సత్యసాయి 88వ జయంతిని శనివారం పుట్టపర్తిలో ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో వేడుకలు ప్రారంభమవుతాయి.
పుట్టపర్తి టౌన్, న్యూస్‌లైన్ : సత్యసాయి 88వ జయంతిని శనివారం పుట్టపర్తిలో ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో వేడుకలు ప్రారంభమవుతాయి. ఇందుకోసం ప్రశాంతి నిలయాన్ని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రత్యేకంగా ముస్తాబు చేసింది. దేశ విదేశాలకు చెందిన సత్యసాయి భక్తులు ఇప్పటికే పుట్టపర్తికి చేరుకున్నారు.
జయంతి వేడుకలలో కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్‌ల శాఖ మంత్రి కిల్లి కృపారాణి ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. ఆమె ఇప్పటికే పుట్టపర్తికి చేరుకున్నారు. సత్యసాయి మానవాళికి అందించిన సేవలకు గుర్తింపుగా సత్యసాయి స్మారక స్టాంపును విడుదల చేయనున్నారు. వేడుకలలో భాగంగా సత్యసాయి విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు. వేడుకలకు తరలివచ్చే భక్తులందరికీ అన్నప్రసాదం పంపిణీకి ట్రస్ట్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.