బోధన్, న్యూస్‌లైన్ : ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. గిట్టుబాటు ధర లేక దిగాలు పడుతున్నారు. బోధన్, ఎడపల్లి, రెంజల్, నవీపేట మండలాలలో రబీ సీజన్‌లో రైతులు వేలాది ఎకరాలలో వరి సాగు చేశారు. మొక్కజొన్నను వందల ఎకరాలలో పండించా రు. ఈ పంటల దిగుబడులు చేతికి వస్తున్నా యి. ముంగిటిలో, పంట పొలాలలో నిల్వ చేసి, ఆరబెడుతున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో దళారులు గ్రామాలలో మకాం వేస్తున్నారు. రైతుల నుంచి తక్కువ ధరకే ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం సాధారణ రకం వరి ధాన్యానికి క్వింటాలుకు రూ. 1,345, బీపీటీకి క్వింటాలుకు రూ. 1,500 మద్దతు ధరను ప్రకటించింది. మొక్కజొన్న క్వింటాలుకు రూ .1,310 మద్దతు ధరను ప్రకటించింది.
ఖరీఫ్‌లో సహకార సంఘాలు, స్వయం సహాయక మహిళా సంఘాలు, పౌరసరఫరాల శాఖ ద్వారా ధా న్యం కొనుగోలు చేశారు. రబీలో కొనుగోలు కేంద్రాల ఊసు లేక పోవడంతో రైతులు దిక్కుతోచకున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న దళారులు గ్రామాలలో తిరుగుతూ వరి కొనుగోళ్లు ముమ్మరం చేశారు. సాధారణ రకం వరి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. సాధారణ రకానికి క్వింటాలుకు రూ. 1,210 నుంచి 1,250 లోపే చెల్లిస్తున్నారు. సన్న రకం ధాన్యాన్ని కూడా ఇదే ధరకు కొంటామంటున్నారు.
మార్క్‌ఫెడ్ ఎక్కడ?
ఇదిలా ఉండగా మొక్కజొన్నను మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర అందిస్తామని అధికారులు గతంలో వెల్లడించారు. కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. సహకార సంఘాల ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు మార్క్‌ఫెడ్ ప్రతిపాదనలు మాత్రం తయారు చేసింది. సార్వత్రిక ఎన్నికల కోడ్‌రావడంతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవడం లేదని చెబుతున్నారు. ధాన్యం కొనుగోలుకు, ఎన్నికల కోడ్‌కు సంబంధం ఏమిటని రైతులు ఆ వేదన వ్యక్తం చేస్తున్నారు. దళారులు మొక్కజొన్నను క్వింటాలుకు రూ.1,200 నుంచి 1,250 వరకు రైతుల నుంచి కొంటున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ఇంకా జాప్యం జరిగితే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.
ఏమిటిది ఏలికా?
Published Mon, Apr 14 2014 2:16 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement