
ప్రేమజంట ఆత్మహత్య
ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం సీకలబల్లి గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది.
మదనపల్లి(చిత్తూరు): ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం సీకలబల్లి గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. మండలంలోని ఉగ్రారపుపల్లి గ్రామానికి చెందిన జీ. సురేంద్ర(22) యమున(22) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో శనివారం ఇంట్లో నుంచి వెళ్లిన ఇద్దరు బార్లపల్లి సమీపంలోని గుట్టపై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
కాగా.. యమునకు గతంలో సురేష్ అనే వ్యక్తితో వివామమైంది. వీరికి బాలాజీ(6) అనే కొడుకు ఉన్నాడు. కొన్ని రోజుల క్రితం సురేష్ మృతిచెందాడు. అప్పటి నుంచి యమున సురేంద్రతొ సన్నిహితంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.