chintalpudi
-
ఎమ్మెల్యేలు ఎలీజా, గణేష్‌లకు సీఎం పరామర్శ
చింతలపూడి/నర్సీపట్నం: ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా ఇటీవల అస్వస్థతకు గురవ్వడంతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో శనివారం శస్త్రచికిత్స చేశారు. ఆయనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఫోన్లో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి వైద్యులను కోరారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే సతీమణి ఝాన్సీరాణితో కూడా ఫోన్లో మాట్లాడిన సీఎం ఆమెకు ధైర్యం చెప్పారు. అలాగే మూడు రాజధానులకు మద్దతుగా నిర్వహించిన బైక్ ర్యాలీలో గాయపడి విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్‌ను ఆదివారం ఫోన్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇదీ చదవండి: ఆర్టీసీ బస్సులో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల ఓవరాక్షన్.. కౌంటర్ ఇచ్చిన మహిళలు! -
తప్పిపోయిన బాలికలను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
సాక్షి, పశ్చిమ గోదావరి : పాఠశాల నుండి అదృశ్యమైన మైనర్ బాలికలను పోలీసులు పట్టుకొచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాలు.. చింతలపూడి మండలంలోని రాఘవపురం గ్రామానికి చెందిన ముగ్గురు మైనర్ బాలికలు బుధవారం అదృశ్యమయ్యారు. ఆందోళన చెందిన బాలికల తల్లిదండ్రులు చింతలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పిల్లల ఆచూకీ కోసం పోలీసులు వారి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, హైదరాబాద్‌లోని ఆటో డ్రైవర్లు వారిని గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. దీంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు, పిల్లలను తీసుకొచ్చి జంగారెడ్డి గూడెం డీఎస్పీ స్నేహిత సమక్షంలో వారి తల్లిదండ్రులకు అప్పగించారు. -
పగలే వెన్నెల
పగలే వెన్నెల చల్లచింతలపూడి(దెందులూరు), : సరిపడా విద్యుత్ సరఫరా లేదంటున్న ప్రభుత్వం గ్రామ పంచాయతీలలో దుబారాగా విద్యుత్‌ను ఉపయోగిస్తున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దెందులూరు, చల్లచింతలపూడి, రామారావుగూడెం, గాలాయగూడెం, శ్రీరామవరం గ్రామాల్లో తరచుగా వీధి లైట్లు పట్ట పగలు వెలుగుతున్నారుు. అన్ని గ్రామాలకు గ్రామ కార్యదర్శులు, సర్పంచ్‌లు ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నారుు. విద్యుత్ దుబారా అవటంతో పాటు పంచాయతీకి ఆర్థిక భారం తప్పడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి విద్యుత్ దుబారాను నివారించాలని పలువురు కోరుతున్నారు. -
కావూరిపై కోడిగుడ్లు
చింతలపూడి, న్యూస్‌లైన్ : కేంద్ర జౌళిశాఖ మంత్రి కావూరి సాంబశివరావుకు మంగళవారం సమైక్య సెగ తగిలింది. కేంద్ర మంత్రి పదవి పొందిన అనంతరం తొలిసారి చింతలపూడి అసెంబ్లీ సెగ్మెంట్లో పర్యటించేందుకు వచ్చిన కావూరిని నియోజకవర్గ వైసీపీ నమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ నాయకత్వంలో పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు అడుగడుగునా అడ్డుకున్నారు. ‘సీమాంధ్ర ద్రోహి.. కావూరి గో బ్యాక్’ అని రాసిన ఫ్లెక్సీలను చేతబూని పాత బస్టాండ్ సెంటర్ వద్ద మంత్రి కాన్వాయ్‌ని అడ్డుతగిలారు. ఈ దశలో వైసీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తలు కావూరి కాన్వాయ్‌పై కోడిగుడ్లు విసిరారు. మంత్రి కారును ముందుకు కదలనివ్వకుండా అడ్డుపడటంతో మద్దాల రాజేష్ సహా పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కాన్వాయ్ బోసుబొమ్మ సెంటరుకు చేరుకోగా, పోలీసు వ్యాన్‌లోంచి దూకి వచ్చిన రాజేష్ కేంద్ర మంత్రిని మరోసారి అడ్డుకున్నారు. దీంతో రాజేష్‌ను పోలీస్ జీపులో స్టేషన్‌కు తరలించారు. సమైక్యవాదులపై పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. ప్రగడవరం ఉప సర్పంచ్ శీలపురెడ్డి రమేష్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ బొడ్డు వెంకటేశ్వరరావు, గంధం చంటి తదితరులను లాక్కెళ్లి వ్యాన్ ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించగా, స్టేషన్ ఎదుట తెలంగాణ బిల్లు ముసారుుదా ప్రతులను మద్దాల రాజేష్, కార్యకర్తలు తగులబెట్టారు. సీమాంధ్రను కేంద్రానికి తాకట్టు పెట్టిన కావూరి వెంటనే పదవికి రాజీ నామా చేయాలని డిమాండ్ చేశారు. అడుగడుగునా సమైక్యవాదుల నిరసనల మధ్య పోలీ సుల సాయంతో కావూరి ముందుకు సాగారు. సమైక్యవాదులపై నోరుపారేసుకున్న కేంద్రమంత్రి ‘మీరంతా చేతకాని వెధవలు, సన్నాసి వెధవలు, ఎవడో డబ్బులిస్తే వచ్చి సమైక్య నినాదాలు చేస్తున్నారు’ అంటూ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు వైఎస్సార్ సీపీ శ్రేణులు, సమైక్యవాదులపై నోరుపారేసుకున్నారు. పాత బస్టాండ్ సెంటర్లో వైసీపీ శ్రేణు లు, సమైక్యవాదులు విసిరిన కోడిగుడ్లు ఆయనపై పడకుండా పోలీసులు వలయంలా నిలబడ్డారు. ఈ సందర్భంలో కావూరి తాను ప్రయూణిస్తున్న వాహనం డోరు వెనుక నిలబడి కోడిగుడ్ల దాడినుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయినా ఆందోళనకారులు విసిరిన కోడిగుడ్లు పోలీసులతోపాటు, కేంద్ర మంత్రికి తగిలారుు. ఈ సందర్భంలో కావూరి ఆగ్రహంతో ఊగిపోయూరు. వెంటనే మైక్ తీసుకుని తిట్ల దండకం అందుకున్నారు. ‘ఎవడు డబ్బులిస్తే వచ్చార్రా సన్నాసుల్లారా, వెధవల్లారా’ అంటూ నోటికొచ్చినట్లు తిట్టారు. ‘మీరుమాత్రమే సమైక్యవాదులా, మీరే హీరోలా’ అంటూ తిట్టిపోశారు. దీంతో రెచ్చిపోయిన సమైక్యవాదులు కావూరి గోబ్యాక్ అంటూ ముందుకు దూసుకురావడంతో పోలీసులు మద్దాల రాజేష్ సహా 22 మందిని అరెస్ట్‌చేసి స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ అనంతరం మద్దాల రాజేష్ పోలీస్ స్టేషన్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ మంత్రి పదవి కోసం సమైక్యవాదిలా ఫోజులు కొట్టిన కావూరి ఎంపీ పదవికి రాజీనామా చేశారని, పదవి రాగానే కోట్లాది రూపాయల ప్యాకేజీకి అమ్ముడుపోయూరని విమర్శించారు. సమైక్య ముసుగును తొలగించుకుని సీమాంధ్ర ప్రజల ఆశలను వమ్ము చేశారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన సమైక్యవాదులను ‘వెధవలు, సన్నాసులు’ అని తిట్టడమేకాకుండా పోలీసులతో దాడులు చేయించారన్నారు. జరిగిన ఘటనకు కావూరి క్షమాపణ చెప్పాలని కోరారు. వెంటనే పదవులకు రాజీనామా చేసి సీమాంధ్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా పోరాటం సాగించాలని డిమాండ్ చేశారు. -
రాష్ట్ర విభజన జరిగే పనికాదు
చింతలపూడి, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన జరిగే పని కాదని కేంద్ర జౌళి శాఖామాత్యులు కావూరి సాంబశివరావు అన్నారు. చింతలపూడి మార్కెట్ కమిటీలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని తాను నమ్ముతున్నట్టు చెప్పారు. 371 డీ కి రాజ్యాంగ సవరణ చేయకుండా విభజన సాధ్యం కాదని స్పష్టం చేశారు. పార్లమెంట్లో అందుకు అంత సమయం లేదన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదని, ఇప్పటికైనా యూపీఏ ప్రభుత్వం పునరాలోచించాలని అన్నారు. బీజేపీతో సహా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు విభజనకు మద్దతు తెలపడం వల్లనే కేంద్రం తొందరపడి నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఒక్క ప్రాంతానికి కాక రెండు ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటే బాగుండేదన్నారు. 1959 వరకు భద్రాచలం డివిజన్ సీమాంధ్రలో కలిసే ఉండేదన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఖమ్మంలో భద్రాచలం డివిజన్‌ను కలిపారన్నారు. భద్రాచలం ఎప్పటికీ సీమాంధ్రదే నన్నారు. తమిళనాడుకు చెన్నై రాజధానిగా ఉన్నా అనేక ప్రాంతాలు అభివృద్ధి చెందాయన్నారు. రాష్ట్రంలో మాత్రం అన్నిరకాలుగా హైదరాబాద్‌లో ఎక్కువ అభివృద్ధి జరిగిందని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, ఒక వేళ విభజన తప్పని సరి అయితే హెచ్ఎండీఏ పరిధిని పదేళ్లపాటు కేంద్రపాలిత ప్రాంతం చేయాలని, లేదా ఢిల్లీ తరహా రాష్ట్రంగా చేయాలని అభిప్రాయపడ్డారు. సీమాంధ్రకు 20 ఏళ్లపాటు పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర విభజన సరైన చర్య కాదని ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా అధిష్టానం తమ మాటను వినలేదని చెప్పారు. అంతకు ముందు చింతలపూడిలో 100 పడకల ఆసుపత్రి, సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, యర్రగుంటపల్లిలో పీహెచ్‌సీలకు కావూరి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు, రక్షిత మంచినీటి పథకాలను ప్రారంభించారు. ఆయన వెంట ఏపీఐడీసీ చైర్మన్ ఘంటా మురళీరామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ తూత లక్ష్మణరావు, కేంద్ర ఉన్ని ఉత్పత్తుల బోర్డు డెరైక్టర్ ఎం.ధామస్, అధికారులు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు త్సల్లాబత్తుల శ్రీనివాసరావు, బోదల రమేష్ ఉన్నారు.