girls hostels
-
భోపాల్: షెల్టర్ హోం నుంచి 26 మంది బాలికల మిస్సింగ్!
మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భోపాల్‌లో చట్టవిరుద్దంగా నిర్వహిస్తున్న షెల్టర్ హోమ్ నుంచి 26 మంది బాలికలు అదృశ్యమయ్యారు. భోపాల్ శివారు ప్రాంతంలో అంచల్ బాలికల హాస్టల్ నిర్వహిస్తున్నారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్) చైర్మన్ ప్రియాంక్ కనుంగో .. ఈ చిల్డ్రన్స్ హోమ్‌ను ఆకస్మికంగా సందర్శించారు. అయితే రిజిస్టర్‌ను తనిఖీ చేయగా.. అందులో 68 బాలికల ఎంట్రీలు ఉండగా.. 26 మంది గల్లంతైనట్లు గుర్తించారు. మిస్ అయిన వారిలో గుజరాత్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని సెహోర్, రైసెన్, చింద్వారా, బాలాఘాట్ ప్రాంతాలకు చెందిన బాలికలు ఉన్నారు. అదృశ్యమైన బాలికల గురించి షెల్టర్ హోమ్ డైరెక్టర్ అనిల్ మాథ్యూను ప్రశ్నించగా.. ఆయన పొంతన లేని సమాధానలు చెప్పాడు. అనుమానం వచ్చిన అధికారి.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో బాలికల హాస్టల్లో అనేక అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. అసలు షెల్టర్ హోంను అక్రమంగా నిర్వహిస్తున్నట్లు తేలింది. వీధుల్లో ఒంటరిగా కనిపించిన పిల్లలను ఒక చోట చేర్చి, ఎలాంటి లైసెన్స్ లేకుండా ఓ మిషనరీ( మత గురువు) ఈ షెల్టర్ హోమ్‌ను నడుపుతున్నట్లు కనుంగో ట్వీట్ చేశారు. రక్షించిన పిల్లలకు రహస్యంగా క్రైస్తవ మతాన్ని ఆచరించేలా చేశారని ఆరోపించారు. హాస్ట్‌లో ఎక్కువమంది అమ్మాయిలు ఆరు నుంచి 18 సంవత్సరాల వారేనని.. వీరిలో అధికంగా హిందువులే ఉన్నట్లు తెలిపారు. కాగా ఈ విషయం గురించి తెలుసుకున్న గవర్నర్.. దీనిపై దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశిస్తూ ప్రభుత్వ సీఎస్‌కు నోటీసులు పంపినట్లు తెలిపారు. ఇక షెల్టర్ హోంలోని మిగతా పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పజెప్పారు. చదవండి: రామమందిర ప్రారంభం.. ఆలయానికి వెళ్లి మహా హారతి ఇస్తా: ఉద్ధవ్ -
విద్యార్థినులకు కొత్త వసతి గృహాన్ని నిర్మించండి
కేపీహెచ్‌బీకాలనీ: జేఎన్టీయూహెచ్లో విద్యార్థినుల కోసం కొత్త వసతి గృహాన్ని నిర్మించాలని ఓఎస్డీ స్కూడెంట్స్ అఫైర్ బానోతు ధర్మాను కోరారు. ఈ మేరకు బుధవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా విద్యార్ఠి నాయకురాలు శేషుశ్రీ పంచాల మాట్లాడుతూ... ఇటీవల వసతి గృహాల్లోనే లైబ్రరీ సదుపాయం కల్పించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గతంతో పోలిస్తే ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో చదివే విద్యార్థినుల సంఖ్య పెరిగిందన్నారు. విద్యార్థినుల సంఖ్యకు అందుకనుగుణంగా మరో వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని కోరాన్నారు. మెస్ బిల్లులు సైతం ఎక్కువగా వస్తున్నాయని, మెస్ బిల్లులను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. కార్యక్రమంలో హాస్టల్ కో ఆర్డినేటర్ పవిత్ర, కీర్తన, శ్రీజ, జ్ఞాన ప్రసీద, శ్రేయ, సుప్రియ తదితరులు పాల్గొన్నారు. -
హాస్టల్ అమ్మాయిలూ జరభద్రం!
సాక్షి, చెన్నై : హాస్టల్స్‌లో ఉండే అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త అంటున్నారు చెన్నై పోలీసులు. లేడిస్ హాస్టల్స్‌లో సీక్రెట్‌గా కెమెరాలు అమర్చి, వారి వీడియోస్‌ను రికార్డు చేస్తున్న యజమానిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదంబాక్కం తిల్లై నగర్లో సంజీవి అనే వ్యక్తి తన నివాసం రెండో అంతస్తులో లేడిస్ హాస్టల్ నిర్వహిస్తున్నాడు. ఇందులో పది మందికి పైగా అమ్మాయిలు అద్దెకు ఉంటున్నారు. ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న ఓ యువతికి తాము ఉంటున్న గదిలో రహస్య కెమెరాలు ఉన్నాయన్న అనుమానం వచ్చింది. ఆ కెమెరాలను ఎలా కనిపెట్టాలని గూగుల్ సెర్చ్ చేస్తే సాఫ్ట్వేర్ లభ్యమైంది. సాఫ్ట్‌వేర్‌ను తన ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న యువతి తన గదిలోని లైట్లు, స్విచ్ బోర్డులు, బాత్రూమ్ అంతా వెతికింది. దీంతో అసలు బండారం బయటపడింది. రూమ్‌లో చిన్నచిన్న కెమెరాలు ఆమె కంటపడ్డాయి. హాస్టల్ యువతుల ఫిర్యాదు మేరకు పోలీసులు కెమెరాలను, కొన్ని అనుమానాస్పద పరికరాలు స్వాధీనం చేసుకుని హాస్టల్ యజమానిని అదుపులోకి తీసుకుని విచారించారు. తన నివాసం నుండే వైఫై ఆన్ చేసి బ్లూటూత్ కెమెరాల్లో రికార్డైన అమ్మాయిల వీడియోలను తన ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని చూస్తున్నట్లు విచారణలో సంజీవి తెలిపాడు. అతని ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో చాలా మంది అమ్మాయిల వీడియోలు ఉండటం గమనించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై గతంలో కూడా కేసులు ఉన్నట్టు గుర్తించారు. -
గుండుగొలను హాస్టల్లో ఏసీబీ తనిఖీలు
భీమడోలు/పెదవేగి రూరల్:గుండుగొలనులోని సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహంలో గురువారం ఏలూరు ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ వి.గోపాలకృష్ణ నేతృత్వంలో సీఐ కె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిబ్బంది వసతిగృహాన్ని తనిఖీ చేశారు. శిథిలమైన హాస్టల్ భవనాన్ని వారు పరిశీలించారు. అపరిశుభ్ర పరిసరాలను చూసి అసహనం వ్యక్తం చేశారు. హాస్టల్లో కొన్ని అవకతవకలను గుర్తించారు. మెనూ సక్రమంగా అమలు చేయడం లేదని నిర్ధారించారు. ఇప్పటికే కూలేందుకు సిద్ధంగా ఉన్న భవనాల నుంచి బాలికలను ఖాళీ చేయించి గుండుగొలను జెడ్పీ ఉన్నత పాఠశాల తరగతి గదుల్లోకి మార్చారు. అయితే భోజనం, కాలకృత్యాలు తీర్చుకునేందుకు మాత్రం శిథిలమైన హాస్టల్‌నే వినియోగిస్తున్నారు. ఈ భవనంలో మరుగుదొడ్లకు తలుపులు లేకపోవడం, పెచ్చులూడిన శ్లాబులు, అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించి వార్డెన్‌ను ప్రశ్నించారు. రికార్డులను పరిశీలించి నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని గుర్తించారు. బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్నారు. రికార్డుల నిర్వహణలోనూ అవకతవకలు గుర్తించి వసతి గృహం సంక్షేమ అధికారిణిని మందలించారు. బయోమెట్రిక్‌లో ఉన్న లోపాలను అనువుగా మార్చుకుని వాస్తవానికి ఉన్న బాలికల సంఖ్య కన్నా ఎక్కువ మంది ఉన్నట్టు రికార్డుల్లో చూపించడాన్ని గుర్తించారు. ఈ వసతి గృహంలో 8 నుంచి 10వ తరగతి వరకు 77 మంది బాలికలు ఉన్నారని రికార్డుల్లో పేర్కొన్నారు. అయితే 26 మంది టెన్త్ విద్యార్థినులు వెళ్లిపోవడంతో 51 మంది ఉండాల్సి ఉంది. వీరిలో అసలు ఏడుగురు బాలికలు లేరు. అయినా వీరి హాజరు నమోదు చేయడాన్ని డీఎస్పీ తప్పుబట్టారు. రెండు రోజులుగా సంక్షేమాధికారిణి బి.రాధాదేవి విద్యార్థుల హాజరు కూడా వేయకపోవడాన్ని గుర్తించారు. దీనితోపాటు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి, క్రిస్మస్ పండుగ తరుణంలో అందించిన చంద్రన్న కానుకల కిట్లు 50 నుంచి 60 వసతిగృహంలో దర్శనమిచ్చాయి. ఈ సందర్భంగా డీఎస్పీ వి.గోపాలకృష్ణ మాట్లాడుతూ బాలికల సంఖ్య కన్నా 20 మంది వరకు ఎక్కువగా నమోదు చేసుకుంటున్నారని, వసతిగృహం నిర్వహణ, పరిసరాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, శిథిల భవనంలో నిర్వహించడం తగదని పేర్కొన్నారు. దీనిపై నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని పేర్కొన్నారు. ఏలూరు బాలుర హాస్టల్లో.. ఏలూరు టౌన్ : ఏలూరు పవర్‌పేటలోని బీసీ సంక్షేమ బాలుర వసతి గృహంలోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. సీఐ యూజే విల్సన్ ఆధ్వర్యంలో వసతిగృహంలో పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం, దుర్గంధం వెదజల్లడాన్ని గుర్తించారు. హాస్టల్లో ఉన్న రెండు మరుగుదొడ్లు 40మంది పిల్లలకు ఎలా సరిపోతాయని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. రికార్డుల్లో 80మంది పిల్లలు ఉన్నట్లు చూపిస్తున్నారని, కానీ 40 మంది పిల్లలు మాత్రమే ఉన్నారని గుర్తించారు. మెనూలోనూ నాణ్యత పాటించడం లేదని తెలుసుకున్నారు. -
బాలికల వసతి గృహాల్లో..
భద్రాచలం : జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళాశాల స్థాయి సెల్ఫ్ మేనేజ్మెంట్ హాస్టళ్లలో సమస్యలు గూడుకట్టుకున్నాయి. ఇంటర్, డిగ్రీ విద్యార్థుల కోసం హడావుడిగా వసతి గృహాలు ప్రారంభించినా.. మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలోని 10 (బాలురు –5, బాలికలు–5) ఎస్ఎం హాస్టళ్లలో సుమారు 750 మంది విద్యార్థులు ఉంటున్నారు. ఇందులో కొత్తగూడెం మినహా మిగతా ఎక్కడా పక్కా భవనాలు లేవు. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 23 ప్రీ మెట్రిక్ వసతి గృహాలు సైతం నిర్వహిస్తుండగా, వీటిలో 1615 మంది ఉంటున్నారు. వసతి గృహాల్లో చాలా చోట్ల సరైన వసతులు లేవు. ఈ సమస్యలను గుర్తించిన కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిధులు కేటాయించారు. ప్రధానంగా బాలికల వసతి గృహాల్లో అవసరమైన చోట్ల యుద్ధప్రాతిపదికన మౌలిక వసతులు కల్పించేందుకు రూ. 35.50 లక్షలు మంజూరు చేశారు. కానీ వాటిని సవ్యంగా వినియోగించక విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరమ్మతుల పేరిట వసతి గృహాలకు పైపైన రంగులు వేసి నిధులు దుర్వినియోగం చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పనులపై ‘సాక్షి’ పరిశీలన చేయగా, మరమ్మతుల్లో దాగి ఉన్న గమ్మత్తు వెలుగులోకి వచ్చింది. రూ.35.50 లక్షలతో పనులు... వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రీ మెట్రిక్ హాస్టళ్ల పరిధిలోనే ఎస్ఎం హాస్టళ్లను కూడా నిర్వహిస్తున్నందున, ఇక్కడ మౌలిక వసతులు మెరుగుపరిస్తే అందరికీ బాగుంటుందని భావించారు. సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల నివేదికల ఆధారంగా జిల్లాలోని ఏడు బాలికల వసతి గృహాల మరమ్మతుల కోసం రూ.35.50 లక్షలు మంజూరు చేశారు. అధికారులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం భద్రాచలం ఏ హాస్టల్‌కు రూ. 8.50 లక్షలు, బీ హాస్టల్‌కు రూ.4 లక్షలు, బూర్గంపాడుకు రూ.4.50 లక్షలు, మణుగూరుకు రూ.4.50 లక్షలు, పాల్వంచ రూ. 5 లక్షలు, ఇల్లెందు రూ. 4.50 లక్షలు, కొత్తగూడెం హాస్టల్‌కు రూ. 4.50 లక్షలతో మరమ్మతు పనులు చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ఇంజనీరింగ్ శాఖ పర్యవేక్షణలో చేపట్టిన ఈ పనులన్నీ పూర్తయ్యాయని అధికారులు చెపుతున్నారు. అంతా వారిష్టమే.. హాస్టళ్లలో చేపట్టిన పనులన్నీ ఎస్సీ కార్పొరేషన్ ఇంజనీరింగ్ అ«ధికారులు ఇష్టానుసారమే చేసినట్లుగా తెలుస్తోంది. వసతి గృహాల అధికారుల నివేదికలను పక్కన పెట్టి, వారికి ఇష్టమొచ్చిన రీతిలో పనులు చేశారు. భద్రాచలంలోని బాలికల బీ హాస్టల్లో ప్రహరీ నుంచి హాస్టల్ బిల్డింగ్ వరకు సీసీ రోడ్ వేయాలని హెచ్‌డబ్ల్యూవో నివేదిక ఇవ్వగా, ఇంజనీరింగ్ అధికారులు మాత్రం హాస్టల్ ప్రాంగణంలో పూలమొక్కల మధ్యలో ఫ్లోరింగ్ పనులు చేశారు. అక్కడ అవసరం లేకున్నా, ఏదో రీతిన నిధులు ఖర్చు చేసేందుకు కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన ఇంజనీరింగ్ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి. మిగతా చోట్ల కూడా ఇదే రీతిన చేశారనే విమర్శలు ఉన్నాయి. పైపైన పనులు చేసి, చేతులు దులుపుకున్నారని కొందరు హెచ్‌డబ్ల్యూఓలు అంటున్నారు. బిల్లుల చెల్లింపులో జాప్యమెందుకో... వసతి గృహాల్లో మరమ్మతు పనులు పూర్తి చేసి రెం డు నెలలకు పైనే అయిందని ఆ శాఖ అధికారులు చెపుతున్నారు. కానీ ఇప్పటివరకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంపై అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. కాంట్రాక్టర్లకు, ఇంజనీరింగ్ అధికారులకు మధ్య కమీషన్ ఒప్పందాలు కుదరకపో వడమే కారణమనే ప్రచారం జరుగుతోంది. కాగా, రిపేర్ పనులు పూర్తయినట్లు సంబంధిత హాస్టల్ ఇన్చార్జీలు ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి. ఆయా ప్రాంతాలకు చెందిన ఏఎస్‌డబ్ల్యూవోలు పనులు తనిఖీ చేసి నిర్ధారించాలి. కానీ ఇప్పటి వరకు హెచ్‌డబ్ల్యూవోలు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వలేదని సమాచారం. ఈ వ్యవహారంపై కలెక్టర్ పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తే, వాస్తవాలు వెలుగులోకి వస్తాయని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. ధ్రువీకరణ పత్రాలు ఇవ్వలేదు మరమ్మతు పనులకు సంబంధించి ఇంజనీరింగ్ శాఖ వారికి ఇంకా ధ్రువీకరణ పత్రాలు ఇవ్వలేదు. హెచ్‌డబ్ల్యూవోల నివేదిక కూడా నాకు అందలేదు. వారి ధ్రువీకరణ ఆధారంగా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే బిల్లుల చెల్లింపునకు సిఫార్స్ చేస్తా. పనులు కూడా ఇంకా కొన్ని అసంపూర్తిగా ఉన్నట్లు తెలిసింది. దీనిపై పరిశీలన చేస్తా. – నతానియేల్, డివిజనల్ సాంఘిక సంక్షేమ అధికారి -
ప్రఖ్యాత యూనివర్సిటీలో వికృత నిబంధన!
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని ఓ ప్రఖ్యాత యూనివర్సిటీ ఓ వికృతమైన నిర్ణయాన్ని తీసుకుంది. వర్సిటీలోని అమ్మాయిల హాస్టల్లో పడకను పంచుకోవడాన్ని నిషేధించింది. మీడియా కథనాల ప్రకారం 37 ఏళ్ల చరిత్ర కలిగిన ఇంటర్నేషనల్ ఇస్లామిక్ యూనివర్సిటీ (ఐఐయూ) తాజాగా ఓ నోటిఫికేషన్ జారీచేసింది. ఏ అమ్మాయైనా తన స్నేహితులతోగానీ, అక్కాచెల్లెళ్లతోగానీ బెడ్ షేర్ చేసుకుంటే (ఒకే దుప్పటి కప్పుకొని పడుకున్నా, కూర్చున్నా) భారీగా జరిమానా తప్పదని హెచ్చరించింది. అంతేకాకుండా పడకల మధ్య సహేతుకమైన, సరైన దూరాన్ని పాటించాలని సూచనలు చేసింది. ప్రత్యేకంగా అమ్మాయిల హాస్టళ్లలోనే ఈ విధంగా నిబంధనలు అమలుచేయడంపై సోషల్ మీడియాతో తీవ్రమైన చర్చ జరుగుతోంది. అబ్బాయిల హాస్టళ్లలో పెద్దసంఖ్యలో నాన్ బోర్డర్లు మకాం వేసినా పట్టించుకోకుండా అమ్మాయిల హాస్టళ్లలోనే ఈవిధంగా ఆంక్షలు విధించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే, హాస్టళ్లలో స్థలం సమస్య ఉందని, అంతేకాకుండా అమ్మాయిల తమ వెంట బంధువులు, కుటుంబసభ్యులను ఉంచుకోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని, అందువల్లే ఈ నోటిఫికేషన్ జారీచేశామని యూనివర్సిటీ సమర్థించుకుంటోంది. -
బాలికల హాస్టళ్ల వద్ద పోకిరీలు
ఇబ్బందులు పడుతున్న విద్యార్థినులు పట్టించుకోని అధికార యంత్రాంగం కరువైన పోలీసుల పర్యవేక్షణ వరంగల్ : వరంగల్ మహానగరంలో మహిళలకు ఇబ్బందులు తీవ్రమవుతున్నాయి. పోకిరీల బెడదతో మహిళలు, ప్రధానంగా విద్యార్థినులు అష్టకష్టాలు పడుతున్నారు. మహిళా హాస్టళ్లు ఏర్పాౖటెనా ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ప్రభుత్వ వసతిగృహాల్లోని విద్యార్థినుల ఇబ్బందులైతే చెప్పుకునే స్థాయి దాటిపోయాయి. హన్మకొండలోని జులైవాడలో ఈ పోకరీల బెడద ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఈ ప్రాంతంలోని హాస్టళ్ల సముదాయంలో ఓ పాఠశాల, మూడు హాస్టళ్లు ఉన్నాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాథమిక ఆశ్రమ పాఠశాల, పోస్టు మెట్రిక్ హాస్టళ్లు రెండు, డీఏహెచ్(డిపార్ట్మెంట్ అటాచ్డ్ హాస్టల్) హాస్టళ్లు కొనసాగుతున్నాయి. ఆయా వసతి గృహాల్లో ప్రాథమిక విద్య నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివేబాలికలు, విద్యార్థినులు ఉంటున్నారు. ప్రాథమిక ఆశ్రమ పాఠశాలలో 600 మంది, వరంగల్, హన్మకొండ పరిధిలోని పోస్ట్ మెట్రిక్ విద్యార్థులు 400 మంది, ఇంటర్మీడియట్, ఏఎన్ఎం, ఇతరత్రా కోర్సులు చేస్తున్న విద్యార్థినులు 200 మందికి డీఏహెచ్లో వసతి కల్పించారు. అయితే, హాస్టళ్లలో బస చేసే వారి సంఖ్య ఎక్కువ కావడంతో పర్యవేక్షణ కొరవడిందని తెలుస్తోంది. పోలీసు శాఖ పరంగా కూడా పర్యవేక్షణ లేకపోవడంతో పలువురు పోకిరీలు అడ్డాగా మార్చుకున్నారని విద్యార్థినులు వాపోతున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు బయటి వ్యక్తులు సముదాయంలోకి వస్తుండడమే కాకుండా.. రాత్రివేళ ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు. ఇకనైనా శాఖ పరంగా పర్యవేక్షణకు రాత్రివేళ వాచ్మెన్ల సంఖ్య పెంచడంతో పాటు పోలీసులు కూడా పెట్రోలింగ్ నిర్వహిం చాలని పలువురు కోరుతున్నారు. -
వామ్మో... పోకిరీలు!
ఊరి బయట బీసీ బాలికల వసతి గహాలు చీకటిపడితే వేధిస్తున్న ఆకతాయిలు అయినా చర్యలు తీసుకోని సంబంధిత అధికారులు అనంతపురం ఎడ్యుకేషన్ : రుద్రంపేట సమీపంలోని జాతీయ రహదారి పక్కనున్న బీసీ బాలికల కళాశాలల విద్యార్థినులు పోకిరీల బెడదతో వణికిపోతున్నారు. నగర శివారు ప్రాంతం కావడం...జన సంచారం పెద్దగా లేకపోవడంతో కొందరు ఆకతాయిలు కళాశాలలకు వెళ్లే సమయంలోనూ తిరిగి వచ్చే సమయంలోనూ అమ్మాయిలను వేధింపులకు గురి చేస్తూ పైశాచికానందం పొందుతున్నారు. ఇక్కడ బీసీ బాలికల కళాశాల వసతి గృహాలు (అనంతపురం అర్బన్, రూరల్) రెండూ ఉన్నాయి. ఈ రెండు హాస్టళ్లలోనూ 480 మంది విద్యార్థినులు ఉన్నారు. వీరందరూ ఇంటర్ మొదలుకొని పీజీ వరకు వివిధ కోర్సులు చేస్తున్నారు. వసతి గృహంలో ఉన్నంతవరకు బాగానే ఉన్నా...కళాశాలలకు వెళ్లాలంటే ఆడపిల్లలు వణికిపోతున్నారు. మూన్నెళ్ల కిందట కొందరు విద్యార్థినులు సాయంత్రం 6.30 గంటల సమయంలో రుద్రంపేట కూడలి నుంచి వసతి గృహం వైపు నడుచుకుంటూ వెళ్తుంటే ముగ్గురు పోకిరీలు వారికి ఎదురుగా వచ్చి వేధింపులకు గురి చేశారు. ఈ ఘటనతో భయాందోళనలు చెందిన అమ్మాయిలు పరుగు పరుగున వసతిగృహానికి వెళ్లారు. అలాగే పూటుగా తాగిన ఇద్దరు యువకులు ఒంటరిగా హాస్టల్‌కు వెళ్తున్న ఓ విద్యార్థినిని కామెంట్ చేసి వెకిలి చేష్టలకు పూనుకున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆ అమ్మాయి బయటకు చెప్పుకోలేక తీవ్ర మానసిక వేదనకు గురైంది. ఇలాంటి ఘటనలూ నిత్యకృత్యమయ్యాయని విద్యార్థినులు వాపోతున్నారు. చీకటిపడితే చాలు తాగుబోతుల హల్చల్ విద్యార్థులు చదువుతున్న కొన్ని కళాశాలల సాయంత్రం వరకు ఉంటున్నాయి. దీంతో విద్యార్థినులంతా కిలోమీటర్ల దూరంలోని కళాశాల నుంచి నడుచుకుంటూ వచ్చేందుకు చాలా సమయం పడుతోంది. ఇక్కడికి వచ్చే సమయానికి చీకటి పడుతుండడంతో పోకిరీల బెడదతో వారంతా భయం భయంగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది . దీంతో ప్రధాన రహదారి మీదుగా కాకుండా చిన్నచిన్న సందుల్లో హాస్టల్‌కు చేరుకుంటున్నామని కొందరు విద్యార్థినులు వాపోయారు. సాయంత్రం వేళ చీకటిపడితే చాలు తాగుబోతులు వసతి గృహం సమీపంలో హల్చల్ చేస్తుండడంతో అమ్మాయిలు దినదిన గండంగా కాలం గడుపుతున్నారు. రక్షణ కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యం పోకిరీలు, ఆకతాయిల వేధింపుల విషయం గురించి విద్యార్థినులు బీసీ సంక్షేమశాఖ అధికారుల దృష్టికి పలు సందర్భాల్లో తీసుకెళ్లారు. చివరకు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. వారు పెద్దగా పట్టించుకోకపోవడం అమ్మాయిలకు శాపంగా మారింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సెక్యూరిటీని నియమించి రక్షణ కల్పించాలని అమ్మాయిలు కోరుతున్నారు. ఈ వసతి గృహాలకు బీసీ సంక్షేమశాఖ డీడీ కార్యాలయం, నాల్గో పట్టణ పోలీస్ స్టేషన్ కూత వేటు దూరంలో ఉన్నా పోకిరీలు బరి తెగిస్తుండడం గమనార్హం. పోలీసుల దృష్టికి తీసుకెళ్లాం కొందరు తాగుబోతులు, ఆకతాయిలు అమ్మాయిలను వేధిస్తున్న మాట వాస్తవమే. సాయంత్రం పూట ఈ సమస్యగా అధికంగా ఉంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాం. సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేశాం. పోలీసుల నిఘా మరింత పెంచేలా అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – పద్మ, హెచ్‌డబ్ల్యూఓ -
ఔట్ సోర్సింగ్ కు బాలికల హాస్టళ్లు
నిర్వహణలో స్థానికులకే ప్రాధాన్యం, రూ. 10 వేల వేతనం భద్రత సమస్యలపై దృష్టి పెట్టని సర్కారు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్ల ఆవరణలో 102 బాలికల హాస్టళ్లను త్వరలో ప్రారంభించబోతున్న ప్రభుత్వం.. వాటి నిర్వహణ బాధ్యతలను ఔట్సోర్సింగ్ సిబ్బందికి అప్పగించేందుకు కసరత్తు చేస్తోంది. రూ. 5 వేలు గౌరవ వేతనం ఇస్తూ హాస్టళ్ల నిర్వహణ బాధ్యతలను ఆయా పాఠశాలల్లోని సీనియర్ మహిళా టీచర్‌కే అప్పగించాలని మొదట్లో భావించింది. టీచర్ తన కుటుంబాన్ని వది లేసి బాలికలతోపాటు హాస్టల్లో ఉండాలన్న నిబంధన నేపథ్యంలో ఎవరూ ముందుకు రాలేదు. ఔట్‌సోర్సింగ్‌పై ఒక్కో మహిళకు రూ. 10 వేల చొప్పున వేతనమిచ్చే ఏర్పాట్లు చేస్తోంది. డిగ్రీతోపాటు డీఎడ్ లేదా బీఎడ్ చేసి ఉన్నవారికే బాధ్యతలను అప్పగించేలా నిబంధనలను రూపొందిస్తోంది. 25 ఏళ్ల పైబడిన మహిళలకు కేర్ టేకర్ పేరుతో ఈ బాధ్యతలు అప్పగించాలని, స్థానిక మండలానికి చెందినవారికే ప్రాధాన్యం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. స్కూల్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ కమిటీ (ఎస్ఎండీసీ) ఆధ్వర్యంలో వారిని నియమిం చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఒక్కో హాస్టల్లో 9 నుంచి 12వ తరగతి వరకు చదివే 100 మంది బాలికలకు ప్రవేశాలు కల్పిస్తారు. ఈ హాస్టళ్లు ఉన్న ప్రాంతాలన్నీ శివారు ప్రాం తాలే. బాలికల భద్రత ఎలా అన్న అంశం ప్రధానసమస్యగా మారింది. జనావాసాలకు దూరంగా ఉన్నందునా రాత్రివేళల్లో మహిళా కేర్‌టేకర్‌కు మొత్తం బాధ్యతను అప్పగించడం వల్ల ఏమైనా సమస్యలు వస్తే ఏం చేయాలన్న దానిపై సర్కారు దృష్టి పెట్టలేదు. అనుకోని సంఘటనలు జరిగినపుడు కేర్ టేకర్‌పై ఎలాంటి చర్యలు చేపట్టవచ్చన్న దానిపైనా స్పష్టత లేదు. బాలికల హాస్టళ్లకు రాత్రివేళల్లో కచ్చితంగా మహిళా కానిస్టేబుళ్ల భద్రత అవసరమని అధికారులు పేర్కొంటున్నారు. -
రైతుకు హెలెన్ తుపాను మిగిల్చిన వేదన
=వేసిన కూరతో సరిపెట్టుకోవాల్సిందే =ప్రభుత్వ వసతిగృహాల్లో సక్రమంగా అమలుకాని మెనూ =పట్టించుకోని వార్డెన్లు..అలమటిస్తున్న విద్యార్థులు మచిలీపట్నం, న్యూస్‌లైన్ : మెనూ ప్రకారం ఆహార పదార్థాలు వండించాల్సిన వార్డెన్లు ఆ విషయాన్నే మరిచిపోయారు. కుక్ల ఇష్టారాజ్యానికి వదిలేసి తమ సొంత పనుల్లో బిజీగా గడుపుతున్నారు. పిల్లలకు ఏం వడ్డిస్తున్నారో.. ఏం తింటున్నారో పట్టించుకునే తీరిక వార్డెన్లకు లేకుండాపోయింది. దీంతో వసతిగృహాల్లో ఉండే విద్యార్థులు పెట్టింది తిని కిమ్మనకుండా ఉండిపోతున్నారు. జిల్లాలో సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 151 వసతిగృహాలున్నాయి. వీటిలో 84 బాలురు, 67 బాలికల హాస్టళ్లు ఉన్నాయి. 15,100 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలుర వసతి గృహాలు 45, బాలికల వసతి గృహాలు 17 ఉన్నాయి. వీటిలో 4,797 మంది చదువుకుంటున్నారు. ఇవి కాకుండా కళాశాల విద్యార్థుల కోసం ప్రత్యేక హాస్టళ్లు నడుపుతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌చార్జీలు పెంచకపోవడంతో ఉన్న నగదుతోనే విద్యార్థులకు భోజనం వండిపెడుతున్నామని వార్డెన్లు చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే నగదుకు, పెరిగిన ధరలకు పొంతనే లేదని.. మెనూ ప్రకారం భోజనం పెట్టాలంటే సాధ్యమయ్యే పనికాదని చేతులెత్తేస్తున్నారు. సాధారణ ప్రభుత్వ వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు ఒక్కొక్కరికి నెలకు రూ. 750, ప్రత్యేక వసతి గృహాల్లో రూ. 850 లను మెస్చార్జీలుగా ప్రభుత్వం చెల్లిస్తోంది. మచిలీపట్నం మండలం రుద్రవరం గురుకుల జూనియర్ కళాశాలలో 470 మంది విద్యార్థులు ఉన్నారు. సోమవారం మెనూ ప్రకారం 200 గ్రాముల అన్నం, 100 గ్రాముల క్యాబేజీ, టమోట కలిపి కూర వండాలి. అయితే గోరుచిక్కుడుకాయలతో కూర వండారు. క్యారెట్, ములక్కాడలు, దోసకాయలతో తయారుచేశామని చెప్పిన సాంబారులో ఏ ముక్కలూ లేవు. పెరుగు వేయాల్సి ఉండగా పల్చటి మజ్జిగ పోస్తున్నారు. ఒక్కొక్క విద్యార్థికి 25 గ్రాములకు మించి కూరవేయడం లేదు. అన్నం పలుకుగా ఉంది. సాయంత్రం సమయంలో అరటిపండు ఇవ్వాల్సి ఉండగా ఉదయమే ఇచ్చేశామని అక్కడి వార్డెన్ చెప్పారు. గుడివాడలోని ఎన్టీఆర్ కాలనీలోని బీసీ బాలికల వసతి గృహంలో అన్నం చిమిడిపోయింది. నాగవరప్పాడులోని 1, 11 వసతి గృహాల్లో మెనూ చార్టు పెట్టలేదు. ఈ వసతి గృహాల్లో విద్యార్థులకు పండ్లు ఇవ్వాల్సి ఉండగా ‘న్యూస్‌లైన్’ వెళ్లడంతో హడావుడిగా తెచ్చి పంపిణీ చేశారు. నందివాడ ఎస్టీ బాలికల వసతి గృహంలో అన్నం జావకారిపోయింది. బీసీ బాలుర వసతి గృహంలో సాంబారు నీళ్లను తలపిస్తోంది. ఉడికీ ఉడకని బంగాళదుంప కూరను విద్యార్థులకు వడ్డించారు. నూజివీడులోని సమీకృత హాస్టల్లో 252 మందికిగాను 180 మంది విద్యార్థులే ఉన్నారు. సాంబారు నీళ్లలా తయారు చేశారు. నూజివీడు బాలికల వసతి గృహంలో గుడ్డు వడ్డించలేదు. మైలవరం ఎస్సీ బాలుర వసతి గృహంలో వంకాయ, టమోట, కోడిగుడ్డు వండారు. అయితే ఈ కూరలు అంతగా బాగోలేదు. అన్నం సుద్దగా మారింది. జి.కొండూరు బీసీ బాలుర వసతి గృహంలో మెనూ సక్రమంగా అమలు చేయటం లేదు. ఎస్సీ బాలుర వసతి గృహంలో పాఠశాలలు ప్రారంభించిన నాటి నుంచి కాస్మోటిక్ చార్జీలు ఇవ్వలేదు. ఉదయం పూట విద్యార్థులకు ఆరు ఇడ్లీలు చట్నీతో వడ్డించాల్సిఉండగా నాలుగు ఇడ్లీలు పంచదారతోనే సరిపెడుతున్నారు. కలిదిండి మండలం కోరుకొల్లు ఎస్సీ బాలికల వసతి గృహంలో భోజనం చిమిడిపోయింది. దీంతో విద్యార్థులు ఈ భోజనాన్ని తినకుండా బయటపడేశారు. ఇంతా జరుగుతున్నా వార్డెన్ పట్టించుకోనేలేదు. బాలికలు అర్ధాకలితోనే ఉండిపోవాల్సి వచ్చింది. కైకలూరు, మండవల్లి బీసీ బాలుర వసతి గృహాల్లో సాంబారు నీళ్లను తలపించింది. మెనూ ఎక్కడా అమలు కావడం లేదు. పామర్రు ఎస్సీ బాలుర వసతి గృహంలో 46 మంది విద్యార్థులు ఉండాల్సి ఉండగా కేవలం తొమ్మిది మందే ఉన్నారు. వీరికి కూడా కూర వండకుండా సాంబారు, గుడ్డుతో సరిపెట్టారు. కూచిపూడి బీసీ బాలుర వసతి గృహంలో భోజనం అంతగా బాగోలేదు. సాంబారు పలచగా వండారు. ఘంటసాల మండలం శ్రీకాకుళం ఎస్సీ బాలికల వసతి గృహంలో గుడ్డు వడ్డించలేదు. నాగాయలంకలోని ఎస్సీ బాలికల వసతి గృహం అద్దె భవనంలో కొనసాగుతోంది. గదులు చిన్నవిగా ఉండటంతో విద్యార్థినులు ఇక్కట్లపాలవుతున్నారు. గ్యాస్ లేకపోవటంతో కట్టెల పొయ్యిపైనే వంట చేస్తున్నారు. గన్నవరం బీసీ బాలుర వసతి గృహంలో మంగళవారం అమలుచేయాల్సిన మెనూను సోమవారం అమలు చేశారు. ఎస్సీ బాలుర ప్రత్యేక వసతి గృహంలో భోజనశాల ఉన్నా ఆరుబయటే భోజనం వడ్డిస్తున్నారు. ‘సాక్షి’ కథనాలపై కలెక్టర్ ఆరా జిల్లా వ్యాప్తంగా ‘సాక్షి’ విలేకరుల బృందం ప్రభుత్వ వసతి గృహాలను సందర్శించి అక్కడ విద్యార్థులు పడుతున్న అగచాట్లపై సోమవారం దినపత్రికలో ‘గాలిలో సంక్షేమం-చలితో సహవాసం’ శీర్షికతో ప్రచురించిన కథనానికి కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు స్పందించారు. హాస్టళ్లను ఏఎస్‌డబ్ల్యూవోలు ఎన్ని రోజులకొకసారి సందర్శిస్తున్నారు.. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు.. తదితర అంశాలపై తనకు నివేదిక ఇవ్వాలని ఏజేసీ బి.ఎల్.చెన్నకేశవరావును ఆదేశించారు. దీనిపై నివేదికలు త్వరగా తయారుచేసి ఇవ్వాలని ఆయన జిల్లా సాంఘిక సంక్షేమశాఖ జేడీ మధుసూదనరావుకు సూచించారు.