
జన్మభూమిలో.. అశ్రుధార
ఈమె పేరు దాలి రమణమ్మ. ఊరు సంతకవిటి మండలం తమరాం.పుట్టుకతో అవిటితనం శాపం. కాళ్లు చేతులు సరిగా పనిచేయవు. రెండేళ్ల క్రితం వరకూ వికలాంగ పింఛను వచ్చేది. తరువాత ఆగిపోయింది. గతంలో రెండు పర్యాయాలు ఇదే జన్మభూమిలో గోడు వెళ్లబోసుకున్నా పునరుద్ధరించలేదు. సోమవారం ఊళ్లో జరిగిన జన్మభూమికి యాతన పడి చేరుకుంది. అధికారుల ముందు ఇలా కంటతడి పెడుతూ కష్టాన్ని చెప్పుకుంది.
పింఛను పునరుద్ధరిస్తామని ప్రత్యేకాధికారి పి. కూర్మినాయుడు చెబుతున్నా ఈమె కంటనీరు ఆపుకోలేకపోయింది. సదరం వివరాలు సరిగ్గాలేని కారణంగా పింఛను నిలిచిపోయిందని పంచాయతీ కార్యదర్శి మౌళి సాక్షికి తెలిపారు. ఈమెకు 50 శాతం మేర వికలాంగత్వం ఉన్నట్లు వెలుగు అధికారులు తెలిపారు. నిరుపేద తండ్రే ఈమెకు తోడు.
- సంతకవిటి