చంద్రయాన్‌-3 థీమ్‌తో గణేష్ మండపం.. వైరలవుతోన్న వీడియోలు | Viral: Chandrayaan 3 Take Off To Rover Landing At Ganesh Chaturthi Mandap- Sakshi
Sakshi News home page

Viral Videos: చంద్రయాన్‌-3 థీమ్‌తో గణేష్ మండపం.. టేకాఫ్‌, ల్యాండింగ్‌ అదిరిపోయింది!

Published Fri, Sep 22 2023 8:59 PM | Last Updated on Fri, Sep 22 2023 9:17 PM

Viral: Chandrayaan3 take off to rover landing At Ganesh Chaturthi mandap - Sakshi

నాయకచవితి వచ్చిందంటే ఆ సందడే వేరు. వాడవాడలా బొజ్జగణపయ్యను మండపాల్లో కొలువుదీర్చి వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్ర‌తి ఏడాదిలాగే వివిధ రూపాల్లో మండ‌పాల్లో గ‌ణేశుడి ప్ర‌తిమ‌లు కొలువుతీరాయి. పోలీసు, జ‌వానుగా, క‌ర్ష‌కుడిగా, వైద్యుడు, సినిమా హీరో.. ఇలా విభిన్న రూపాల్లో గ‌ణేశుడు భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తున్నాడు.  

ఈ క్రమంలో ఇటీవల ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-3 విజయవంతంగా చంద్రుడిపై ల్యాండ్‌ అయిన విషయం తెలిసిందే. ఈ స్ఫూర్తితో ఈ ఏడాది తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌లో పలు గణేష్‌ మండపాలను చంద్రయాన్‌-3 థీమ్‌తో రూపొందించారు. ఇలాంటి ఒక గణేష్‌ మండపం నెట్టింట్లో వైరల్‌గా మారింది. చంద్రయాన్‌-3 నమూనాతో రూపొందించిన ఈ గణేషుడి వెనుక ఒక వైపు చంద్రయాన్‌-3 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్తుంది.

మరోవైపు ఈ మిషన్‌ చంద్రుడి చుట్టూ పలుమార్లు తిరిగి.. అనంతరం విక్రమ్‌ ల్యాండర్‌ జాబిల్లిపై సాఫ్ట్‌ ల్యాండ్‌ అవుతుంది. దాని నుంచి ప్రజ్ఞాన్‌ రోవర్‌ చంద్రుడి ఉపరితలంపైకి దిగుతుంది. విభిన్నంగా ఉన్న  చంద్రయాన్‌-3 గణేష్‌ మండపానికి సంబంధించిన వీడియో క్లిప్‌ నెటిజన్లను ఆకర్షిస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement