వడిగా.. ఎయిడ్స్ అంతం దిశగా..
సందర్భం
ఎయిడ్స్... ప్రపంచ మానవ ఇతిహాసంలో, చరిత్రకు అందిన మేరకు ఏ ఒక్క అంశమూ కలిగిం చని పెనువిషాదాన్నీ, విల య విధ్వంసాన్నీ సృష్టిం చింది, సృష్టిస్తోంది. 1981 జూన్‌లో అమెరికాలో ఎయిడ్స్ వ్యాధి బయటప డింది. గడచిన 34 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఏడున్నర కోట్ల మందికిపైగా ఎయిడ్స్ వ్యాధిని కల గజేసే హెచ్‌ఐవీ క్రిమిసోకింది. నాలుగు కోట్లకు మిం చి వ్యాధిగ్రస్తులను బలితీసుకొంది. 2015 జూన్ అం చనాల ప్రకారం 3 కోట్ల 69 లక్షల మంది ఈ వ్యాధితో బాధలు పడుతున్నారు.
ఎయిడ్స్ తన తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపని మానవ జీవన పార్శ్వం లేదు. సహారా ఎడారి దిగువన ఉన్న ఆఫ్రికా దేశాలు అనేకం అన్ని రకాలుగా కునారిల్లిపోయినా, ధనిక దేశాలలో దాదాపు అంతరించి పోయిన క్షయవంటి వ్యాధులు మళ్లీ తలెత్తినా, కుటుంబ విలువలూ- సామాజిక కట్టుబాట్లతో ఉండే భారతదేశం హెచ్‌ఐవీ వ్యాధి గ్రస్తుల సంఖ్యలో ప్రపంచంలో మూడోస్థానంలో ఉండి మనకు తలవంపులు తెచ్చినా; వైద్యరంగంలో కొత్త మందులు రూపొందించి, మార్కెట్‌లో ప్రవేశ పెట్టడానికి అయ్యే కాలవ్యవధి దశాబ్దాల నుండి రెండు మూడేళ్లకే తగ్గిపోయినా... అవన్నీ ఎయిడ్స్ బహుముఖ ప్రభావాలే.
ఐక్యరాజ్య సమితి ఎయిడ్స్ పోరాట సంస్థ ‘యూఎన్ ఎయిడ్స్’ మార్గనిర్దేశనంలో ప్రపంచ దేశాల ప్రభుత్వాలూ, ప్రజలూ, మీడియా, స్వచ్ఛం ద సంస్థలూ, వైద్యులూ తీరైన రీతిలో స్పందించి ఎయిడ్స్‌ను చాలావరకూ అదుపులోకి తెచ్చారు. 2015 కల్లా 1 కోటి 50 లక్షల మందికి ఎయిడ్స్ ఔషధాలు అందించాలన్న లక్ష్యాన్ని అధిగమించి నేడు 1 కోటీ 58 లక్షల మందికి చేరువ చేశారు.
2015 ఎయిడ్స్ డే డిసెంబర్ 1ని ‘వడిగా, ఎయిడ్స్ అంతం దిశగా’ నినాదంతో నిర్వహిస్తు న్నారు. 2020 నాటికి క్రిమిసోకిన వారిలో 90 శాతం మందికి ఔషధాలు అందజేయాలనీ, వీరిపట్ల చుల కన భావాలను పూర్తిగా తొలగించాలనీ యూఎన్ ఎయిడ్స్ లక్ష్యాలుగా నిర్దేశించుకుంది.
తెలుగువారికి పొంచివున్న ముప్పు
ఎయిడ్స్ వ్యాధికి కారణమైన హెచ్‌ఐవీ క్రిమి ప్రధా నంగా సెక్సు ద్వారా వ్యాపిస్తుంది. కొంత మేరకు వ్యాధిగ్రస్తులైన స్త్రీలకు కడుపులోని బిడ్డకూ, చను బాల ద్వారానూ, ఇంజెక్షన్లు, రక్తం ద్వారా వ్యాపి స్తుంది. భారత్‌లో 2011 డిసెంబర్‌కు 24 లక్షల మం ది, 2013 చివరి నాటికి 21 లక్షల మంది హెచ్‌ఐవీతో బాధపడుతున్నట్లు మన ప్రభుత్వం ఐక్యరాజ్య సమి తి సంస్థ ‘యూఎన్ ఎయిడ్స్’కు అందచేసిన నివేది కలో తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5 లక్షల మంది ఈ వ్యాధి బారినపడ్డట్లు నమోదైంది. తెలు గు జనాభా దేశంలో దాదాపు 6 శాతం అయితే, భారత్‌లోని హెచ్‌ఐవీ రోగుల్లో 20 శాతంపైగా తెలుగువారున్నారు.
విశాల జనబాహుళ్యంలో హెచ్‌ఐవీ అంచనాకు కొండగుర్తుగా చూసే గర్భిణులలో హెచ్‌ఐవీ బిహార్, ఒడిశా, రాజస్థాన్‌లో వంటి రాష్ట్రాలలో వెయ్యికి 3 ఉండగా, తెలుగు వారిలో ఇది వెయ్యికి ఆరుగురు కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. ప్రపం చంలోని అనేక దేశాలు ఎయిడ్స్ వ్యాధికి సంబంధిం చిన 2014 వివరాలు యూఎన్ ఎయిడ్స్‌కు అందజే సినా, మన దేశం అట్టి వివరాలు క్రోడీకరించకపో వడం భారత్‌లో ఈ వ్యాధి పట్ల నెలకొంటున్న నిర్లిప్త తకు తార్కాణం. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ వితరణ సంస్థలు ఎయిడ్స్‌కు నిధుల కేటాయింపు లను తగ్గించాయి. మన దేశంలో ఎయిడ్స్ నిరోధా నికిగాను కండోమ్స్ లభ్యత తగ్గింది. తెలుగు రాష్ట్రా ల్లో హెచ్‌ఐవీ పరీక్షల టెస్ట్ కిట్స్‌కు కొరత ఏర్పడింది.
ఎయిడ్స్ రంగంలో మనం ఎదుర్కొంటున్న అవమానకరమైన పరిస్థితిని దాటడానికి సామాజిక బాధ్యత కలిగిన వారంతా చిత్తశుద్ధితో కృషి చెయ్యాలి. అంతర్జాతీయ, జాతీయ సంస్థల నుండి మనకు తగ్గిన నిధులను తెలుగు ప్రభుత్వాలు భర్తీ చేయాలి. ఈ నిర్లిప్తతను భగ్నం చేయకపోతే దేశా భివృద్ధికి దోహదం చేసే యువశ్రామిక తరంలో చాలామందిని ఎయిడ్స్‌కి బలి ఇచ్చే ప్రమాదం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త!
(నేడు యూఎన్ ఎయిడ్స్ డే...)
- డా॥వై.మురళీకృష్ణ
వ్యాసకర్త ఎం.డి., ఎయిడ్స్ కార్యకర్త/ వైద్య నిపుణుడు, కాకినాడ. మొబైల్: 9440677734