కర్నూలు జిల్లాలో జన్మభూమికి బ్రేక్‌ | villagers protest on revenue staff | Sakshi
Sakshi News home page

కర్నూలు జిల్లాలో జన్మభూమికి బ్రేక్‌

Published Wed, Jan 10 2018 1:17 PM | Last Updated on Wed, Jan 10 2018 1:17 PM

సాక్షి, కర్నూలు ‌: కర్నూలు జిల్లాలో జన్మభూమి కార్యక్రమానికి బ్రేక్‌ పడింది. కర్నూలు మండలం పూడూరు గ్రామంలో బుధవారం జన్మభూమి సభ నిర్వహించేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులను గ్రామస్తులు దారిలోనే అడ్డుకున్నారు. అధికారులను గ్రామంలోనికి రానివ్వకుండా రోడ్డుపైనే నిలిపివేశారు.

తమ గ్రామానికి రోడ్డువసతి కల్పించడం, ఇతర సమస్యలు పరిష్కరించడంలో అధికారులు విఫళమయ్యారని వారు ఆరోపించారు. అత్యవసర పరిస్థితుల్లో తమ గ్రామానికి అంబులెన్స్ వచ్చే పరిస్థితి కూడా లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వసతులు కల్పించని అధికారులు నిర్వహించే జన్మభూమి సభల వల్ల తమకు ఒరిగేదేమీ లేదని వారు నిష్కర్షగా చెప్పారు. గ్రామస్థులు అడ్డుకోవడంతో ఎమ్మార్వో ఇతర అధికారులు జన్మభూమి సభనిర్వహించకుండానే వెనుతిరిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement