
ఆహార శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి
అటవీ కృషి నిపుణులు, సిరిధాన్యాలు–కషాయాలతో షుగర్ నుంచి కేన్సర్ వరకు ఏ వ్యాధినైనా జయించవచ్చని ప్రచారోద్యమం నిర్వహిస్తున్న తెలుగు స్వతంత్ర ఆహార శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి చిత్తూరు జిల్లా మదనపల్లి రానున్నారు. మే 6న సా. 4 గంటలకు మదనపల్లిలోని బీటీ కాలేజీ ఆడిటోరియంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మే 7వ తేదీ ఉ. 11 గంటలకు మదనపల్లికి సమీపాన అంగళ్లులోని మదనపల్లి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(మిట్స్) ఆడిటోరియంలో ప్రసంగిస్తారు. సభికుల ప్రశ్నలకు జవాబులిస్తారు. ఏయే జబ్బులకు ఏయే సిరిధాన్యాలు, కషాయాలు వాడాలో చెబుతారు. అటవీ చైతన్యం ద్రావణంలో అటవీ కృషి పద్ధతిలో సిరిధాన్యాల సాగు విధానాన్ని వివరిస్తారు. వివరాలకు.. ‘మిట్స్’ కాలేజీ పీఆర్వో మారుతీప్రసాద్–90520 77747, ఎంసీవీ ప్రసాద్ (ప్రకృతివనం) –91107 63014
6న బసంపల్లిలో గోఆధారిత ప్రకృతి సేద్యంపై శిక్షణ
అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లిలోని శ్రీఅమరణరేయన స్వామి దేవస్థానం ఆవరణలో మే 6న(ప్రతి నెలా మొదటి ఆదివారం) ఉ. 9 గం. నుంచి సా. 4 గం. వరకు రైతులకు సీనియర్ రైతు నాగరాజు దేశీ గోఆధారిత ప్రకృతి సేద్యంపై శిక్షణ ఇవ్వనున్నారు. రుసుము రూ. 100. వివరాలకు. నాగరాజు– 94407 46074, పార్థసారధి– 96636 67934, లక్ష్మయ్య – 94405 66069.
జూన్ 1 నుంచి ‘చో’ సహజ సాగు పద్ధతిలో కూరగాయలు, ఔషధ మొక్కల సాగుపై ఉచిత శిక్షణ
దక్షిణ కొరియాకు చెందిన డా. చోహాన్ క్యూ సహజ సాగు, చింతల వెంకటరెడ్డి(సీవీఆర్) మట్టి ద్రావణం వాడే పద్ధతుల్లో ఆకుకూరలు, కూరగాయలతోపాటు.. కలబంద, మునగ ఆకు, మునగ కాయల సాగు, విక్రయాలపై జూన్ 1వ తేదీ నుంచి 41 రోజుల పాటు పొలాల్లో ఆచరణాత్మక ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు న్యూలైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివశంకర్ షిండే తెలిపారు. కనీసం టెన్త్ చదివి 18 ఏళ్లు నిండిన వారు మే 8వ తేదీ లోగా 70133 09949 నంబరుకు వాట్సప్/టెలిగ్రామ్ మెసేజ్ పంపాలి.
Comments
Please login to add a commentAdd a comment