
సీసీఐపై రైతుల ఆగ్రహం
మద్దతు ధర కోసం ఆందోళన
* మార్కెట్ కార్యదర్శితో వాగ్వాదం
* కొనుగోళ్లేవంటూ నిలదీసిన కాంగ్రెస్ నాయకులు
* ఆలస్యంగా ప్రారంభమైన కొనుగోళ్లు
* అయినా రైతుకు దక్కని ‘మద్దతు’
జమ్మికుంట : జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్లో సీసీఐ తీరుపై రైతులు నిప్పులు చెరిగారు. కొనుగోళ్లు ప్రారంభించామని చెబుతున్నా.. పత్తిని ఎందుకు కొనడం లేదంటూ అధికారులను నిలదీశారు. మార్కెట్ కార్యదర్శిని ముట్టడించి మద్దతు ధర అందించాలని డిమాండ్ చేశారు. దీంతో మార్కెట్లో ఉద్రిక్తత ఏర్పడింది. జమ్మికుంట పత్తి మార్కెట్‌కు గురువారం కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి రైతులు సుమారు ఆరు వేల బస్తాల్లో పత్తిని తెచ్చారు. అలాగే 46 వాహనాల్లో లూజ్ పత్తిని తీసుకొచ్చారు. అయితే సీసీఐ మద్దతు ధర రూ.4050కి క్వింటాల్ కొనాల్సి ఉంది.
మధ్నాహ్నం 12 గంటలు దాటినా.. సీసీఐ అధికారులు తేమశాతం చూస్తూ వెళ్లిపోయారే తప్ప బస్తా కొనలేదు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. వారికి కాంగ్రెస్ నాయకులు మద్దతుగా నిలిచా రు. అసిస్టెంట్ కార్యదర్శి విజయ్‌కుమార్‌తో వాగ్వాదానికి దిగారు. మద్దతు ధరకే సీసీఐ కొనాలని పట్టుబట్టారు. అధికారులందరినీ యార్డుకు రప్పించాలని బైఠాయించారు. మార్కెట్ కార్యదర్శి స్పందించి సీసీఐ అధికారులను పిలిపించారు. తేమశాతం అధికంగా ఉన్నందునే కొనడం లేదనడంతో రైతులు, కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తేమశాతం అధికంగా ఉంటే కొనుగోళ్లు ఎందుకు ప్రారంభించారని ప్రశ్నించారు.
ఖరీదుదారులను పిలిపించి కొనుగోళ్లు జరిగేలా చూడాలని నిలదీశారు. దీనికి కార్యదర్శి స్పందించకపోవడంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు చేరుకుని రైతులను సముదాయించారు. చివరకు ముగ్గురు వ్యాపారులు పత్తిని కొనడంతో వివాదం సద్దుమణిగింది. రైతులు మండుటెండలో రెండు గంటలపాటు ఆందోళన చేసినా.. సీసీఐ మాత్రం రూ.3,929 ధరతో 12.95క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసి చేతులు దులుపుకుంది. వ్యాపారులు క్వింటాల్‌కు రూ.3500 నుంచి రూ.3900 వరకు చెల్లించి రైతులను నిలువునా దోపిడీ చేశారు. రతో 12.95క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసి చేతులు దులుపుకుంది. మధ్య దళారులు క్వింటాల్‌కు రూ.3500 నుంచి రూ.3900 వరకు చెల్లించి రైతులను నిలువు దోపిడీ చేశారు.