ఈ నెల 23న రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడులోని రైతు శిక్షణా కేంద్రంలో సిరిధాన్యాల సాగుపై అటవీ కృషి పితామహులు, స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి రైతులకు శిక్షణ ఇస్తారు. కొర్రలు, అరికెలు, సామలు, ఊదలు, అండుకొర్రల సాగు, అటవీ చైతన్య ద్రావణం తయారీ, మిక్సీతో సిరిధాన్యాల బియ్యం ఉత్పత్తి వంటి అంశాలపై డా. ఖాదర్ రైతు దినోత్సవం సందర్భంగా 23 (ఆదివారం) ఉ. 10 గం.ల నుంచి సా. 4 గం.ల వరకు శిక్షణ ఇవ్వనున్నారని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వెంకటేశ్వరరావు తెలిపారు. పాల్గొనదలచిన వారు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలి. వివరాలకు.. 83675 35439, 96767 97777, 0863–2286255
16న ఇంటిపంటలపై రఘోత్తమరెడ్డి శిక్షణ
గుంటూరు జిల్లా కొర్నెపాడు రైతు శిక్షణా కేంద్రంలో ఈ నెల 16(ఆదివారం)న ఇంటిపంటలపై మిద్దెతోట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి శిక్షణ ఇస్తారు. టెర్రస్ గార్డెనింగ్, బాల్కనీ గార్డెనింగ్, కిచెన్ గార్డెనింగ్‌లో సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల సాగుపై ఉ. 10 గం.ల నుంచి సా. 5 గం.ల వరకు శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 0863–2286255
22, 23 తేదీల్లో నరసాపురంలో సిరిధాన్యాలు–ప్రకృతి సేద్యంపై సదస్సులు
ఆంధ్రప్రదేశ్ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, నరసాపురం లయన్స్‌క్లబ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22, 23 తేదీల్లో ప.గో. జిల్లా నరసాపురంలోని వై.ఎన్. కాలేజీ శ్రీ అరవిందో ఆడిటోరియంలో ‘మనం ఏమి తినాలి? ఏమి తింటున్నాం? మనం ఏమి పండించాలి? ఏమి పండిస్తున్నాం’ అనే అంశంపై సదస్సులు జరగనున్నాయి. 22న ఉ. 9 గం.ల నుంచి దేశీ విత్తనాల ప్రత్యేకత– కూరగాయల సాగులో 5 లేయర్ పద్ధతిపై శివప్రసాదరాజు, ఔషధ మొక్కలపై దాట్ల సుబ్బరాజు, ప్రకృతి వ్యవసాయంలో మెలకువలపై సుబ్రహ్మణ్యంరాజు ప్రసంగిస్తారు.
మహిళలకు ‘మిల్లెట్స్ రాంబాబు’ చిరుధాన్యాలతో వంటలు నేర్పిస్తారు. 23న ఉ. 9 గం.లకు డా. ఖాదర్ వలి చూపిన బాటలో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం పొందే పద్ధతులు – సిరిధాన్యాల సాగుపై ప్రముఖ ప్రకృతి వ్యవసాయదారుడు ఎం.సి.వి. ప్రసాద్ (ప్రకృతివనం), లయన్స్‌క్లబ్ సేంద్రియ వ్యవసాయ విభాగం అధ్యక్షులు డాక్టర్ పి.బి. ప్రతాప్‌కుమార్ (94401 24253) ప్రసంగిస్తారు. ప్రవేశం ఉచితం. అందరూ ఆహ్వానితులే.
ఈజిప్టులో తాటి/ఈత ఉత్పత్తులపై అంతర్జాతీయ సదస్సు
ఆరోగ్యదాయకమైన తాటి/ఈత బెల్లం, తదితర ఉప ఉత్పత్తులపై అంతర్జాతీయంగా ఆసక్తి పెరుగుతోంది. ఈజిప్టులోని ఆశ్వన్ నగరంలో ఈ నెల 15–17 తేదీల్లో తాటి/ఈత ఉప ఉత్పత్తులపై తొలి అంతర్జాతీయ సదస్సు(బై–పాల్మ) జరగను ంది. తూ.గో. జిల్లా పందిరిమామిడిలోని తాటి పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పీసీ వెంగయ్య ఈ సదస్సుకు హాజరుకానున్నారు.
23న సిరిధాన్యాల సాగుపై కొర్నెపాడులో డా. ఖాదర్ శిక్షణ
Published Tue, Dec 11 2018 6:27 AM | Last Updated on Tue, Dec 11 2018 6:27 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment