![Minimum support price of dal is Rs 7550 per quintal](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/kandi.jpg.webp?itok=8mh6tsaf)
మార్కెట్‌లో కిలో కందిపప్పు ధర రూ.180 పైమాటే
కానీ రైతుకు దక్కేది అంతంతమాత్రమే
కందుల కనీస మద్దతు ధర క్వింటాకు రూ.7,550
ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటా రూ.4,700–6,170
అన్నదాతలను ఆదుకోని రాష్ట్ర ప్రభుత్వం
సీజన్ ముగిసే సమయంలో కొనుగోలు కేంద్రాలు
కంది రైతు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నాడు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక కుదేలవుతున్నాడు. ఓ వైపు రిటైల్ మార్కెట్‌లో కందిపప్పు కిలో రూ.180 పై మాటే. కాస్త నాణ్యమైన కందిపప్పు ధర ఏకంగా రూ.224 వరకు పలుకుతోంది. కానీ క్షేత్ర స్థాయిలో ఆ కంది పండించే రైతులకు మాత్రం కనీస మద్దతు ధర దక్కని దుస్థితి నెలకొంది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. నాణ్యమైన కందులకు కూడా ఆశించిన ధర దక్కక రైతు ఆర్థికంగా నష్టపోతున్నాడు. – సాక్షి, అమరావతి
మెజార్టీ రైతులకు దక్కని మద్దతు ధర
ఏన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం అనుబంధంగా ఉన్న వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రం ప్రతీ ఏటా ఖరీఫ్, రబీ సీజన్‌లలో పంట చేతికొచ్చే సమయంలో ధరల అంచనా వేస్తుంది. ఏఏంఐసీ అంచనా నివేదిక ప్రకారం జనవరి, ఫిబ్రవరిలో కందులకు క్వింటా రూ.7,830 నుంచి రూ.8,680 మధ్య ఉంటుందని అంచనా. కానీ వాస్తవంగా క్షేత్ర స్థాయిలో సోమవారం కందులకు గరిష్టంగా క్వింటా రూ.7,200 పలికింది. 70– 80 శాతం మంది రైతులకు నాణ్యత లేదనే సాకుతో క్వింటాకు రూ.4,700 నుంచి రూ.6,170 మధ్య చెల్లిస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో భరోసా
మార్కెట్‌లో మద్దతు ధర దక్కని సమయంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మార్కెట్‌లో రైతు సంక్షేమమే లక్ష్యంగా చర్యలు తీసుకుంది. ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచింది. ఇలా 2019–24 మధ్య మార్క్‌ఫెడ్ ద్వారా రూ.140 కోట్ల విలువైన 61,377 టన్నులు కందులను సేకరించారు.
కాగా ఈ ఏడాది కోతలు ప్రారంభమైనప్పటి నుంచి మద్దతు ధర దక్కని పరిస్థితులు నెలకొన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకున్న పాపాన పోలేదు. కేంద్రం నుంచి అనుమతి రాగా గత నెల మూడో వారం నుంచి సేకరణకు శ్రీకారం చుట్టింది. కనీస మద్దతు ధరకు 1,450 టన్నుల కందులను మాత్రమే సేకరించారు.
మార్కెట్‌లో మద్దతు ధర దక్కని సమయంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మార్కెట్‌లో రైతు సంక్షేమమే లక్ష్యంగా చర్యలు తీసుకుంది. ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచింది. ఇలా 2019–24 మధ్య మార్క్‌ఫెడ్ ద్వారా రూ.140 కోట్ల విలువైన 61,377 టన్నులు కందులను సేకరించారు.
కాగా ఈ ఏడాది కోతలు ప్రారంభమైనప్పటి నుంచి మద్దతు ధర దక్కని పరిస్థితులు నెలకొన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకున్న పాపాన పోలేదు. కేంద్రం నుంచి అనుమతి రాగా గత నెల మూడో వారం నుంచి సేకరణకు శ్రీకారం చుట్టింది. కనీస మద్దతు ధరకు 1,450 టన్నుల కందులను మాత్రమే సేకరించారు.
» ఖరీఫ్ సీజన్‌లో 9 లక్షల ఎకరాల్లో కంది సాగైంది.
» సగటున హెక్టార్‌కు 754 కేజీల చొప్పున 2.73 లక్షల టన్నుల దిగుబడులొస్తాయని అంచనా వేశారు.
» అధిక వర్షాలు,వర్షాభావ పరిస్థితులు వేరుశనగ, పత్తి తదితర పంటలు దెబ్బతినడంతో రైతులు కందిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
» గతేడాది ఇదే సమయానికి క్వింటా రూ.9,400–9,800 మధ్య పలికింది. దీంతో ఈ ఏడాది మంచి రేటు పలుకుతుందని రైతులు ఆశపడ్డారు.
» అయితే పూత, పిందె దశలో భారీ వర్షాల ప్రభావంతో దిగుబడులు పడిపోయాయి. దాదాపు ఆరేడు సార్లు
మందులు పిచికారీ చేయాల్సి రావడంతో ఎకరాకు రూ.2వేల వరకు అదనంగా పెట్టుబడి పెట్టాల్సి వచి్చంది.
» కందులకు కనీస మద్దతు ధర క్వింటాకురూ.7,550గా కేంద్రం ప్రకటించగా, పంట వేసిన సమయంలోనే అతి తక్కువగా క్వింటా రూ.7,500 నుంచి రూ.8వేల శ్రేణిలో పలికింది.
» కోతకొచ్చే వేళలో మద్దతు ధరయినా దక్కు తుందని ఆశించారు.
» అయితే వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధర లేకుండా చేసారు.
» తీరా పంట చేతికొచ్చే వేళ ధర నేలచూపులు చూస్తుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
» ఎకరాకు ఐదారు క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, 2–3 క్వింటాళ్ల మించిరాని పరిస్థితి ఏర్పడింది.
మద్దతు ధర కూడా దక్కలేదు..
నేను రెండెకరాలు సొంతంగా, మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకొని కంది సాగు చేసా. పెట్టుబడి రూ.80 వేల చొప్పున ఖర్చు కాగా, ఎకరాకు కనీసం 5–6 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశించాను. కానీ వర్షాలు, తెగుళ్ల ప్రభావంతో ఎకరాకు 3 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. కనీస మద్దతు ధరకు కొనే వారు లేకపోవడంతో క్వింటాను రూ.7,200 చొప్పున విక్రయించా. వచ్చిన సొమ్ము పెట్టుబడులకు కూడా సరిపోలేదు. – వడ్డే ఈశ్వరప్ప, గిరిగెట్ల, తుగ్గలి మండలం, కర్నూలు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment