ఎయిడ్స్‌కు నివారణ ఒక్కటే మార్గం
నేడు ప్రపంచ ఎయిడ్స్ డే
ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తారీఖున ఎయిడ్స్ దినం జరుపుకుంటాం. ఆ రోజు ఎయిడ్స్ మీద అవగాహన, అది ఎలా వ్యాపి స్తుంది, దానిని అరికట్టడానికి మనందరం ఎలాంటి చర్యలు చేపట్టాలి లాంటి అంశాల ను అవగాహన సదస్సులు పెట్టి ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థ లు తమ వంతు కృషిని వివరిస్తాయి. అరక్షిత లైంగిక సంబంధాలు, ఎయిడ్స్ ఉన్న వ్యక్తి రక్త మార్పిడి ద్వారా, తల్లి నుండి బిడ్డకు, సూదులు, సిరంజీల ద్వారా హెచ్‌ఐవీ ఒకరి నుండి ఇంకొకరికి సంక్రమిస్తుంది. ఒకసారి హెచ్‌ఐవీ సోకిన వ్యక్తి క్రమంగా తనలోని రోగనిరోధక శక్తిని త్వరితగతంగా కోల్పోతూ ఎయిడ్స్‌కి గురవుతారు. ఎయిడ్స్‌కి చికిత్స చేయవ చ్చును, కానీ నయం చేయలేం. నిరోధించడమనేది ముఖ్యం.
ఎన్‌ఏసీఓ(నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్) మార్చి, 2014 లెక్కల ప్రకారం మన దేశంలో 20.89 లక్షల మం ది ఎయిడ్స్ బారిన పడినారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల లో 4.19 లక్షల మంది ఎయిడ్స్ బాధితులు ఉన్నారు. భారత దేశం లో మొత్తం ఎయిడ్స్ ఉన్నవారిలో యువతీ యువకులు 31 శాతం ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్‌ఏసీఓ వారు మూడు మార్గాలను సూచించారు. 1) యువ తీ యువకులు తెలియని వయస్సులో సెక్స్‌కి దూరంగా ఉండడం. 2) జీవిత భాగస్వామి తోనే నమ్మకంగా సెక్స్‌లో పాల్గొనడం. 3) నిరోధ్‌ని కచ్చితంగా వాడడం.
హెచ్‌ఐవీ/ ఎయిడ్స్ స్త్రీలలో త్వరితగతిన వ్యాప్తి చెందడానికి ఆస్కారం ఉన్నది. దీనికి కారణం 1) సహచరుడు నమ్మకంగా లేకపోవడం, 2) పురుషు లు నిరోధ్ వాడడానికి ఇష్టపడకపోవడం. నిరోధ్ వాడమని అడిగే హక్కు స్త్రీలకు ఉంది. అలా అంగీకరించని పురుషునితో సాంగత్యాన్ని స్త్రీలు తిరస్కరించాలి. ఎయిడ్స్ సోకిన స్త్రీ జీవితం కూడా దుర్భరంగా ఉంటుంది.
తను ఇంటి పని, వంట పని చేసుకుంటూ తిరిగి కుటుంబ పోషణ కొరకు కష్టపడాలి. దీని ద్వారా స్త్రీకి తగు విశ్రాంతి దొరకక త్వరగా ఆరోగ్యం క్షీణిస్తుంది. ఎయిడ్స్ ఉన్న వ్యక్తి బట్టలు వేసుకున్నా, వారు వండినది తిన్నా, వారితో కలసి పని చేసినా, ఇంకా ఎయిడ్స్ ఉన్న వారిని ముద్దుపెట్టుకున్నా కూడా ఎయిడ్స్ వ్యాప్తి చెందదు.
సమాజం లో అందరిలాగానే కలిసి జీవించే హక్కు ఎయిడ్స్ ఉన్న వారికి కూడా ఉంది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వేతర సంస్థలు మరియు విద్యా సంస్థలు వారి హెచ్.ఆర్ పాలసీతోపాటు హెచ్‌ఐవీ/ ఎయిడ్స్ మెయి న్ స్ట్రీమింగ్ పాలసీని కూడా తయారు చేసుకొని, అమలు పరచాలి. ఎయిడ్స్ ఉన్న తల్లిదండ్రుల అజాగ్రత్త వల్ల భారతదేశంలో దాదాపు 1.45లక్షల మంది పిల్లలు ఎయిడ్స్ తో జీవిస్తున్నారు. అందుకే గర్భం ధరించిన వెంటనే తల్లిదండ్రులు హెచ్‌ఐవీ/ ఎయిడ్స్ పరీక్షలు చేయించుకొని తగు చర్యలు చేపట్టా లి. ఎయిడ్స్ ఉన్న తల్లి నుండి బిడ్డకు ఎయిడ్స్ సంక్రమించే అవకాశాలు చాలా ఎక్కువ.
హెచ్‌ఐవీ సోకిందని తెలిసిన వెంట నే తగు చర్యలు, చికిత్సలు తీసుకోవడం ద్వారా మనిషి చాలా కాలం సంతోషంగా బతకగలడు. 1) హెచ్‌ఐవీ సోకిన వ్యక్తి కచ్చితంగా యాంటి రిట్రోవైరల్ థెరపీ(ఏఆర్‌టీ) మందులు క్రమంతప్పకుండా తీసుకోవాలి. 2) వీలైనంత వరకు పౌష్టికాహా రాన్ని తీసుకోవాలి. 3) మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా అందరితో కలిసి మామూలుగానే జీవించాలి. ‘సెక్స్’ అనేది అనివార్యము. కాని ‘ఎయిడ్స్’ అనే దాన్ని తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నిరోధించవచ్చు అనే నినాదంతో మనందరం కలిసి ఎయిడ్స్ రహిత సమాజం కోసం పని చేద్దాం.
వ్యాసకర్త సామాజిక కార్యకర్త