సాక్షి, హైదరాబాద్: సిరిధాన్యాల ఆహారమే, ముఖ్యంగా అంబలే, మన కడుపులో వుండి అనుక్షణం నిజమైన వైద్యుడని పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ ఖాదర్ వలి అన్నారు. ఆరోగ్యంగా జీవించాలని అనుకునే ప్రతి ఒక్కరూ రోజుకు రెండు పూటలూ సిరిదాన్యాల అంబలి భోజనానికి నిమిషాలు ముందు విధిగా తాగుతూ ఆరోగ్యంగా జీవించాలని సూచించారు.
రంగారెడ్డి జిల్లా తుర్కాయంజల్ రాగన్నగూడలోని లక్ష్మీ మెగా టౌన్షిప్ లో ఆదివారం రాత్రి అనుదిన అంబలి ఉచిత పంపిణీ కేంద్రాన్ని డాక్టర్ ఖాదర్ వలీ ప్రారంభించారు. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్షులు మేరెడ్డి శ్యామ్ ప్రసాద్ రెడ్డి తన సతీమణి దివంగత జయశ్రీ జ్ఞాపకార్థం అనుదినం అంబలి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించటం అభినందనీయం అని డాక్టర్ ఖాదర్ ప్రశంసించారు.
తాను రోజూ భోజనానికి ముందు అంబలి తప్పకుండా తాగుతానని, రెండుపూటలా సిరధాన్యాలే తింటానని, 67 యేళ్లు నిండినా ఏటువంటి సమస్యలు లేవన్నారు. మన ఆహారం ప్రపంచవ్యాప్తంగా కంపెనీల పరమై పోయిందని, మనం ఆహార సార్వభౌమత్వాన్ని కోల్పోయామని అంటూ.. అనారోగ్యకరమైన ఆహారాన్ని కంపెనీలు అమ్ముతూ వుంటే ప్రజలు ఆనారోగ్యం పాలవుతూ ఔషధాలతోనే జీవనం వెళ్లదీస్తున్నామని డా. ఖాదర్ అన్నారు.
ప్రతి కిలో శరీర బరువుకు 4 గ్రాముల కన్నా ప్రోటీన్ ఎక్కువ అవసరం లేదని, ఎక్కువ ప్రోటీన్ తినది అని కంపెనీలు వ్యాపారాభివృద్ధి కోసమే ప్రచారం చేస్తున్నాయని డా. ఖాదర్ స్పష్టం చేశారు. ప్రసిద్ధ చిత్రకారులు తోట వైకుంఠం తదితరులు ఈ సమావేశం లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment