
ఎవరీ తార?
వెండితెరను ఏలుతున్న అగ్రతారలకు దీటుగా... ప్రముఖ నర్తకీమణులకు తీసిపోని విధంగా హుషారైన డ్యాన్స్‌లతో అలరించిన ఈ తార ఎవరో తెలుసా?
చైతన్యానికి..
విద్యార్థులు ఆడిపాడారు. మహమ్మారి ఎయిడ్స్ భూతాన్ని తరిమేయాలని నినదించారు. ప్రజల్లో చైతన్యం కలిగించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సోమవారం నిజాం కాలేజీ నుంచి లలిత కళాతోరణం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించింది. అనంతరం లలిత కళాతోరణంలో జరిగిన కార్యక్రమంలో హిజ్రాలు డ్యాన్స్ లతో అదరగొట్టారు. మీరు చూసిన ఆ తార కూడా ఓ హిజ్రానే.
- సాక్షి, సిటీబ్యూరో