మద‍్దతు ధర కోసం రైతుల ధర్నా
Published Tue, Mar 14 2017 2:04 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
ఖమ్మం: పండించిన పంటకు మద‍్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు ఖమ‍్మంలో మంగళవారం తెలంగాణ రైతు సంఘం ధర్నా నిర‍్వహించారు. మిర్చికి క్వింటాలుకు 1500 రూపాయలు, కందులు క్వింటాలుకు 8,000 రూపాయలు, సుబాబుల్ టన‍్నుకు 5,000 రూపాయలు గిట్టుబాటు ధర ఇవ‍్వాలని, అలాగే మామిడి రైతులకు నష‍్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. అలాగే సాగర్ జలాలు ఏప్రిల్ 15 వ తేదీ వరకూ ఇవ్వాలని వారు కోరారు.
Advertisement