ఏనుగు పోస్టుమార్టం రిపోర్టు: షాకింగ్‌ నిజాలు | Kerala Pregnant Elephant Post Mortem Report | Sakshi
Sakshi News home page

ఏనుగు పోస్టుమార్టం రిపోర్టు: షాకింగ్‌ నిజాలు

Published Fri, Jun 5 2020 6:33 PM | Last Updated on Fri, Jun 5 2020 6:37 PM

Kerala Pregnant Elephant Post Mortem Report - Sakshi

(ఫైల్‌ ఫోటో)

తిరువనంతపురం : పేలుడు పదార్థాలు ఉన్న పైనాపిల్‌ తినటం కారణంగా మరణించిన గర్భంతో ఉన్న ఏనుగు పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్‌ నిజాలు వెలుగు చూశాయి. ఏనుగు నోటిలో పెద్ద మొత్తంలో పేలుడు సంభవించటం కారణంగా తీవ్రమైన గాయాలయ్యాయని, వాటి కారణంగా ఇన్‌ఫెక్షన్‌ సైతం సోకినట్లు తేలింది. ఇన్‌ఫెక్షన్‌ కారణంగా విపరీతమైన నొప్పి, ఒత్తిడితో బాధపడుతూ ఏనుగు నీరు, ఆహారం తీసుకోలేకపోయిందని వెల్లడైంది. అలా దాదాపు రెండు వారాల పాటు నీరు, తిండి లేకుండా గడిపిందని తేలింది. ( ఏనుగు మృతి కేసులో తొలి అరెస్టు )

తద్వార విపరీతమైన నీరసానికి గురైన ఏనుగు నీళ్లలో మునిగిపోయిందని, ఆ తర్వాత నీటిని పెద్ద మొత్తంలో శరీరంలోకి తీసుకోవటంతో ఊపిరితిత్తులు పాడై ఆ వెంటనే అది మరణించినట్లు వెల్లడైంది. గర్భంతో ఉన్న ఏనుగు వయసు దాదాపు 15 సంవత్సరాలు ఉంటుందని, దాని శరీరంలో బుల్లెట్‌, ఇతర లోహాల అవశేషాలు కనిపించలేదని రిపోర్టు పేర్కొంది. ( ఏనుగు నోట్లో పైనాపిల్‌ బాంబ్‌)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement