ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చూసి ప్రధాని నరేంద్ర మోదీకి భయం పట్టుకుందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జలగోపాలకృష్ణారెడ్డి అన్నారు.
కుప్పం రూరల్(చిత్తూరు): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చూసి ప్రధాని నరేంద్ర మోదీకి భయం పట్టుకుందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జలగోపాలకృష్ణారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం కొత్తయిండ్లు గ్రామంలో శనివారం నిర్వహించిన జన్మభూమి-మాఊరు కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రవేశపెడుతున్న అభివృద్ధి పథకాలు చూసి ఎక్కడ తనకు పోటీ అవుతాడోనని మోదీకి భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అంచలంచెలుగా రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకువస్తున్నారని చెప్పుకున్నారు.