
సాక్షి, అమరావతి: డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య యూనివర్సిటీలో లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి ఈనెల 24, 25 తేదీల్లో మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. 24న ఉదయం 9.30 నుంచి 12 గంటలకు వరకు పేపర్–2, 25న ఉదయం పేపర్–1 ఉంటుందని పేర్కొంది. అభ్యర్థులు 17 నుంచి https://psc.ap.gov.in నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
25న అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పరీక్ష ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఈనెల 25న మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్టు కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆరోజు ఉదయం పేపర్–1, మధ్యాహ్నం పేపర్–2 ఉంటుంది. అభ్యర్థులు 18 నుంచి ఏపీపీఎస్సీ వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment