ganesh mantapam
-
గణేష్ మండపంలో దొంగ
-
చంద్రయాన్-3 థీమ్‌తో గణేష్ మండపం.. వైరలవుతోన్న వీడియోలు
నాయకచవితి వచ్చిందంటే ఆ సందడే వేరు. వాడవాడలా బొజ్జగణపయ్యను మండపాల్లో కొలువుదీర్చి వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి ఏడాదిలాగే వివిధ రూపాల్లో మండపాల్లో గణేశుడి ప్రతిమలు కొలువుతీరాయి. పోలీసు, జవానుగా, కర్షకుడిగా, వైద్యుడు, సినిమా హీరో.. ఇలా విభిన్న రూపాల్లో గణేశుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. Lift-off to rover roll-out, this Ganesh Pandal on #Chandrayaan3 is absolutely mind-blowing! #Virlavideo #India pic.twitter.com/Lvo7Mp98pN — Yauvani (@yauvani_1) September 22, 2023 ఈ క్రమంలో ఇటీవల ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుడిపై ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. ఈ స్ఫూర్తితో ఈ ఏడాది తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లో పలు గణేష్ మండపాలను చంద్రయాన్-3 థీమ్‌తో రూపొందించారు. ఇలాంటి ఒక గణేష్ మండపం నెట్టింట్లో వైరల్‌గా మారింది. చంద్రయాన్-3 నమూనాతో రూపొందించిన ఈ గణేషుడి వెనుక ఒక వైపు చంద్రయాన్-3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్తుంది. #Chandrayaan3 Ganesh In Achampet Nagar Kurnool#ISRO pic.twitter.com/gHK6WyfxOQ — COC (@Controversyy3) September 21, 2023 మరోవైపు ఈ మిషన్ చంద్రుడి చుట్టూ పలుమార్లు తిరిగి.. అనంతరం విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండ్ అవుతుంది. దాని నుంచి ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపైకి దిగుతుంది. విభిన్నంగా ఉన్న చంద్రయాన్-3 గణేష్ మండపానికి సంబంధించిన వీడియో క్లిప్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. Ganesh Pandal representing #Chandrayaan3 😍👌🏼creativity.#GaneshChaturthi2023 pic.twitter.com/RDLznl9jLp — Tathvam-asi (@ssaratht) September 20, 2023 A heartfelt tribute to the brilliant ISRO scientists who make dreams of Chandrayaan 3 come true while adding a festive touch with Ganesh Chaturthi decorations. Your dedication inspires us all! #Chandrayaan3 #ISRO #GaneshChaturthi #Tribute #ScienceAndFestivity #FestiveEngineers pic.twitter.com/687JZweXsZ — PRATIK NAIK (@Pratiknaek89) September 20, 2023 -
గణేష్ మండపం వద్ద డ్యాన్స్ చేస్తుండగా గుండెపోటు.. కుప్పకూలిన యువకుడు
-
గణేష్ మండపం వద్ద డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు
గుండెపోటు.. ఈ మాట వింటేనే గుండె ఆగినంత పని అవుతుంది. అంతకంతకు పెరిగిపోతున్న గుండెపోటు మరణాలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎవరి ప్రాణాలు ఎప్పుడు ఎలా పోతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. వయసుతో సంబంధం లేకుండా ఎంతో ఆరోగ్యంగా ఉండే యువకులు సైతం సడెన్ హార్ట్ఎటాక్తో కుప్పకూలి ప్రాణాలు విడుస్తున్నారు. రదాగా ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా గడిపిన వారు అప్పటికప్పుడే ప్రాణాలు విడిచిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.. తాజాగా అనంతపురం జిల్లా ధర్మవరంలో విషాదం చోటుచేసుకుంది.. పట్టణంలోని మారుతి నగర్లో వినాయక చవితి సందర్భంగా గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. నవరాత్రుల్లో భాగంగా బుధవారం రాత్రి వినాయకుని మండపం ముందు డాన్స్ చేస్తూ ప్రసాద్ (26) అనే యువకుడు మృతి చెందాడు. అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన ప్రసాద్ ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. వెంటనే స్నేహితులు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. -
చవితి మండపాలకు ఫీజులు వసూలు చేయట్లేదు
సాక్షి, అమరావతి: వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసుకునే గణేష్ మండపాలకు రుసుములు (ఫీజులు) వసూలు చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఇలాంటి వాటిని ప్రజలెవరూ నమ్మవద్దని దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండపాల ఏర్పాటుకు ఎటువంటి రుసుములు వసూలు చేయడం లేదని స్పష్టం చేశారు. భద్రతా కారణాల నేపథ్యంలో మండపాల ఏర్పాటుకు స్థానిక పోలీసు.. రెవెన్యూ అధికారులను సంప్రదించాలన్నారు. చట్టపరంగా తీసుకోవాల్సిన అనుమతులు ఏవైనా ఉంటే రెవెన్యూ, పోలీస్ శాఖను సంప్రదించి తీసుకోవాలని కోరారు. అలాంటివి మినహాయించి ఏ రకమైన రుసుములు గానీ, చందాలు గానీ తీసుకున్నా లేక ప్రేరేపించబడినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫీజులు వసూలు చేస్తున్నారని తప్పుగా ప్రచారం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటువంటి అబద్ధపు నిరాధార ప్రచారాన్ని ప్రజలు, భక్తులు నమ్మవద్దని కోరారు. ఎక్కడైనా మండపాలకు ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
గణేష్ మండపాల ఏర్పాటులో ఈ జాగ్రత్తలు పాటించండి
సాక్షి, పహాడీషరీఫ్: వినాయక చవితి ఉత్సవాలు అనగానే పక్షం రోజుల ముందు నుంచే పండుగ వాతావరణం నెలకొంటుంది. చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా అంతా కలసికట్టుగా జరుపుకునే ఈ పండుగ అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ముఖ్యంగా చిన్నారులలో వినాయక చవితి వేడుకలు పట్టలేనంతా ఉత్తేజాన్ని నింపుతాయి. ఇటు మండప నిర్వాహకులు.. అటు పోలీసు, మున్సిపాలిటీ, జలమండలి, విద్యుత్ విభాగాల అధికారులంతా చవితికి పక్షం రోజుల ముందు నుంచే నిమజ్జనం వరకు ఏర్పాట్లలో తలమునకలు కావాల్సి వస్తుంది. ఉత్సవాలను పురస్కరించుకొని రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్, పహాడీషరీఫ్ పోలీసులు మండప నిర్వాహకులతో శాంతి సమావేశాలు నిర్వహిస్తున్నారు. చిన్నచిన్న జాగ్రత్తలను పాటించని కారణంగా ప్రతి ఏటా ఎక్కడో ఒక చోట ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. అప్రమత్తంగా ఉండటమే శ్రీరామ రక్ష అని పోలీసులు పలు సూచలను చేస్తున్నారు. చదవండి: మహాగణపతి సిద్ధం.. ఖైరతాబాద్ చరిత్రలోనే తొలిసారి పకడ్బందీగా మండపాల ఏర్పాటు.. మండపాలకు కర్రలు, ఇనుప పైప్‌లు, రేకులను నాణ్యమైన వాటిని వినియోగించి పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలన్న పోలీసుల సూచనలను మండప నిర్వాహకులు పాటించాలి. ఇలా చేయడం ద్వారా గాలి, దుమారం వచ్చినప్పుడు మండపానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. గణనాథుడి వద్ద దీపాలు వెలిగిస్తుండడాన్ని దృష్టిలో ఉంచుకొని దానికి దగ్గరలో అగ్నికి అంటుకునే స్వభావం కలిగిన వ్రస్తాలు, పూలదండలు, అలంకరణ సామగ్రి, పెట్రోల్, కిరోసిన్ లాంటి వాటిని ఉంచరాదు. దీంతో పాటు విద్యుత్ తీగల ముందు మండపాలను ఏర్పాటు చేయరాదు. నిమజ్జనానికి తరలించే సమయంలో గణనాథుడిని వాహనంలోకి ఎక్కేంచే క్రమంలో ప్రమాదం జరిగే అవకాశం పొంచి ఉంటుంది. అందుకే అన్ని జాగ్రత్తలు పాటించాలి. విద్యుత్ ప్రమాదాలపై ప్రధాన దృష్టి పెట్టాలి... మండపాల నిర్వాహకులు ఎక్కువ మంది అధికారికంగా విద్యుత్ కనెక్షన్లు తీసుకోకుండా స్తంభాలకు వైర్లను వేలాడదీస్తుంటారు. విద్యుత్ ప్రమాదాలు జరిగేందుకు ఇక్కడే బీజం పడుతుంది. వదులుగా ఉన్న వైర్లు గాలి, వానకు కింద పడి విద్యుత్ ప్రమాదాలు సంభవిస్తాయి. ఇలా కాకుండా అధికారిక కనెక్షన్ తీసుకోవడం ద్వారా విద్యుత్ అధికారులు అక్కడికి వచ్చి స్తంభం నుంచి కనెక్షన్‌ను ఇస్తారు. ఏదైనా విద్యుత్ సమస్య తలెత్తినా వెంటనే వారు స్పందిస్తారు. పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మంఖాల్‌లో గతంలో ముగ్గురు విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది ఈ కోవకు చెందిందే. భక్తిని మాత్రమే ప్రదర్శించాలి... వినాయక చవితి ఉత్సవాలలో నిర్వాహకులు భక్తిరసమైన పాటలను మాత్రమే పెట్టాలి. అలాకాకుండా సినిమా పాటలు పెట్టి పవిత్రతను దెబ్బతీయరాదు. దీంతో పాటు ఉత్సవాలు కొనసాగినన్నీ రోజులు నిర్వాహకులు మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండి పూజాది కార్యక్రమాలు చేయాలని భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు సూచిస్తున్నారు. -
అందరినీ ఆకర్షిస్తోన్న గణేష్ మంటపం
వనస్థలిపురం: వనస్థలిపురం రామాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన బద్రినాథ్ దేవాలయం నమూనాలోని గణేష్ మంటపం అందరినీ ఆకర్షిస్తోంది. కోల్‌కతాకు చెందిన కళాకారులు నెల రోజులపాటు శ్రమించి చార్ధాంలోని బద్రీనాథ్ దేవాలయం మాదిరిగా మంటపాన్ని తీర్చిదిద్దారని ఛత్రపతి శివాజీ క్రాంతి సంఘ్ చైర్మన్ చింతల రవికుమార్ తెలిపారు. ఈ మంటపం నిర్మాణానికి రూ.5 లక్షలు ఖర్చయినట్లు ఆయన తెలిపారు.