డిప్రెషన్‌తో పెరిగే గుండెపోటు ముప్పు
హెచ్ఐవీ బాధితులు తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతుంటే.. వాళ్లకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అప్పటికే హెచ్ఐవీ ఉండి, దాంతోపాటు మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ (ఎండీడీ) కూడా ఉన్న బాధితులు ఎక్కువగా మూడ్ సంబంధిత సమస్యలతో బాధపడతారని, దానివల్ల ఎప్పుడూ విపరీతమైన బాధ, ఏ విషయం మీదా ఆసక్తి ఉండదని... ఈ కారణాలతో ఎక్యూట్ మయోకార్డియల్ ఇన్‌ఫార్క్షన్ (ఏఎంఐ) లేదా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందన్నారు.
బాగా ప్రభావవంతమైన యాంటీ రెట్రోవైరల్ థెరపీతో వాళ్ల జీవనకాలం పెరుగుతుందని, హెచ్ఐవీ శరీరంలో ఉన్నా ఎక్కువ కాలం బతుకుతారని వివరించారు. కానీ అదే సమయంలో వారికి గుండెకవాటాలకు సంబంధించిన వ్యాధులు (కార్డియో వాస్క్యులర్ డిసీజెస్ - సీవీడీ) వచ్చే ప్రమాదం పెరుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే వీళ్లకు హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్, కిడ్నీ వ్యాధులు తదితరాలకు మందులు ఇస్తుంటే మాత్రం ఈ తరహా ముప్పు కొంతవరకు తగ్గినట్లు కనిపించింది.
హెచ్ఐవీ ఉన్నవారితో పాటు.. సాధారణ ప్రజల్లో ఎండీడీ ఉన్నవాళ్లకు కూడా ఇలాంటి ముప్పు ఉండొచ్చని, అయితే వీరికి మాత్రం మరింత ఎక్కువగా ఉంటుందని అమెరికాలోని వాండెర్‌బిల్ట్ యూనివర్సిటీ స్కూలుకు చెందిన మాథ్యూ ఎస్ ఫ్రీబెర్గ్ చెప్పారు. హెచ్ఐవీ బాధితులలో సీవీడీ ముప్పును తగ్గించడానికి చేపట్టాల్సిన చర్యల గురించి అత్యవసరంగా ఆలోచించాలని తెలిపారు. ఈ పరిశోధన వివరాలను జామా కార్డియాలజీ సంస్థ ఆన్‌లైన్‌లో ప్రచురించింది.