సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులకు అండగా నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్న రైతు భరోసా గొప్ప కార్యక్రమమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. ఇది తెలంగాణ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలోని రైతులకు ఎకరాకు ఏటా రూ.15వేల పెట్టుబడి సాయం అందిస్తామని.. కౌలు రైతులకు ఏటా రూ.12వేలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. వరి పండించే రైతులకు మద్దతు ధరపై క్వింటాల్‌కు రూ.500 బోనస్‌గా ఇస్తామని ప్రకటించారు. రైతు భరోసా గ్యారంటీ స్కీమ్‌ను ప్రకటించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు తెలంగాణ రైతాంగం తరపున అభినందనలు తెలుపుతున్నామన్నారు.
బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే నేరుగా బీజేపీకి ఓటు వేసి నట్టుగా భావించాలని సీఎల్పీనేత భట్టి విక్రమార్క ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు హోటల్ తాజ్ కృష్ణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌కు పడిన ప్రతి ఓటు బీజేపీకి బదిలీ అవుతుందని చెప్పారు. బీఆర్‌ఎస్ పార్లమెంట్‌లో బీజేపీ ప్రజా వ్యతిరేక నిర్ణయా లకు ఓటు వేసి సమర్థిస్తుందన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్‌ఎస్‌లు పరస్పరం సహకరించుకుంటూ ప్రజాస్వామాన్ని ఖూనీ చేస్తున్నాయని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు కోసమే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలని ప్రకటిస్తోందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment