చిత్తూరు (మదనపల్లి) : మదనపల్లి మండలకేంద్రంలోని అన్నమయ్య సర్కిల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మురళి(4) అనే బాలుడు మృతిచెందాడు. రోడ్డుపై ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ లారీ ఢీకొనడంతో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.