అందుబాటు ధరల గృహ రుణాల కంపెనీ ఇండియా షెల్టర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పబ్లిక్ ఇష్యూ రెండో రోజుకల్లా విజయవంతమైంది. 4.34 రెట్లు అధిక స్పందనను సాధించింది. కంపెనీ 1.79 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. గురువారాని(14)కల్లా 7.76 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. ఎన్‌ఎస్‌ఈ గణాంకాల ప్రకారం సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 7.33 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 5 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. అయితే అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 84 శాతమే సబ్‌స్క్రయిబ్ అయ్యింది.
ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా రూ. 400 కోట్ల విలువైన షేర్లనుప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచారు. షేరుకి రూ. 469–493 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 1200 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. మంగళవారం(12న) యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 360 కోట్లు అందుకుంది. ప్రధానంగా టైర్–2, టైర్–3 పట్టణాలలో మధ్యాదాయ, తక్కువ ఆదాయ వర్గాల వారికి గృహ రుణాలు సమకూర్చుతోంది.
Comments
Please login to add a commentAdd a comment