కరీంనగర్‌రూరల్: యాసంగి పంటను కొనుగోలు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 7,100 కేంద్రాలు ఏర్పా టు చేస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్, మొగ్దుంపూర్ గ్రా మాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సివిల్ సప్లైచైర్మన్ రవీందర్‌సింగ్‌తో కలిసి మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ రైతులకు కనీస మద్దతు ధర చెల్లిస్తూ రెండో పంటను కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.
యాసంగి పంట ముందుగా కోతకు రావడంతో సీఎం ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 7,100 కేంద్రాలను ఏర్పాటు చేయ నున్నామని, ఇప్పటివరకు 420 కేంద్రాలను ఏర్పా టు చేసి రూ.4.15కోట్ల విలువైన 2వేల మెట్రిక్ ట న్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. అవ సరమైన ప్రాంతాల్లో కేంద్రాలను ప్రారంభించేందు కు కలెక్టర్లకు ఆదేశాలిచి్చనట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి సురేశ్ పాల్గొన్నారు.
మంత్రి గంగులకు తప్పిన ప్రమాదం
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు ప్రమాదం తప్పింది. కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్‌లో ఆదివారం కొందరు చిరుతల రామాయణం నాటకాన్ని ప్రదర్శించారు. అనంతరం శ్రీసీతారాముల పట్టాభిõషేకం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి మంత్రి గంగుల హాజరై వేదికపైకి చేరుకున్నారు. ఆయనతోపాటు సివిల్ సప్లైచైర్మన్ రవీందర్‌సింగ్ కూడా ఉన్నారు.
అయితే అప్పటికే పెద్దసంఖ్యలో మహిళలు వేదికపైకి ఉన్నారు. గంగుల, రవీందర్‌సింగ్‌తోపాటు స్థానిక నాయకులు వేదికపైకి వెళ్లడంతో ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో మంత్రి గంగుల కమలాకర్ ఎడమకాలుకు గాయమైంది. రవీందర్‌సింగ్, జెడ్పీటీసీ లలిత స్వల్పంగా గాయపడ్డారు. పడిపోయిన మంత్రి వెంటనే గన్‌మెన్లు, నిర్వాహకులు పైకి లేపి ఆస్పత్రికి తరలించారు. చికిత్స తీసుకుని ఇంటికి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment