
ఓఎస్‌డీ ధర్మాకు వినతిపత్రం ఇస్తున్న విద్యార్థినులు
కేపీహెచ్‌బీకాలనీ: జేఎన్‌టీయూహెచ్‌లో విద్యార్థినుల కోసం కొత్త వసతి గృహాన్ని నిర్మించాలని ఓఎస్‌డీ స్కూడెంట్స్ అఫైర్ బానోతు ధర్మాను కోరారు. ఈ మేరకు బుధవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా విద్యార్ఠి నాయకురాలు శేషుశ్రీ పంచాల మాట్లాడుతూ... ఇటీవల వసతి గృహాల్లోనే లైబ్రరీ సదుపాయం కల్పించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గతంతో పోలిస్తే ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో చదివే విద్యార్థినుల సంఖ్య పెరిగిందన్నారు.
విద్యార్థినుల సంఖ్యకు అందుకనుగుణంగా మరో వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని కోరాన్నారు. మెస్ బిల్లులు సైతం ఎక్కువగా వస్తున్నాయని, మెస్ బిల్లులను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. కార్యక్రమంలో హాస్టల్ కో ఆర్డినేటర్ పవిత్ర, కీర్తన, శ్రీజ, జ్ఞాన ప్రసీద, శ్రేయ, సుప్రియ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment