
నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పులివెందులలోని ధ్యాన్‌చంద్ క్రీడామైదానంలో జన్మభూమి–మా ఊరు సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు పట్టణంలో పార్టీ జెండాలు, తోరణాలు, ప్లెక్సీలతో పసుపు మయం చేశారు. వారు అత్యుత్సాహంతో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని కూడా వదలలేదు. పట్టణంలోని ముద్దనూరురోడ్డు పాత జూనియర్ కళాశాల సర్కిల్‌లో ఉన్న గాంధీ విగ్రహం చుట్టూ పార్టీ జెండాలు, ప్లెక్సీలతో ముంచెత్తారు. జాతిపిత విగ్రహం కూడా సరిగా కనిపించడంలేదు. మహాత్ముని విగ్రహం చుట్టూ ఇలా ఒక పార్టీకి చెందిన జెండాలు, తోరణాలు ఏర్పాటు చేయడం ఏమిటని చూసిన వారు
మండిపడుతున్నారు. – పులివెందుల