
ప్రతీకాత్మక చిత్రం
నిజామాబాద్: పసుపు, ఎర్రజొన్నలకు మద్ధతు ధర ప్రకటించాలని కోరుతూ జక్రాన్‌పల్లి వద్ద జాతీయ రహదారిపై రైతులు భారీ ధర్నాకు దిగారు. ఉదయం నుంచి ధర్నా కొనసాగుతోంది. కోలాటాలు వేస్తూ జాతీయరహదారిపై కూర్చుని రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నుంచి స్పందన వచ్చే వరకు రైతులు ధర్నా విరమించేది లేదంటున్నారు.
పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్ధతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్‌లో కూడా జాతీయ రహదారిపై 7 గంటలుగా ఆందోళన కొనసాగుతోంది. కలెక్టర్ వచ్చే వరకు రోడ్డుపై నుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment