’గా పాటిస్తున్నాము. ఈ ఏడు ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితి సంయుక్తంగా ‘సంఘీభావంతో – ఎయిడ్స్ నివారణ బాధ్యతల్లో భాగస్వామ్యం కావాలి’ అనే నినాదాన్ని ఇచ్చాయి. జీవితాంతం మాత్రలు వాడటానికి 70 శాతం రోగులు ఇష్టపడటం లేదు. అందుకే మధ్యలో మందులు ఆపేయడం, అస్తవ్యస్థంగా మందులు వాడడం ద్వారా అర్థాంతరంగా హార్ట్ ఎటాక్ లేదా పక్షవాతం, టీబీ, కేన్సర్లు, అంధత్వం, మెనింజైటీస్, ఇతర అవకాశవాద సంక్రమణ వ్యాధులకు గురవుతూ నిర్వీర్యమై పోతున్నారు. ఒకప్పుడు ఎయిడ్స్ అంటే మరణవాంగ్మూలం అనేవారు. అయితే నాలుగు దశాబ్దాల్లో శాస్త్రవేత్తలు ఈ వ్యాధిపై విజయం సాధించి చికిత్సను అందుబాటులోకి తెస్తున్నారు. అత్యంతాధునికమైన ‘బ్రాడ్లీ నూట్రలైజింగ్ ఏంటీ బాడీస్’ (బీఎన్ఏబీఎస్) చికిత్స త్వరలో అందుబాటులోకి వస్తుంది. మూడు లేక నాలుగు బీఎన్ఏబీఎస్ల ను కలిపి రోగి శరీరంలోకి పంపిస్తే అవి అన్ని రకాల హెచ్ఐవీ స్ట్రెయిన్స్నీ పూర్తిగా నిర్మూలిస్తాయని ప్రఖ్యాత మెడికల్ జర్నల్ ‘నేచర్’ ధ్రువీకరించింది. ‘న్యూ ఇంగ్లాండ్ జనరల్ ఆఫ్ మెడిసిన్’లో తాజాగా వెలువడిన పరిశోధన ఫలితాల ప్రకారం ఓకాబ్రియా ఇంజక్షన్ సంవత్సరానికి ఒకటి లేదా రెండు పర్యాయాలిస్తే హెచ్ఐవీ సమూలంగా నాశన మవుతుందని తేలింది. హెచ్ఐవీని పూర్తిగా నయం చేయడానికి (సీఆర్ఐపీఆర్) ‘క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్ స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్’ అని పిలువబడే జీన్ ఎడిటింగ్ విధానానికి అమెరికా ‘ఫుడ్ అండ్ డ్రగ్ ఎడ్మినిస్ట్రేషన్’ (ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది. ఏంటీబాడీస్ ఇంజక్షన్లను వాడటం, కిక్ అండ్ కిల్ లాంటి అత్యాధునిక వైద్య విధానాన్ని అనుసరించడం వంటివాటి ద్వారా ఈ రోజో రేపో ఎయిడ్స్‌పై పూర్తి విజయాన్ని మన వైద్యులు ప్రకటించనున్నారు. (క్లిక్: అందమైన అమ్మాయి.. ఆమె ఓ డాక్టర్! టీనేజ్ అఫైర్‌ను గుర్తు చేసుకుని.. చివరికి) - డాక్టర్ కూటికుప్పల సూర్యారావు ప్రముఖ వైద్యనిపుణులు, అంతర్జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థ సభ్యులు (డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినం) -
World AIDS Day: హెచ్ఐవీని ఇలా గుర్తించొచ్చు.. ఈ సూత్రాలు పాటించాలి
హెచ్ఐవీ భూతం చాపకింద నీరులా విస్తరిస్తోంది. మందు లేని ఈ మాయరోగానికి నిండు జీవితాలు బలైపోతున్నాయి. అవగాహనా లోపం, నిర్లక్ష్యం మూలంగా కొందరు వ్యక్తులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుండంతో వారి కుటుంబాలు వీధినపడుతున్నాయి. హెచ్ఐవీపై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించే ఉద్ధేశంతో ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నా పెద్దగా మార్పు కనిపించడం లేదు. హెచ్ఐవీని ఇలా గుర్తించొచ్చు ►హెచ్ఐవీ(హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్)ను గుర్తించడానికి ఏఆర్టీ సెంటర్లో కొంబెడ్స్, ట్రై లైన్, ట్రై స్పాట్ పరీక్షలు నిర్వహిస్తారు. వాటిలో పాజిటివ్ వచ్చినట్లయితే హెచ్‌ఐవీగా నిర్ధారిస్తారు. ►దీర్ఘకాల వీరోచనాలు, జ్వరం, ఎడతెరిపి లేని దగ్గు, చర్మ వ్యాధులు, గొంతు నొప్పి ఎక్కు వరోజులు ఉన్నట్లయితే వెంటనే పరీక్షలు నిర్వహించుకోవాలి ►నెల రోజుల్లో శరీర బరువులో 10 శాతం తగ్గినా, నెల రోజులకు మించి జ్వరం, విరేచనాలు బాధించినా హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోవాలి ►సీడీ- 4 టెస్ట్‌లో తెల్ల రక్తకణాల సంఖ్య 350 కంటే తక్కువగా ఉంటే వారికి జీవిత కాలం పాటు ప్రతి నెల ఉచితంగా ఏఆర్టీ సెంటర్లో మందులు అందిస్తారు. ఏబీసీ సూత్రం పాటించాలి ఎయిడ్స్ బారిన పడకుండా ఉండాలంటే ఏబీసీ సూత్రాన్ని పాటించాలి. ఎ-ఎబ్స్టెన్సెస్(వివాహానికి ముందు లైంగిక సంబంధాలకు దూరంగా ఉండటం), బి-బీ ఫెయిత్ ఫుల్ టూ లైఫ్ పార్టనర్(వివాహ జీవితంలో భాగస్వామితో మాత్రమే లైంగిక సంబంధం పరిమితం చేసుకోవాలి). సీ- కాన్సిస్టెంట్ కరెక్ట్ యూజ్ ఆఫ్ కండోమ్( సరైన విధంగా ఎల్లప్పుడూ కండోమ్ వాడటం). ఈ మూడు సూత్రాలపై స్వచ్చంద సంస్థల సహాకారంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. అప్రమత్తతే ముఖ్యం హెచ్ఐవీ వైరస్ వల్ల ఎయిడ్స్ వస్తుంది. ముఖ్యంగా విశృంఖల శృంగారం.. ఒకరికంటే ఎక్కువ మందితో శారీరక సంబంధాలతో ఎక్కువగా ఎయిడ్స్ బారిన పడుతున్నారు. హెచ్ఐవీ, ఎయిడ్స్ ఉన్న వారి రక్తం ఇతరులకు ఎక్కించడం వల్ల, తల్లి నుంచి బిడ్డకు, కలుషిత సిరంజీల వల్ల ఎయిడ్స్ వ్యాధి సంక్రమిస్తుంది. ఎయిడ్స్ రోగులు వినియోగించిన బ్లేడ్లు వాడడం వల్ల కూడా సంక్రమిస్తుంది. హెచ్ఐవీ సోకితే.. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోయి జలుబు తదితర అంటురోగాల బారిన త్వరగా పడతారు. ఆరోగ్యం క్షీణించినప్పుడు.. సీ డీ 4 పరీక్షలో కణాల సంఖ్య 200 కంటే తక్కువగా ఉన్నప్పుడు ఎయిడ్స్‌గా పరిగణిస్తారు. సెలూన్లలో కొత్త బ్లేడ్ వాడేలా చూసుకోవాలి. శారీరక సంబంధాల నియంత్రణ, ఇతర స్వీయ జాగ్రత్తలతో ఈ మహమ్మారి బారిన పడకుండా కాపాడుకోవచ్చు. సాక్షి, అమరావతి: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో జిల్లాలో ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తికి అడ్డుకట్ట పడింది. సమాజాభివృద్ధికి నిరోధకంగా నిలుస్తున్న ఇటువంటి రుగ్మతలపై ప్రజానీకంలో విస్తృత అవగాహన కల్పించటంతో సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. 2002లో 2.25 శాతం ఉన్న హెచ్ఐవీ వ్యాప్తి 2020 నాటికి 0.22 శాతంకు తగ్గింది. జిల్లాలో ప్రస్తుతం 21,332 మంది హెచ్ఐవీ బాధితులు ఉన్నారు. విజయవాడ నగరం, చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు, మచిలీపట్నం, గుడివాడలో ఎక్కువగా హెచ్ఐవీ కేసులు బయటపడుతున్నాయి. ఈ ప్రాంతాలపై ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పాజిటివ్ రేటు తగ్గించేలా.. పాజిటివ్ రేటు తగ్గించే క్రమంలో బాధితులను సకాలంలో గుర్తించేలా హెచ్ఐవీ పరీక్షలను వేగవంతం చేశారు. జిల్లాలో 18 హెచ్ఐవీ నిర్ధారణ కేంద్రాలు, 164 పరీక్ష కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. సామాన్య ప్రజానీకానికి 2020–21లో 1,04,482 మందికి పరీక్షలు నిర్వహించగా, ఇందులో 1,170 మందికి హెచ్ఐవీ నిర్థారణ అయింది. 2021–22లో అక్టోబర్ వరకు 70,100 మందికి పరీక్షలు నిర్వహించగా, ఇందులో 797 మందికి హెచ్ఐవీ సోకినట్లు తేలింది. గర్భిణులకు 2020–21లో 82,086 మందికి పరీక్షలు చేయగా, ఇందులో మందికి హెచ్ఐవీ ఉన్నట్లుగా వెల్లడైంది. 2021–22లో అక్టోబర్ నెల వరకు 42,360 మందికి పరీక్షలు చేయగా, 53 మందికి హెచ్ఐవీ ఉన్నట్లు తేలింది. జీవన ప్రమాణం పెరిగేలా... ∙ఎయిడ్స్ నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. గతంలో మెరుగైన చికిత్స కోసమని హైదరాబాద్ వరకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం విజయవాడలోనే ‘వైరల్ లోడ్ ల్యాబ్’ అందుబాటులోకి వచ్చింది. రోగి ప్రాణాపాయం నుంచి తప్పించేలా(థర్డ్ లెవెల్ డ్రగ్) అవసరమైన మందులు సకాలంలో అందిస్తున్నారు. జిల్లాలో మచిలీపట్నం, గుడివాడ, విజయవాడలోని పాత, కొత్త ఆసుపత్రుల్లో ఏఆర్టీ కేంద్రాలు అందుబాటులోఉన్నాయి. వీటికి అనుబంధంగా జిల్లాలో 6 ఏఆర్టీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. సెక్స్ వర్కర్లు, స్వలింగ సంపర్కులు, ట్రాన్స్జెండర్లు, మాదక ద్రవ్యాలను సూదుల ద్వారా ఎక్కించుకునే వారి ద్వారానే ఎక్కువగా హెచ్ఐవీ విస్తరిస్తున్నందున వీరికి అవగాహన కల్పించేందుకు జిల్లాలో 13 స్వచ్ఛంద సేవా సంస్థలు పనిచేస్తున్నాయి. -
ప్రజలలో అవగాహన బాగా పెరిగింది : డాక్టర్ సమరం
సాక్షి, విజయవాడ : ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ర్యాలీ ప్రారంభించారు. సమాజ భాగస్వామ్యం ఎయిడ్స్ వ్యాధి నివారణ పేరుతో వందలాది మంది విద్యార్థులతో తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు ఈ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాలో 23 వేల మంది ఎయిడ్స్ రోగులున్నట్టు కలెక్టర్ తెలిపారు. వీరంతా 4ఏ ఆర్టీ సెంటర్స్ ద్వారా చికిత్స పొందుతున్నట్టు వెల్లడించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రముఖ సెక్సాలజిస్టు డాక్టర్ సమరం మాట్లాడుతూ.. 2030 నాటికి ఎయిడ్స్ పూర్తిస్థాయిలో తగ్గుముఖం పడుతుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎయిడ్స్ తగ్గుముఖం పట్టడంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు బావున్నాయనీ, వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన బాగా పెరిగిందని వ్యాఖ్యానించారు. -
నిశ్శబ్ద రాజ్యంలో... నిత్య నరకం
పుట్టిన వాడు గిట్టక మానడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడో పోయే ప్రాణంకోసం ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ మరణానికి సమీపంలో ఉన్నామనీ... బతకడానికి రోజులు లెక్కపెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైందనీ తెలిసేవారి బతుకు ఎంత దయనీయం. ఊహించుకుంటేనే భయం కలుగుతోంది కదూ. తప్పు చేసి ప్రాణం పోయే పరిస్థితి వస్తే ఓకే... కానీ ఏ తప్పూ చేయకున్నా... అలాంటి పరిస్థితి ఎదుర్కోవడం మరింత బాధాకరం. అలాంటి అభాగ్యులే హెచ్ఐవీ పీడితులు. ప్రపంచంలో సహజంగా వచ్చే అనేక వ్యాధులకు మందులు కనిపెట్టిన మన శాస్త్రవేత్తలు ఇంత వరకూ ఈ మహమ్మారి నుంచి మానవాళిని కాపాడే ఆయుధాన్ని సృష్టించలేకపోయారు. కనీసం చనిపోయేంత వరకైనా ప్రశాంత జీవితాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికున్నా తన కేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. మానవత్వం మరచిన వైద్యులు చికిత్సనందించకుండా తప్పించుకుంటుంటే, ప్రభుత్వం రిక్త హస్తాన్ని చూపించి నిత్య నరకాన్ని హెచ్ఐవీ రోగులకు అందిస్తోంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాత హెచ్ఐవీ రోగుల సంక్షేమాన్ని పట్టించుకోవడం మానేసింది. వారిని ఆదుకోవడానికి చర్యలు చేపడుతున్నామనే పాలకుల మాటలకు చేతలకు పొంతన ఉండడం లేదు. ఈ రోగులకు ప్రభుత్వం నెలకు రూ.1000ల పింఛన్ అందించాలి. కానీ ఈ సర్కారు పుణ్యమాని కొత్త పింఛన్లు మంజూరు కావడం లేదు. 2012 తర్వాత ఒక్కరికి కూడా ప్రభుత్వం సాయం చేయలేదు. ఒక్క విజయనగరం జిల్లాలోనే 5 వేలకు పైగా రోగులు పింఛన్ల కోసం ఎదురు చూస్తుండగా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి పింఛన్లు రావాల్సి ఉంది. ఫలితంగా రాష్ట్రంలో హెచ్ఐవీ చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడిన వారికి అందాల్సిన మందులు కూడా సకాలంలో అందడం లేదు. చికిత్స అసలే లేదు. దీనివల్ల జిల్లాలో ఈ రోగుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజా లెక్కల ప్రకారం విజయనగరం జిల్లాలో 10,687 మంది హెచ్ఐవీ రోగులున్నారని అధికార గణాంకాలు చెబుతున్నాయి. వ్యాధుల దాడి హెచ్ఐవీ సోకితే రోగ నిరోధక శక్తి క్రమంగా క్షీణిస్తుంది. దీనివల్ల సహజంగా శరీరంలో ఉండే తెల్లరక్తకణాలు(రక్షక భటులు) చనిపోయి వ్యాధికారక క్రిములను, బాక్టీరియాలను అడ్డుకునే వ్యవస్థ నశిస్తుంది. ఫలితంగా అనేక వ్యాధులు అత్యంత సులభంగా సోకడంతో పాటు అవి మరింత ప్రాణాంతకమవుతున్నాయి. వాటిలో ముఖ్యమైనవి క్షయ, హెర్పిస్, కేన్సర్, చర్మ వ్యాధులు, డయేరియా వంటివి. ఏఆర్టీ కేంద్రంలో మందుల కొరత హెచ్ఐవీ రోగులకు ఏఆర్టీ కేంద్రంలో మందులు అందజేస్తారు. ఐసీటీసీ కేంద్రంలో హెచ్ఐవీ నిర్ధారణ అయిన వెంటనే వారికి ఏఆర్టీ కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేసి జేఎల్ఎన్, టీఎల్ఈ మందులు అందజేస్తారు. ప్రస్తుతం ఏఆర్టీ కేంద్రంలో జేఎల్ఎన్ మందుల కొరత ఉంది. దాదాపు రెండు నెలలుగా ఈ రోగులకు మందులు లేవు. వీటిని క్రమం తప్పకుండా వాడకపోతే వ్యాధి తీవ్రత పెరుగుతుందనేది నిపుణుల అభిప్రాయం. రెండేళ్లుగా ఈ మందులు సరఫరా చేయడానికి సర్కారుకు చేతులు రావడంలేదు. అంతేనా... ఈ రోగులందరికీ అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం ఉచితంగా వైద్యం అందాల్సి ఉన్నా.. వైద్యులు ముందుకు రావడంలేదు. శస్త్రచికిత్సలు చేయాలంటే ఏదో ఒక కారణం చెప్పి రిఫరల్స్‌కు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సను బట్టి రూ.50 వేల నుంచి రూ.70 వేలకు గుంజుతున్నారు. హెచ్ఐవీ రోగులకు వైద్యం అందడం లేదు: హెచ్ఐవీ రోగుల పట్ల కనిపించని వివక్ష కొనసాగుతోంది. నేరుగా వైద్యం చేయబోమని చెప్పకుండా ఏదో కారణంతో కేజీహెచ్‌కు రిఫర్ చేసేస్తున్నారు. జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి దృష్టికి తీసుకెళ్తే కొందరు రోగులకు మాత్రమే చికిత్స అందిస్తున్నారు. ప్రతీ కేసును ఆయన దృష్టికి తీసుకు వెళ్లలేం కదా. – ఎం.పద్మావతి, విజయ పాజిటివ్ పీపుల్ సంస్థ అధ్యక్షురాలు, విజయనగరం. హెచ్ఐవీ రోగులకు పింఛన్లు ఇవ్వాలి హెచ్ఐవీ రోగులకు 2012 తర్వాత పింఛన్లు మంజూరు కాలేదు. విజయనగరం జిల్లాలోనే 5 వేల మందివరకు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. హెచ్ఐవీ రోగులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు చేసేలా చర్యలు చేపట్టాలి. హెచ్ఐవీ బాధితులకు అంత్యోదయ కార్డుల ప్రక్రియ నిలిచిపోయింది. అంత్యోదయ కార్డులు మంజూరు చేయాలి. – ఎన్.హరినాథ్‌రావు, విహాన్ సంస్థ ప్రతినిధి వివాహేతర సంబంధం వల్లే... వివాహేతర సంబంధం వల్ల నాకు మూడేళ్ల క్రితమే హెచ్ఐవీ సోకింది. వ్యాధి వచ్చిందని తెలియగానే చనిపోవాలని అనిపించింది. భార్య, పిల్లలు అనాథలవుతారనే భయంతో ధైర్యం తెచ్చుకున్నాను. తప్పులు చేసి నాలా ఎవ్వరూ ఈ వ్యాధి బారిన పడవద్దు. – రామారావు, హెచ్ఐవీ బాధితుడు, పార్వతీపురం నా భర్త ద్వారా నాకు... మా ఆయనకు ముందు హెచ్ఐవీ వచ్చింది. ఆ తర్వాత నాకు వచ్చింది. ఎనిమిదేళ్లనుంచి దీనికోసం మందులు వాడుతున్నాను. ఇప్పటికైతే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాలేదు. ఎనిమిదేళ్లు అవుతోంది. ఇప్పుడు కాస్త ఆరోగ్యం బాగోలేదు. వికారంగా ఉంటోంది. ఈ వ్యాధి సోకిందని తెలియగానే బెంగగా అనిపించింది. ఏఆర్టీ కౌన్సిలర్లు కౌన్సెలింగ్ ఇవ్వడం వల్ల బెంగ తీరింది. పూర్తిగా తగ్గిపోతే బాగుండనిపిస్తోంది. – రామలక్ష్మి, హెచ్ఐవీ బాధితురాలు, బొబ్బిలి ఏ తప్పు చేయకపోయినా... ఎటువంటి తప్పు చేయకపోయినా నాకు హెచ్ఐవీ వచ్చిం ది. జ్వరం వచ్చిందని గ్రామంలో ఉన్న ఆర్ఎంపీ వైద్యుడి వద్ద ఇంజక్షన్ చేయించుకున్నాను. జ్వరం ఎంతకీ తగ్గకపోవడంతో కేంద్రాస్పత్రికి వెళితే అక్కడ పరీక్షించి హెచ్ఐవీ ఉందని చెప్పారు. 13 ఏళ్లుగా మనోవ్యధ చెందుతున్నాను. ఎందుకు ఈ జన్మ అనిపించింది. కాని నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి కోసమైనా జీవించాలనిపిస్తోంది. – రమణ, హెచ్ఐవీ బాధితుడు, గుర్ల మండలం. -
అవగాహన మంత్రం..నిశ్శబ్దంపై విజయం
ఎయిడ్స్ ఉందని వినగానే తెలిసిన వారే కాదు కుటుంబ సభ్యులు కూడా దూరంగా ఉంచేవారు. ఆ వ్యక్తి చనిపోయినా మృతదేహాన్ని ముట్టుకోవడానికి ఇష్టపడేవారు కాదు. ఇది ఒకప్పటి పరిస్థితి. ఇప్పుడు ఎయిడ్స్ ఉందని తెలిసినా కలిసి జీవిస్తున్నారు. కుటుంబసభ్యులూ బాగా ఆదరిస్తున్నారు. సమాజంలో వారు ఒకరిగా జీవించేటట్లు చేస్తున్నారు. వ్యాధిపై పెరిగిన అవగాహనతో జిల్లాలో ఎయిడ్స్ బాధితుల సంఖ్య తగ్గుతోంది. ఈ మార్పే ప్రమాదకర నిశ్శబ్దంపై విజయానికి సంకేతమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో గత 2009 నుంచి ఇప్పటి వరకు 5,73,517 మంది సాధారణ ప్రజలకు పరీక్షలు నిర్వహించగా 17,405 మందికి హెచ్ఐవీ ఉన్నట్లు నిర్దారణ అయ్యింది. అలాగే గర్భిణిల్లో 4,84,326 మందికి పరీక్షలు చేయగా 1,033 మందికి హెచ్ఐవీ ఉన్నట్లు తేలింది. 2009లో సాధారణ ప్రజల్లో హెచ్ఐవీ బా«ధితుల సంఖ్య 6.15 శాతం ఉండగా, ప్రస్తుతం అది 1.50శాతంగా ఉంది. అలాగే గర్భిణుల్లో 2009లో 0.54శాతం నుంచి ప్రస్తుతం 0.09శాతానికి తగ్గినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెరగడం, పరీక్ష కేంద్రాలు, కౌన్సెలింగ్ కేంద్రాలు పెరగడం వల్లే ఇది సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు. ఏఆర్టీ కేంద్రాల్లో చికిత్స కోసం నమోదు చేసుకున్నవారి సంఖ్య అక్టోబర్ వరకు 18,273 కాగా అక్కడ క్రమం తప్పకుండా మందులు వారే సంఖ్య 8,741గా ఉంది. ఏఆర్టీ ప్లస్ కేంద్రంలో 2వ రకం మందులు క్రమం తప్పకుండా వాడే వారి సంఖ్య 53గా ఉంది. ఈసారి నినాదం నా ఆరోగ్యం– నా హక్కు ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ డిసెంబర్ 1వ తేదీన వరల్డ్ ఎయిడ్స్ డేను నిర్వహిస్తోంది. ఈ రోజున హెచ్ఐవీ, ఎయిడ్స్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం కోసం, ప్రపంచ వ్యాప్తంగా దీనిని ఎదుర్కొనేందుకు అందరినీ దగ్గర చేసే ఒక కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సారి నినాదాన్ని ‘నా ఆరోగ్యం–నా హక్కు’గా పేర్కొంది. హెచ్ఐవీతో జీవించే వారికి సంక్షేమ పథకాలు రెవెన్యూ/సివిల్ సప్లయ్ శాఖ అన్నపూర్ణ రేషన్‌కార్డు ద్వారా 30 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నారు. ఎస్టీ కార్పొరేషన్లో 90 శాతం రాయితీతో రుణాలు సెర్ప్/డీఆర్డీఏ ద్వారా పెన్షన్ నెలకు రూ.1000 చొప్పున 1318 మందికి ఇస్తున్నారు. ఐసీడీఎస్ ద్వారా చిన్నపిల్లలకు డబుల్ న్యూట్రిషన్ అందిస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీ వారు 50 శాతం రాయితీతో బస్సు పాస్ సౌకర్యం కల్పించారు. విద్యాశాఖ ద్వారా ఎస్ఎస్ఏ సహకారంతో కళాశాలల్లో రెడ్‌రిబ్బన్ క్లబ్ కార్యక్రమం అమలు. డిసెంబర్ కార్యక్రమాలు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు నగరంలో డిసెంబర్ ఒకటిన ఉదయం 8 గంటలకు భారీ ర్యాలీ ఏర్పాటు చేశాము. ఆ తర్వాత హెచ్ఐవీ/ఎయిడ్స్ నివారణకు కృషి చేసిన వారికి సునయన ఆడిటోరియంలో ఏర్పాటు చేసి కార్యక్రమంలో జ్ఞాపికలు, బహుమతులు ప్రదానం చేస్తాం. ఇదే సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మాసోత్సవాలను నిర్వహించనున్నాము. ఈ యేడాది టెస్ట్ ఆల్–ట్రీట్ ఆల్ న్యాకో మార్గదర్శకాల ప్రకారం సీడీ4 పరీక్షతో నిమిత్తం లేకుండా హెచ్ఐవీ పాజిటివ్ అని నిర్దారణ అయిన వెంటనే ఏఆర్టీ చికిత్స ప్రారంభిస్తున్నాము. మాతాశిశు మరణాలు తగ్గించేందుకు జిల్లాలో కొత్తగా ఏడు రక్తనిల్వ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అనుమతులు, పరికరాలను జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా సరఫరా చేస్తున్నాం. పెద్దాసుపత్రిలో యాంటి రిట్రోవైరల్ చికిత్స(ఏఆర్టి) కేంద్రాన్ని యాంటి రిట్రోవైరల్ చికిత్సా ప్లస్ కేంద్రంగా మార్చాము. – డాక్టర్ దేవసాగర్, ఇన్చార్జ్ అడిషనల్ డీఎంహెచ్ఓ (ఎయిడ్స్ అండ్ లెప్రసి) గర్భిణికి హెచ్ఐవీ ఉందని తేలితే గర్భిణికి హెచ్ఐవీ ఉందని పరీక్షల్లో తేలితే ఆమెను ఏఆర్టీ సెంటర్‌కు పంపిస్తాము. అక్కడ ఆమెకు సీడీ4 కౌంట్ పరీక్ష చేస్తారు. గతంలో సీడీ4 కౌంట్ 350 ఉంటే గానీ మందులు ఇచ్చేవారు కాదు. ఇప్పుడు 300లోపు ఉన్నా మందులు ఇస్తున్నారు. ఈ మందులు వాడుతూనే గైనకాలజిస్టు వద్ద నెలనెలా పరీక్షలు చేయించుకోవాలి. కాన్పు ఆసుపత్రిలోనే జరిగేటట్లు జాగ్రత్త పడాలి. తల్లికి హెచ్ఐవీ ఉంది కాబట్టి అది బిడ్డకు రాకుండా ఉండేందుకు గతంలో సిజేరియన్ ప్రసవాన్నే వైద్యులు సూచించేవారు. ఇప్పుడు గర్భిణి ఏఆర్టీ మందులు వాడుతోంది కాబట్టి సాధారణ ప్రసవమూ మంచిదే. ప్రసవం అయిన వెంటనే బిడ్డకు నివరిపిన్ అనే డ్రాప్స్ వేయాలి. రెండేళ్ల తర్వాత బిడ్డకు హెచ్ఐవీ లేదని నిర్దారణ అయితే అప్పుడు సాధారణ బిడ్డలా పెంచుకోవచ్చు. తల్లిపాల వల్ల బిడ్డకు ఇన్ఫెక్షన్లు రావు కనుక తాపవచ్చు. – డాక్టర్ జ్యోతిర్మయి, గైనకాలజిస్టు, కర్నూలు -
భార్యకు వ్యాధి వస్తే భర్త, భర్తకు వస్తే..
సందర్భం ఎయిడ్స్ రోగి అంటేనే భయంతో పారిపోయే పరిస్థితి నుంచి, సరైన అవగాహన ఉంటే రోజుకు కేవలం రూ. 30ల మందులతో ఎయిడ్స్ రోగులు 75 ఏళ్లు బతికే స్థితి వచ్చింది. కానీ అవగాహనా లోపమే అసలు సమస్యగా ఉంటోంది. ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా గత రెండు దశాబ్దాలుగా ఎయిడ్స్ వ్యాధిపై పరిశీలన జరుపుతున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కూటికుప్పల సూర్యారావుతో ఇంటర్వ్యూ... ఎయిడ్స్ వస్తే ఇక చావే గతి అనే అపోహ ఉంది కదా? ప్రజలలో అవగాహనా రాహిత్యం వల్లనే ఇలా జరుగుతోంది. అమెరికాలో మొట్టమొదటిసారిగా 35 ఏళ్ల క్రితం స్వలింగ సంపర్కం వల్ల ఈ వ్యాధి వచ్చింది. హాలీవుడ్ ప్రముఖ నటుడు రాక్ హడ్సన్ హెచ్ఐవీ బారిన పడ్డాక అమెరికన్ విమానంలో వెళుతుంటే చాలామంది విమానం దిగిపోయారు. అప్పట్లో ఈ వ్యాధి అంటే విపరీతంగా భయపడేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. హెచ్ఐవీ కూడా అన్ని వ్యాధుల లాంటిదేనని జనం నమ్మే పరిస్థితి వచ్చింది. సేఫ్ సెక్స్, సేఫ్ పేరెంట్, సేఫ్ నీడిల్, సేఫ్ బెడ్ లాంటి నాలుగు జాగ్రత్తలు తీసుకుంటే నూటికి నూరుశాతం ఈ వ్యాధిని నిర్మూలించవచ్చు. 1987లో మొదటి మందును కనుగొన్నారు. ఆ తరువాత 40 రకాల మందులు అందుబాటులోకి వచ్చాయి. మందులొచ్చినా ఈ వ్యాధిపై అవగాహనతో ఉండాల్సిన అవసరం ఉంది. గతంలో వ్యాధి ఉన్నవారు పెళ్లి చేసుకునే వారు కాదు, కానీ నేడు పాజి టివ్ పేరెంట్స్ కూడా సరైన మందులు వాడి, డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటే నూటికి నూరుశాతం ఇప్పుడు నెగెటివ్ బిడ్డను కనవచ్చు. నాకో (నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్) వారి సర్వే ప్రకారం 49 శాతం మంది గర్భిణీలకు తాము హెచ్ఐవీ పాజిటివ్ అని కూడా తెలవదు. ఎయిడ్స్‌పై అవగాహన అవసరం ఏమిటి? ప్రపంచంలో ఎన్నో వ్యాధులకు సంబంధించి అవగాహన కలిగించడానికి.. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్యసంస్థ సంయుక్తంగా కొన్నికొన్ని దినాలను గుర్తించాయి. ప్రజల్లో ఆయా వ్యాధులకు సం బంధించిన అవగాహన బలపడాలన్నదే వీటి ముఖ్య ఉద్దేశం. 1988లో మొట్టమొదటి ప్రపంచ ఎయిడ్స్ దినాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అప్పటినుంచి ఇప్పటిదాకా ఒక్కో ఏడాది ఒక్కో నినాదంతో ఎయిడ్స్ దినాన్ని జరుపుకుంటున్నారు. ఈ ఏడాది ‘జవాబుదారీతనాన్ని, భాగస్వామ్యాన్ని పెంచండి’ అనేది నినాదం. ముప్పైఏళ్లుగా ఎయిడ్స్‌పై పోరాటం జరుగుతున్నా దానిని మనం నివారించలేకపోయాం కాబట్టి ‘రెయిజ్ ఇంపాక్ట్’ అనే ఈ అవగాహనను జనాల్లోకి తీసుకెళ్లాలని ప్రకటించారు. దీనిలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు, సెలబ్రిటీలు పెద్దఎత్తున పాల్గొనాల్సి ఉంది. హెచ్ఐవీ పాజిటివ్ కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది కానీ అసలు హెచ్ఐవీ అనేదే లేకుండా పోవాలి. ఎయిడ్స్ వైరస్ ఒక్కటి మిగిలినా అది మళ్లీ వ్యాధిని వ్యాప్తి చేస్తుంది. ఆంధ్ర ప్రాంతంలో హెచ్ఐవీ గత రెండు మూడేళ్లలో ఐదుశాతం నుంచి 1.5 శాతానికి పడి పోయింది. దీన్ని జీరో శాతానికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు ఎయిడ్స్‌పై అవగాహన చేపడుతున్నాయా? గత మూడేళ్లుగా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు హెచ్ఐవీపై ప్రచారం విషయంలో మొద్దునిద్ర పోతున్నాయి. దీని ఫలితంగానే భారతదేశంలోనే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్యలో ఏపీ ప్రథమ స్థానం సాధిం చింది. పైగా అంతర్జాతీయ ఎన్జీవోల నుంచి డబ్బులు రాకుండా పోవడంతో ఎయిడ్స్ వ్యాధిపై ప్రచారం తగ్గిపోయింది. ఆరోగ్యంపై ఒక్కశాతం కూడా బడ్జెట్లో కేటాయింపు లేదు. పేదరికమే అనా రోగ్యానికి మూలకారణం. పేదరికం పోవాలంటే, ఆరోగ్యంపట్ల జాగరూకత ఉండాలి. కానీ ఆరోగ్యంపై మన ప్రభుత్వాలు మారుతల్లి ప్రేమ చూపిస్తున్నాయి. మన దేశంలో వ్యాధులు రాకుండా నిరోధించకపోవడంతో ప్రజలు తమ డబ్బును పూర్తిగా ఆరోగ్యంకోసమే ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ప్రజలు తమ సంపాదనలో 75 శాతం వెచ్చించి మందులు కొనాల్సిన పరిస్థితి ఉంటే ఎలా? హెచ్ఐవీపై ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలా? గతంలో మశూచికం వస్తే అరటి ఆకుమీదపెట్టి అడవిలో పడేసేవారు. అలాంటిది వ్యాక్సిన్ వల్ల అంత పెద్దవ్యాధిని నామరూపాలు లేకుండాచేశారు. 1978 తరువాత మశూచికంలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం శాస్త్ర అద్భుతంగానే చెప్పాలి. ఎయిడ్స్ వ్యాధి వచ్చినవారు స్వయంనియంత్రణ పాటించాలి. కలుషిత సిరంజీల వాడకంపై జాగరూకతతో ఉండాలి. సమర్థవంతంగా వ్యాధి వ్యాపించకుండా చేసుకునే మార్గాలున్నాయి. దీనిపై అవగాహన పెంచుకోవడం ద్వారా ఎయిడ్స్ రాకుండా చూసుకోవచ్చు. సమర్థవంతమైన వ్యవస్థ, మందులు వచ్చాయి. చాలామంది సిగ్గుతో, భయంతో ఈ వ్యాధికి సంబంధించిన విషయాలను బహిర్గతం చేయడం లేదు. భార్యకు వ్యాధి వస్తే భర్త, భర్తకు వ్యాధి వస్తే భార్య సపోర్ట్ చేసే పరిస్థితులు ఇప్పటికీ లేవు. ఏపీలో ట్రాన్స్‌జెండర్లలో 7.5 శాతం మందికి పాజిటివ్ ఉండటం మంచిది కాదు. రోజుకు 30 రూపాయల మందులతో 75 ఏండ్లు బతకవచ్చు. 20 ఏళ్లక్రితమే మందులువచ్చినా కూడా ఇంకా అవగాహన రాలేదు. దీనిపై డిసెంబర్ ఒకటిన మాత్రమే కాదు నిరంతరం చర్చ జరగాలి. ఈ భూమిమీద ఎయిడ్స్ ఉన్నంత కాలం ఇది జరగాలి, అప్పుడే ఎయిడ్స్ దూరం అవుతుంది. రిపోర్ట్ వ చ్చిన తర్వాత కూడా మందులు వాడటానికి ఆలస్యం చేయడంవల్లే ఎక్కువమంది చనిపోతున్నారు. (నేడు ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా) డాక్టర్ కూటికుప్పల సూర్యారావు వ్యాసకర్త నేషనల్ ప్రొఫెసర్, ఐఎమ్ఐ కాలేజి మొబైల్: 97031 00938 -
క్షణికావేశానికి లోనుకావద్దు
► హెచ్ఐవీకి మందులు లేవు.. నివారణ ఒక్కటే మార్గం ►ప్రపంచ ఎయిడ్స్ దినం సభలోడీఎంహెచ్ఓ ►విద్యార్థులతో ర్యాలీ ఒంగోలు సెంట్రల్ : హెచ్ఐవీ వ్యాధికి చికిత్స లేదని నివారణ ఒక్కటే మార్గమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె. యాస్మిన్ అన్నారు. ప్రపంచ ఎరుుడ్‌స దినం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధ్వర్యంలో గురువారం స్థానిక అంబేడ్కర్ భవన్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. హెచ్ఐవీకి గురైన అనేక కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువతీ యువకులు క్షణికావేశానికి లోను కాకూడదని హెచ్చరించారు. 15 నుంచి 49 ఏళ్ల వయసు గల వారు ఎక్కువగా ఈ వ్యాధికి గురి అవుతున్నారని చెప్పారు. దీని నివారణకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. పౌష్టికాహారం తీసుకోవాలి నయంకాని వ్యాధి బారిన పడినవారు పౌష్టికాహారం తీసుకుంటూ ఏఆర్టీ మందులు వాడితే తమ జీవిత కాలాన్ని పొడిగించుకోవచ్చని డీఎంహెచ్ఓ తెలిపారు. ఈ వాధివల్ల మరణించిన వారి పిల్లలు అనాథలుగా మారుతున్నారని తెలిపారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి టి. రాజా వెంకటాద్రి మాట్లాడతూ ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంగా పని చేస్తే ఈ మహమ్మారిని నిర్మూలించవచ్చన్నారు. దీని వ్యాప్తిలో భారత దేశం ప్రపంచంలో మూడో స్థానంలో ఉందన్నారు. వ్యాధిగ్రస్తులకు స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని కోరారు. ముందుగా కలెక్టర్ కార్యాలయం వద్ద ఎరుుడ్‌స ర్యాలీని ప్రారంభించారు. ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఇక్కడ సంయుక్త కలెక్టర్ డాక్టర్ హరిజవహర్‌లాల్ మాట్లాడుతూ ఎరుుడ్‌స వ్యాధికి నివారణే మార్గమని తెలిపారు. అవగాహనతోనే అరికట్టాలన్నారు. ఎరుుడ్‌స, లెప్రసీ విభాగం అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె. పద్మావతి, రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ వల్లీశ్వరి, జిల్లా క్షయ నివారణ అధికారి టి. రమేష్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సరళాదేవి, అదనపు డీఎంహెచ్ఓ శకుంతల, ఏపీవీవీ ఇన్చార్జి కో ఆర్డినేటర్ ఉష, రిమ్స్ వైద్యులు డాక్టర్ జోసఫ్ శామ్యూల్, డాక్టర్ బాలాజీ నాయక్, కిరణ్మరుు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, నర్సింగ్, ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఎన్సీసీ..ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో.. ఒంగోలు కల్చరల్ : వరల్డ్ ఎరుుడ్‌స డే పురస్కరించుకుని గురువారం స్థానిక సీఎస్ఆర్ శర్మ కళాశాల విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు, జాతీయ సేవా పథకం వలంటీర్లు ర్యాలీ నిర్వహించారు. కళాశాల నుంచి ప్రకాశం భవనం వరకు వెళ్లారు. ప్రిన్సిపాల్ మొలకలపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ఎన్సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు కృషి చేయాలని కోరారు. ఎసీసీసీ ఆఫీసర్ కె. మనోజ్ఞకుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శాస్త్రి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
పులిరాజాకు ఇప్పుడు ఏమైంది ?
డిసెంబర్ 1 వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా... ‘పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా?’... ఒకప్పుడు విస్తృతంగా జరిగిన ప్రచారం ఇది. ఉత్కంఠను రేకెత్తించడమే కాదు, ఉపద్రవంలా మారిన ఎయిడ్స్ / హెచ్ఐవీపై అవగాహన పెంపొందించడానికి దోహదపడిన ప్రచారం ఇది. కొన్నేళ్లుగా ఈ ప్రచార జోరు కనబడనంతగా తగ్గింది. ఇంతకూ పులిరాజా ఇప్పుడేమయ్యాడు? బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, ఎబోలా, జికా వంటి వాటి తాకిడితో మరుగునపడ్డాడా? ‘పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా?’ అనే ప్రచారం ఒకప్పుడు ఊరూ వాడా హోరెత్తించింది. ఎయిడ్స్ లేదా హెచ్ఐవీ అంటేనే జనం భయంతో వణికిపోయే రోజులవి. ‘పులిరాజా’ ప్రచారం జనంలో ఎయిడ్స్‌పై కొంత మేరకు అవగాహన కల్పించడంలో సఫలమైంది. బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, ఎబోలా, జికా వైరస్ వంటి ఉపద్రవాలు ముంచుకు రావడంతో ఎయిడ్స్ నుంచి జనం దృష్టి మళ్లింది. కొన్నేళ్లుగా ఎయిడ్స్/హెచ్ఐవీ వ్యాప్తిలో కొంత తగ్గుదల నమోదవుతున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. అయితే, ఎయిడ్స్/హెచ్ఐవీ పూర్తిగా కనుమరుగు కాలేదు. ఇప్పటికీ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. అయితే, గడచిన రెండు మూడు దశాబ్దాలతో పోలిస్తే కొత్తగా నమోదవుతున్న హెచ్ఐవీ కేసుల సంఖ్య కొంతవరకు తగ్గుముఖం పట్టింది. యాంటీ రిట్రోవైరల్ చికిత్స పొందుతున్న వారి సంఖ్య పెరిగింది. ఇది కొంత ఆశాజనకమైన పరిణామమే అయినా, ఎయిడ్స్/హెచ్ఐవీ మన దేశం నుంచి ఇంకా పూర్తిగా కనుమరుగవలేదు. కనీసం అంతరించే దశకు కూడా చేరుకోలేదు. హెచ్ఐవీ కేసుల్లో మన దేశం ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. తెలుగు రాష్ట్రాలను ఉమ్మడిగా కలిపి చూసుకుంటే, దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్/హెచ్ఐవీ పరిస్థితిపై ఒక విహంగ వీక్షణం. ఇదీ చరిత్ర మూడు దశాబ్దాల కిందటి వరకు ఎయిడ్స్/హెచ్ఐవీ అంటే జనానికి ఏమీ తెలియదు. ఫ్రెంచి సంతతికి చెందిన కెనడియన్ ఫ్లైట్ అటండెంట్ గేటన్ డుగాస్ అంతుచిక్కని లక్షణాలతో అమెరికాలో చికిత్స పొందుతూ 1984లో మరణించాడు. అమెరికన్ వైద్య నిపుణులు ఇతడినే తొలి ఎయిడ్స్ రోగిగా గుర్తించారు. విచ్చలవిడి శృంగారానికి అలవాటు పడ్డ డుగాస్‌కు ఉత్తర అమెరికా అంతటా దాదాపు 2500 మంది లైంగిక భాగస్వాములు ఉండేవారు. వాళ్లలో దాదాపు సగానికి సగం మంది స్వలింగ భాగస్వాములూ ఉండేవారు. డుగాస్ పుణ్యాన ఎంతమందికి ఈ వ్యాధి సంక్రమించిందో కచ్చితమైన లెక్కలేవీ దొరకలేదు గానీ, అతడు మరణించిన కొద్ది కాలంలోనే ఇబ్బడి ముబ్బడిగా ఎయిడ్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి. నిజానికి అంతకు ముందు 1969లోనే రాబర్ట్ రేఫోర్డ్ అనే ఆఫ్రికన్ సంతతికి చెందిన అమెరికన్ టీనేజర్ ఈ వ్యాధితో మరణించాడు. అతడు మరణించే నాటికి ప్రాణాంతకమైన ఈ వ్యాధికి ఎయిడ్స్ అనే పేరు పెట్టలేదు. దీనికి కారణమయ్యే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియెన్సీ వైరస్‌నూ (హెచ్ఐవీ) గుర్తించలేదు. రాబర్ట్ మరణించిన చాలాకాలానికి అతడి నమూనాలపై పరిశోధనలు సాగించిన వైద్యులు అతడు ఎయిడ్స్ వల్లే మరణించినట్లు నిర్ధారించారు. అయితే, ఎయిడ్స్‌కు కారణమయ్యే హెచ్ఐవీ వైరస్ మొదట పశ్చిమాఫ్రికా, మధ్య ఆఫ్రికా ప్రాంతాల్లోని చింపాంజీలు, గొరిల్లాలు వంటి వానరాలకు సోకిందని, వాటి నుంచి మనుషులకు వ్యాపించిందని గుర్తించారు. ఆఫ్రికాలో ఈ వ్యాధి మనుషులకు సోకిన పదేళ్లలోనే ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. తొలినాళ్లలో ఈ వ్యాధి అవగాహన రాహిత్యం, సిరంజీలను తగిన రీతిలో స్టెరిలైజ్ చేయకపోవడం వంటి నిర్లక్ష్యపూరిత చికిత్సా పద్ధతులు, వ్యాధి నిర్ధారణ సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం వంటి కారణాల వల్ల విపరీతంగా వ్యాపించింది. దీని పర్యవసానాలను గురించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సహా పలు అంతర్జాతీయ సంస్థలు చొరవ తీసుకోవడంతో కొంత కాలానికి వ్యాప్తి తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. శాస్త్ర పరిశోధనలతో చికిత్సా పద్ధతుల్లోనూ మార్పులు వచ్చాయి. యాంటీ రిట్రోవైరల్ ఔషధాలు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా హెచ్ఐవీ సోకిన వారి జీవన ప్రమాణాలు, ఆయుఃప్రమాణం మెరుగుపడ్డాయి. అయితే, ఇప్పటికీ చికిత్సకు నోచుకోని రోగుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ప్రపంచంలో ఇదీ పరిస్థితి ఎయిడ్స్ బారిన పడ్డ ప్రముఖులు ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు సైతం ఎయిడ్స్ భూతానికి బలైపోయారు. రక్తమార్పిడి వల్ల ఎయిడ్స్ బారిన పడి మరణించిన తొలి సెలిబ్రిటీగా అమెరికన్ టెన్నిస్ ప్లేయర్ అర్థర్ యాష్ వార్తల్లో నిలిచాడు. గుండె ఆపరేషన్ సమయంలో రక్తమార్పిడి చేసిన వైద్యుల నిర్లక్ష్యం వల్ల హెచ్ఐవీ బారిన పడ్డాడు. అప్పటికి ఇంకా మెరుగైన చికిత్సలు అందుబాటులోకి రాకపోవడంతో ఎయిడ్స్ కోరల్లో చిక్కి 1993 ఫిబ్రవరి 6న నిస్సహాయంగా కన్నుమూశాడు. విచ్చలవిడి లైంగిక సంబంధాల కారణంగా ఎయిడ్స్ బారిన పడి మరణించిన ప్రముఖుల్లో బ్రిటిష్ రాక్‌స్టార్ ఫ్రెడ్డీ మెర్క్యురీ, ప్రపంచంలోనే తొలి సూపర్‌మోడల్ గియా కరాంగీ, అమెరికన్ నటి అమండా బ్లాక్, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా కొడుకు మగతో మండేలా వంటి వారు చాలామందే ఉన్నారు. తనకు ఎయిడ్స్ సోకినట్లు బహిరంగంగా ప్రకటించిన తొలి సెలిబ్రిటీ మాత్రం హాలీవుడ్ నటుడు రాక్ హడ్సన్. ఈ విషయాన్ని అతడు 1985 జూలైలో మీడియాకు వెల్లడించాడు. ఆ తర్వాత మూడు నెలలు గడిచేలోగానే మరణించాడు. హెచ్ఐవీ గుర్తింపుతో మలుపు ఎయిడ్స్ వ్యాధికి కారణమవుతున్నది హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియెన్సీ వైరస్ (హెచ్ఐవీ) అనే విషయాన్ని తొలిసారిగా 1982లో ఫ్రెంచి వైరాలజిస్ట్ డాక్టర్ లూక్ మాంటేనియర్ నేతృత్వంలోని వైద్యుల బృందం గుర్తించింది. ఈ పరిశోధనకు గుర్తింపుగా మాంటేనియర్, ఫ్రాంకోయిస్ బారెసినౌసి, హెరాల్డ్ జుర్ హాసెన్లకు 2008లో నోబెల్ బహుమతి లభించింది. మహమ్మారిలాంటి ఎయిడ్స్ వ్యాధికి కారణమయ్యే వైరస్ ఏమిటో కనుగొన్న తర్వాత హెచ్ఐవీ/ ఎయిడ్స్ చికిత్స పద్ధతులు చాలా మెరుగుపడ్డాయి. హెచ్ఐవీ వైరస్‌ను పూర్తిగా నిర్మూలించలేకపోయినా, చాలావరకు సమర్థంగా నియంత్రించగల ఔషధాలు తయారయ్యాయి. హెచ్ఐవీ వైరస్‌ను కట్టడి చేయగల యాంటీ రిట్రోవైరల్ ఔషధాలు మొట్టమొదటిసారిగా 1987లో అందుబాటులోకి వచ్చాయి. అంతకు ముందు హెచ్ఐవీ సోకిన వారికి ఇతరేతర ఔషధాలతో చికిత్సలు చేస్తూ వచ్చినా, అవేవీ వారి జీవితకాలాన్ని పొడిగించలేకపోయేవి. యాంటీ రిట్రోవైరల్ చికిత్స (ఏఆర్టీ) అందుబాటులోకి వచ్చాక పరిస్థితి కొంతవరకు మెరుగుపడింది. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) విడుదల చేసిన తాజా లెక్కల ప్రకారం హెచ్ఐవీ సోకిన వారిలో 46 శాతం మంది మాత్రమే ఈ చికిత్సను పొందుతున్నారు. అంటే, దాదాపు సగానికి పైగా హెచ్ఐవీ రోగులు నేటికీ తగిన చికిత్సకు నోచుకోలేకపోతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా ఏఆర్టీ చికిత్స కోసం గత ఏడాది కొత్తగా 20 లక్షల మంది నమోదయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఏఆర్టీ చికిత్స పొందుతున్న వారి సంఖ్య 2010 నాటికి 75 లక్షలుగా ఉంటే, 2015 నాటికి ఈ సంఖ్య 1.70 కోట్లకు చేరుకుంది. ఇంకా చికిత్సకు నోచుకోని హెచ్ఐవీ రోగుల సంఖ్య దాదాపు 2 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. 2020 నాటికి హెచ్ఐవీ సోకిన వారిలో 90 శాతం మందిని ఏఆర్టీ చికిత్స పరిధిలోకి తీసుకురావాలని యూఎన్ఎయిడ్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యం నెరవేరితే భవిష్యత్తు మరింత ఆశాజనకంగా ఉంటుంది. మన దేశంలో ఇలా... ముప్పయ్యేళ్ల కిందటి వరకు భారత్‌లో హెచ్ఐవీ/ఎయిడ్స్ పేరు సైతం ఎవరికీ తెలియదు. తొలిసారిగా 1986లో డాక్టర్ సునీతి సాల్మన్ అనే వైద్యురాలు చైన్నయ్‌లోని ఒక సెక్స్ వర్కర్‌కు ఈ వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. అదే దేశంలోని తొలి కేసు. ఏడాది గడిచే సరికి కొత్తగా మరో 135 హెచ్ఐవీ పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. వాళ్లలో పద్నాలుగు మందికి అప్పటికే ఎయిడ్స్ ముదిరిపోయిన దశలో ఉంది. తర్వాతి కాలంలో శరవేగంగా హెచ్ఐవీ వ్యాప్తి పెరగడంతో ప్రభుత్వం 1992లో జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థను (నాకో) ఏర్పాటు చేసింది. ‘నాకో’ ద్వారా ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో విస్తృత ప్రచారం సాగించింది. హెచ్ఐవీ వ్యాప్తిని నిరోధించేందుకు వివిధ దశల్లో రకరకాల కార్యక్రమాలను చేపట్టింది. ఒకవైపు ప్రభుత్వం తన వంతుగా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నా, 2010 నాటికి మన దేశంలో హెచ్ఐవీ పాజిటివ్ కేసుల సంఖ్య 23.95 లక్షలకు చేరుకుంది. అయితే, 2000 సంవత్సరానికి ముందు పరిస్థితితో పోలిస్తే, 2000 నుంచి 2010 మధ్య కాలంలో కొత్త కేసుల సంఖ్య దాదాపు సగానికి సగం తగ్గినట్లు యూఎన్ ఎయిడ్స్-2012 నివేదిక వెల్లడించింది. హెచ్ఐవీ/ఎయిడ్స్‌ను గుర్తించినప్పటి నుంచి మన దేశంలో ఈ వ్యాధితో దాదాపు 1.70 లక్షల మంది మరణించారు. ఇదిలా ఉంటే, గత ఏడాది మన దేశంలో కొత్తగా 1.96 లక్షల హెచ్ఐవీ పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. గత ఏడాది లెక్కల ప్రకారం మన దేశంలో మొత్తం దాదాపు 28.81 లక్షల మంది హెచ్ఐవీతో ఉన్నట్లు అంచనా. కండోమ్స్ వంటి రక్షణ సాధనాలేవీ లేకుండా అపరిచితులతో లేదా సెక్స్ వర్కర్స్‌తో సెక్స్‌లో పాల్గొనడం ద్వారా హెచ్ఐవీ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లైంగిక అవయవాల ద్వారా హెచ్ఐవీ వ్యాప్తికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నా, నోటి ద్వారా కూడా ఇది వ్యాపించే అవకాశాలు లేకపోలేదు. స్త్రీ పురుష లైంగిక సంబంధాలు లేదా పురుషుల స్వలింగ సంపర్కం ద్వారా హెచ్ఐవీ వ్యాపించే అవకాశాలు ఎక్కువ. వారితో పోల్చుకుంటే స్త్రీ స్వలింగ సంపర్కుల మధ్య హెచ్ఐవీ వ్యాపించే అవకాశాలు చాలా తక్కువ. స్టెరిలైజ్ చేయని సూదుల వల్ల, ఎలాంటి పరీక్షలు జరపకుండా హెచ్ఐవీ సోకిన రోగుల నుంచి సేకరించిన రక్తాన్ని ఇతరులకు ఎక్కించడం వల్ల అన్నెం పున్నెం ఎరుగని అమాయకులకు సైతం హెచ్ఐవీ సోకిన సందర్భాలు లేకపోలేదు. సిఫిలిస్, గనేరియా వంటి ఇతర లైంగిక వ్యాధులు ఉన్నవారికి హెచ్ఐవీ త్వరగా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హెచ్ఐవీ సోకిన గర్భిణులకు పుట్టే బిడ్డలకు తల్లుల ద్వారానే ఈ వ్యాధి సంక్రమించే అవకాశాలు ఉంటాయి. పుట్టిన తర్వాత తల్లిపాల ద్వారా కూడా హెచ్ఐవీ సోకే అవకాశాలు ఉంటాయి. అభం శుభం తెలియని చాలామంది చిన్నారులు తల్లుల ద్వారానే ఈ వ్యాధి బారినపడుతున్నారు. అయితే, తల్లుల నుంచి బిడ్డలకు ఈ వ్యాధి సంక్రమించకుండా నిరోధించే చికిత్సా పద్ధతులు ఇప్పుడు అందుబాటులోకి రావడం కొంత ఉపశమనం. వ్యాధి లక్షణాలు హెచ్ఐవీ సోకిన వెనువెంటనే ఎలాంటి లక్షణాలు కనిపించవు. శరీరంలో హెచ్ఐవీ వైరస్ బలం పుంజుకున్న తర్వాతే వ్యాధి లక్షణాలు కనిపించడం మొదలవుతాయి. తొలి దశలో మామూలు ఫ్లూ లాంటి లక్షణాలే కనిపిస్తాయి. జ్వరం, తలనొప్పి, నోట్లో పుండ్లు ఏర్పడటం, బరువు తగ్గడం, రాత్రివేళ చెమటలు పట్టడం, అలసట, ఆకలి తగ్గుదల, చర్మంపై ర్యాష్, గొంతు బొంగురుపోవడం, లింఫ్ గ్రంథుల్లో వాపులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే, కొద్ది వారాల్లోనే ఈ లక్షణాలు వాటంతట అవే మాయమవుతాయి. రెండో దశలో హెచ్ఐవీ వైరస్ నిద్రాణ స్థితికి చేరుకుంటుంది. వైరస్ సోకిన మనిషిలో ఎలాంటి అనారోగ్య లక్షణాలూ ప్రస్ఫుటంగా కనిపించవు. దాదాపు ఎనిమిది నుంచి పదేళ్ల వరకు ఈ పరిస్థితి కొనసాగుతుంది. నిద్రాణ స్థితిలో సైతం ఈ వైరస్ పునరుత్పత్తి కొనసాగిస్తూ శరీరంలో తామర తంపరగా పెరుగుతుంది. కీలకమైన రోగ నిరోధక కణాలను నాశనం చేస్తుంది. ముఖ్యంగా తెల్ల రక్తకణాల్లోని సీడీ4 లేదా టీ హెల్పర్ కణాలను దెబ్బతీస్తుంది. ఈ పరిస్థితిలో ఉన్నవారిలో ఎలాంటి వ్యాధి లక్షణాలూ కనిపించకపోయినా, వారి ద్వారా ఇతరులకు వ్యాధి సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మూడో దశలో హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ ఎయిడ్స్‌గా (ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియెన్సీ సిండ్రోమ్) మారుతుంది. రక్తంలో సీడీ4 కణాల సంఖ్య మిల్లీలీటరుకు 500 లేదా అంతకంటే తక్కువకు పడిపోతోంది. ఈ పరిస్థితిలో రోగ నిరోధక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. ఈ స్థితికి చేరుకున్న వారిలో న్యుమోనియా, మెదడుకు ఇన్ఫెక్షన్, నోరు, జీర్ణకోశంలో ఇన్ఫెక్షన్లు, జ్వరం, డయేరియా, విపరీతంగా బరువు తగ్గుదల వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాప్తికి కారణాలు హెచ్ఐవీ వ్యాప్తికి ముఖ్యంగా రక్షణ లేని శృంగార సంబంధాలే కారణంగా ఉన్నా, ఇతరేతర కారణాలు కూడా ఈ వ్యాధి వ్యాప్తికి దోహదపడుతున్నాయి. హెచ్ఐవీ వ్యాప్తికి దారితీస్తున్న ముఖ్యమైన కారణాలు ఇవే... పరిశోధనలు ఆశాజనకం ఎయిడ్స్/హెచ్ఐవీ నిరోధానికి, చికిత్సకు సమర్థంగా ఉపయోగపడగల 44 కొత్త ఔషధాలు, వ్యాక్సిన్ల తయారీ కోసం అమెరికన్ బయోఫార్మా కంపెనీలు ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో 25 యాంటీ వైరల్ ఔషధాలు, 16 వ్యాక్సిన్లు కాగా మరో మూడు జన్యువుల స్థాయిలో మార్పు తెచ్చి హెచ్ఐవీని రూపుమాపగల ఔషధాలని, ఇవి అందుబాటులోకి వస్తే హెచ్ఐవీపై విజయం సాధించినట్లేనని ఔషధ తయారీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న ఔషధాల వల్ల హెచ్ఐవీ రోగుల జీవితకాలాన్ని మరో పదిహేనేళ్ల వరకు పొడిగించడానికి వీలవుతోందని, సమర్థమైన కొత్త ఔషధాలు అందుబాటులోకి వచ్చినట్లయితే పరిస్థితి మరింత మెరుగుపడగలదని చెబుతున్నారు. -
ప్రపంచ ఎయిడ్స్ డే
-
హెచ్ఐవీపై అవగాహన ర్యాలీ
టేకులపల్లి (ఖమ్మం జిల్లా) : ఖమ్మం జిల్లా టేకులపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు మంగళవారం హెచ్ఐవీపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని పీఏసీఎస్ అధ్యక్షుడు దళపతి శ్రీనివాస్‌రాజు జెండా ఊపి ప్రారంభించారు. -
ఎయిడ్స్ చిన్నారులకు సమంత సాయం
టాలీవుడ్, కోలీవుడ్‌లలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమంత సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా అదే జోరు చూపిస్తోంది. ఇప్పటికే ప్రత్యూష ఫౌండేషన్ స్థాపించి ఎంతో మంది చిన్నారులకు సాయం చేస్తున్న సమంత అంతర్జాతీయ ఎయిడ్స్ డే సందర్భంగా ఎయిడ్స్ వ్యాధితో బాదపడుతున్న చిన్నారుల కోసం ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా మరో నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1న ఎయిడ్స్ డే సందర్భంగా పోషకాహారం అందక ఇబ్బంది పడుతున్న ఎయిడ్స్ చిన్నారులకు ప్రోటీన్ పౌడర్ బాటిల్స్‌ను అందించింది. ప్రతినెల 1వ తారీఖున వంద మంది చిన్నారులకు ఈ పౌడర్‌ను అందించనున్నట్టుగా ప్రకటించింది. ఎయిడ్స్ వ్యాధితో బాదపడుతున్న చిన్నారులకు ఆహారలోపం సమస్య కాకూడదనే సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తన సోషల్ నెట్వర్క్ పేజ్‌లపై కామెంట్ చేసింది సమంత. -
వడిగా.. ఎయిడ్స్ అంతం దిశగా..
సందర్భం ఎయిడ్స్... ప్రపంచ మానవ ఇతిహాసంలో, చరిత్రకు అందిన మేరకు ఏ ఒక్క అంశమూ కలిగిం చని పెనువిషాదాన్నీ, విల య విధ్వంసాన్నీ సృష్టిం చింది, సృష్టిస్తోంది. 1981 జూన్‌లో అమెరికాలో ఎయిడ్స్ వ్యాధి బయటప డింది. గడచిన 34 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఏడున్నర కోట్ల మందికిపైగా ఎయిడ్స్ వ్యాధిని కల గజేసే హెచ్ఐవీ క్రిమిసోకింది. నాలుగు కోట్లకు మిం చి వ్యాధిగ్రస్తులను బలితీసుకొంది. 2015 జూన్ అం చనాల ప్రకారం 3 కోట్ల 69 లక్షల మంది ఈ వ్యాధితో బాధలు పడుతున్నారు. ఎయిడ్స్ తన తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపని మానవ జీవన పార్శ్వం లేదు. సహారా ఎడారి దిగువన ఉన్న ఆఫ్రికా దేశాలు అనేకం అన్ని రకాలుగా కునారిల్లిపోయినా, ధనిక దేశాలలో దాదాపు అంతరించి పోయిన క్షయవంటి వ్యాధులు మళ్లీ తలెత్తినా, కుటుంబ విలువలూ- సామాజిక కట్టుబాట్లతో ఉండే భారతదేశం హెచ్ఐవీ వ్యాధి గ్రస్తుల సంఖ్యలో ప్రపంచంలో మూడోస్థానంలో ఉండి మనకు తలవంపులు తెచ్చినా; వైద్యరంగంలో కొత్త మందులు రూపొందించి, మార్కెట్లో ప్రవేశ పెట్టడానికి అయ్యే కాలవ్యవధి దశాబ్దాల నుండి రెండు మూడేళ్లకే తగ్గిపోయినా... అవన్నీ ఎయిడ్స్ బహుముఖ ప్రభావాలే. ఐక్యరాజ్య సమితి ఎయిడ్స్ పోరాట సంస్థ ‘యూఎన్ ఎయిడ్స్’ మార్గనిర్దేశనంలో ప్రపంచ దేశాల ప్రభుత్వాలూ, ప్రజలూ, మీడియా, స్వచ్ఛం ద సంస్థలూ, వైద్యులూ తీరైన రీతిలో స్పందించి ఎయిడ్స్‌ను చాలావరకూ అదుపులోకి తెచ్చారు. 2015 కల్లా 1 కోటి 50 లక్షల మందికి ఎయిడ్స్ ఔషధాలు అందించాలన్న లక్ష్యాన్ని అధిగమించి నేడు 1 కోటీ 58 లక్షల మందికి చేరువ చేశారు. 2015 ఎయిడ్స్ డే డిసెంబర్ 1ని ‘వడిగా, ఎయిడ్స్ అంతం దిశగా’ నినాదంతో నిర్వహిస్తు న్నారు. 2020 నాటికి క్రిమిసోకిన వారిలో 90 శాతం మందికి ఔషధాలు అందజేయాలనీ, వీరిపట్ల చుల కన భావాలను పూర్తిగా తొలగించాలనీ యూఎన్ ఎయిడ్స్ లక్ష్యాలుగా నిర్దేశించుకుంది. తెలుగువారికి పొంచివున్న ముప్పు ఎయిడ్స్ వ్యాధికి కారణమైన హెచ్ఐవీ క్రిమి ప్రధా నంగా సెక్సు ద్వారా వ్యాపిస్తుంది. కొంత మేరకు వ్యాధిగ్రస్తులైన స్త్రీలకు కడుపులోని బిడ్డకూ, చను బాల ద్వారానూ, ఇంజెక్షన్లు, రక్తం ద్వారా వ్యాపి స్తుంది. భారత్‌లో 2011 డిసెంబర్‌కు 24 లక్షల మం ది, 2013 చివరి నాటికి 21 లక్షల మంది హెచ్ఐవీతో బాధపడుతున్నట్లు మన ప్రభుత్వం ఐక్యరాజ్య సమి తి సంస్థ ‘యూఎన్ ఎయిడ్స్’కు అందచేసిన నివేది కలో తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5 లక్షల మంది ఈ వ్యాధి బారినపడ్డట్లు నమోదైంది. తెలు గు జనాభా దేశంలో దాదాపు 6 శాతం అయితే, భారత్‌లోని హెచ్ఐవీ రోగుల్లో 20 శాతంపైగా తెలుగువారున్నారు. విశాల జనబాహుళ్యంలో హెచ్ఐవీ అంచనాకు కొండగుర్తుగా చూసే గర్భిణులలో హెచ్ఐవీ బిహార్, ఒడిశా, రాజస్థాన్‌లో వంటి రాష్ట్రాలలో వెయ్యికి 3 ఉండగా, తెలుగు వారిలో ఇది వెయ్యికి ఆరుగురు కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. ప్రపం చంలోని అనేక దేశాలు ఎయిడ్స్ వ్యాధికి సంబంధిం చిన 2014 వివరాలు యూఎన్ ఎయిడ్స్‌కు అందజే సినా, మన దేశం అట్టి వివరాలు క్రోడీకరించకపో వడం భారత్‌లో ఈ వ్యాధి పట్ల నెలకొంటున్న నిర్లిప్త తకు తార్కాణం. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ వితరణ సంస్థలు ఎయిడ్స్‌కు నిధుల కేటాయింపు లను తగ్గించాయి. మన దేశంలో ఎయిడ్స్ నిరోధా నికిగాను కండోమ్స్ లభ్యత తగ్గింది. తెలుగు రాష్ట్రా ల్లో హెచ్ఐవీ పరీక్షల టెస్ట్ కిట్స్‌కు కొరత ఏర్పడింది. ఎయిడ్స్ రంగంలో మనం ఎదుర్కొంటున్న అవమానకరమైన పరిస్థితిని దాటడానికి సామాజిక బాధ్యత కలిగిన వారంతా చిత్తశుద్ధితో కృషి చెయ్యాలి. అంతర్జాతీయ, జాతీయ సంస్థల నుండి మనకు తగ్గిన నిధులను తెలుగు ప్రభుత్వాలు భర్తీ చేయాలి. ఈ నిర్లిప్తతను భగ్నం చేయకపోతే దేశా భివృద్ధికి దోహదం చేసే యువశ్రామిక తరంలో చాలామందిని ఎయిడ్స్‌కి బలి ఇచ్చే ప్రమాదం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త! (నేడు యూఎన్ ఎయిడ్స్ డే...) - డా॥వై.మురళీకృష్ణ వ్యాసకర్త ఎం.డి., ఎయిడ్స్ కార్యకర్త/ వైద్య నిపుణుడు, కాకినాడ. మొబైల్: 9440677734 -
జీతాలు లేవు..ఆరోగ్య బీమా
-
ఎవరీ తార?
వెండితెరను ఏలుతున్న అగ్రతారలకు దీటుగా... ప్రముఖ నర్తకీమణులకు తీసిపోని విధంగా హుషారైన డ్యాన్స్‌లతో అలరించిన ఈ తార ఎవరో తెలుసా? చైతన్యానికి.. విద్యార్థులు ఆడిపాడారు. మహమ్మారి ఎయిడ్స్ భూతాన్ని తరిమేయాలని నినదించారు. ప్రజల్లో చైతన్యం కలిగించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సోమవారం నిజాం కాలేజీ నుంచి లలిత కళాతోరణం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించింది. అనంతరం లలిత కళాతోరణంలో జరిగిన కార్యక్రమంలో హిజ్రాలు డ్యాన్స్ లతో అదరగొట్టారు. మీరు చూసిన ఆ తార కూడా ఓ హిజ్రానే. - సాక్షి, సిటీబ్యూరో -
వరల్డ్ ఎయిడ్స్ డే: చర్చ
-
ఎయిడ్స్‌కు నివారణ ఒక్కటే మార్గం
నేడు ప్రపంచ ఎయిడ్స్ డే ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తారీఖున ఎయిడ్స్ దినం జరుపుకుంటాం. ఆ రోజు ఎయిడ్స్ మీద అవగాహన, అది ఎలా వ్యాపి స్తుంది, దానిని అరికట్టడానికి మనందరం ఎలాంటి చర్యలు చేపట్టాలి లాంటి అంశాల ను అవగాహన సదస్సులు పెట్టి ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థ లు తమ వంతు కృషిని వివరిస్తాయి. అరక్షిత లైంగిక సంబంధాలు, ఎయిడ్స్ ఉన్న వ్యక్తి రక్త మార్పిడి ద్వారా, తల్లి నుండి బిడ్డకు, సూదులు, సిరంజీల ద్వారా హెచ్ఐవీ ఒకరి నుండి ఇంకొకరికి సంక్రమిస్తుంది. ఒకసారి హెచ్ఐవీ సోకిన వ్యక్తి క్రమంగా తనలోని రోగనిరోధక శక్తిని త్వరితగతంగా కోల్పోతూ ఎయిడ్స్‌కి గురవుతారు. ఎయిడ్స్‌కి చికిత్స చేయవ చ్చును, కానీ నయం చేయలేం. నిరోధించడమనేది ముఖ్యం. ఎన్ఏసీఓ(నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్) మార్చి, 2014 లెక్కల ప్రకారం మన దేశంలో 20.89 లక్షల మం ది ఎయిడ్స్ బారిన పడినారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల లో 4.19 లక్షల మంది ఎయిడ్స్ బాధితులు ఉన్నారు. భారత దేశం లో మొత్తం ఎయిడ్స్ ఉన్నవారిలో యువతీ యువకులు 31 శాతం ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్ఏసీఓ వారు మూడు మార్గాలను సూచించారు. 1) యువ తీ యువకులు తెలియని వయస్సులో సెక్స్‌కి దూరంగా ఉండడం. 2) జీవిత భాగస్వామి తోనే నమ్మకంగా సెక్స్‌లో పాల్గొనడం. 3) నిరోధ్ని కచ్చితంగా వాడడం. హెచ్ఐవీ/ ఎయిడ్స్ స్త్రీలలో త్వరితగతిన వ్యాప్తి చెందడానికి ఆస్కారం ఉన్నది. దీనికి కారణం 1) సహచరుడు నమ్మకంగా లేకపోవడం, 2) పురుషు లు నిరోధ్ వాడడానికి ఇష్టపడకపోవడం. నిరోధ్ వాడమని అడిగే హక్కు స్త్రీలకు ఉంది. అలా అంగీకరించని పురుషునితో సాంగత్యాన్ని స్త్రీలు తిరస్కరించాలి. ఎయిడ్స్ సోకిన స్త్రీ జీవితం కూడా దుర్భరంగా ఉంటుంది. తను ఇంటి పని, వంట పని చేసుకుంటూ తిరిగి కుటుంబ పోషణ కొరకు కష్టపడాలి. దీని ద్వారా స్త్రీకి తగు విశ్రాంతి దొరకక త్వరగా ఆరోగ్యం క్షీణిస్తుంది. ఎయిడ్స్ ఉన్న వ్యక్తి బట్టలు వేసుకున్నా, వారు వండినది తిన్నా, వారితో కలసి పని చేసినా, ఇంకా ఎయిడ్స్ ఉన్న వారిని ముద్దుపెట్టుకున్నా కూడా ఎయిడ్స్ వ్యాప్తి చెందదు. సమాజం లో అందరిలాగానే కలిసి జీవించే హక్కు ఎయిడ్స్ ఉన్న వారికి కూడా ఉంది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వేతర సంస్థలు మరియు విద్యా సంస్థలు వారి హెచ్.ఆర్ పాలసీతోపాటు హెచ్ఐవీ/ ఎయిడ్స్ మెయి న్ స్ట్రీమింగ్ పాలసీని కూడా తయారు చేసుకొని, అమలు పరచాలి. ఎయిడ్స్ ఉన్న తల్లిదండ్రుల అజాగ్రత్త వల్ల భారతదేశంలో దాదాపు 1.45లక్షల మంది పిల్లలు ఎయిడ్స్ తో జీవిస్తున్నారు. అందుకే గర్భం ధరించిన వెంటనే తల్లిదండ్రులు హెచ్ఐవీ/ ఎయిడ్స్ పరీక్షలు చేయించుకొని తగు చర్యలు చేపట్టా లి. ఎయిడ్స్ ఉన్న తల్లి నుండి బిడ్డకు ఎయిడ్స్ సంక్రమించే అవకాశాలు చాలా ఎక్కువ. హెచ్ఐవీ సోకిందని తెలిసిన వెంట నే తగు చర్యలు, చికిత్సలు తీసుకోవడం ద్వారా మనిషి చాలా కాలం సంతోషంగా బతకగలడు. 1) హెచ్ఐవీ సోకిన వ్యక్తి కచ్చితంగా యాంటి రిట్రోవైరల్ థెరపీ(ఏఆర్టీ) మందులు క్రమంతప్పకుండా తీసుకోవాలి. 2) వీలైనంత వరకు పౌష్టికాహా రాన్ని తీసుకోవాలి. 3) మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా అందరితో కలిసి మామూలుగానే జీవించాలి. ‘సెక్స్’ అనేది అనివార్యము. కాని ‘ఎయిడ్స్’ అనే దాన్ని తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నిరోధించవచ్చు అనే నినాదంతో మనందరం కలిసి ఎయిడ్స్ రహిత సమాజం కోసం పని చేద్దాం. వ్యాసకర్త సామాజిక కార్యకర్త -
ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యం కావాలి : వి.వి.వినాయక్
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఎయిడ్స్ రహిత సమాజం ప్రతి పౌరుడూ కృషి చేయాలని ప్రముఖ సినీ దర్శకులు వి.వి.వినాయక్ పిలుపునిచ్చారు. సమాజంలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల చిన్నచూపు చూడడం తగదన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లా ఎయిడ్స్ నిర్మూలన, నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి పబ్లిక్‌గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వినాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎయిడ్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించాల్సి అవసరం ఉందన్నారు. ఇందుకు అన్ని వర్గాల వారు తోడ్పడాలన్నారు. కార్యక్రమం అనంతరం ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించారు. వీరిలో పి.రవీందర్, బి.ఉమ, ఎస్.రామారావు, వెంకటలక్ష్మి తదితరులున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్ నిర్మూలన, నియంత్రణ ప్రాజెక్టు మేనేజర్ నాగిరెడ్డి, అదనపు డీఎంహెచ్ఓ సుభాష్‌చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు వరల్డ్ ఎయిడ్స్ డే