
'జన్మభూమిలో నాయకులను నిలదీయండి'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అనంతపురంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు నిలబెట్టుకుని ప్రజల ముందుకు రావాలని సూచించారు. హామీలను తక్షణమే నెరవేర్చాలని జన్మభూమి కార్యక్రమంలో ప్రజలు టీడీపీ నాయకులను నిలదీయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శంకర్ నారాయణ మాట్లాడుతూ..హామీలు నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకుని జన్మభూమి కార్యక్రమం చేపడుతున్నారని చంద్రబాబుని సూటిగా ప్రశ్నించారు.