గణేష్‌ మండపం వద్ద డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిన యువకుడు | Young Man Collapsed While Dancing On Ganesh Mandapam At Dharmavaram; Watch Video - Sakshi
Sakshi News home page

గణేష్‌ మండపం వద్ద డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిన యువకుడు

Published Thu, Sep 21 2023 7:15 PM | Last Updated on Thu, Sep 21 2023 7:47 PM

Young Man Collapsed While dancing On Ganesh Mandapam At Dharmavaram - Sakshi

గుండెపోటు.. ఈ మాట వింటేనే గుండె ఆగినంత పని అవుతుంది. అంతకంతకు పెరిగిపోతున్న గుండెపోటు మరణాలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి.  ఎవరి ప్రాణాలు ఎప్పుడు ఎలా పోతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. వయసుతో సంబంధం లేకుండా ఎంతో ఆరోగ్యంగా ఉండే యువకులు సైతం సడెన్‌ హార్ట్‌ఎటాక్‌తో కుప్పకూలి ప్రాణాలు విడుస్తున్నారు. రదాగా ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా గడిపిన వారు అప్పటికప్పుడే ప్రాణాలు విడిచిన ఘటనలు ఎన్నో ఉన్నాయి..

తాజాగా అనంతపురం జిల్లా ధర్మవరంలో విషాదం చోటుచేసుకుంది.. పట్టణంలోని మారుతి నగర్‌లో వినాయక చవితి సందర్భంగా గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. నవరాత్రుల్లో భాగంగా బుధవారం రాత్రి వినాయకుని మండపం ముందు డాన్స్ చేస్తూ  ప్రసాద్ (26) అనే యువకుడు మృతి చెందాడు. అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన ప్రసాద్ ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. వెంటనే స్నేహితులు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement