గోదావరి జిల్లాల్లో వరి కోతలు ప్రారంభం
వచి్చన ధాన్యాన్ని వచ్చినట్టు సేకరించేందుకు ప్రణాళిక
25 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని ప్రాథమిక అంచనా
జీఎల్టీ చార్జీలు సైతం చెల్లించడంతో ప్రభుత్వ కేంద్రాల వైపే రైతుల మొగ్గు
ఫలితంగా మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి ధాన్యాన్ని
కొనుగోలు చేస్తున్న ప్రైవేటు వ్యాపారులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రబీ ధాన్యం సేకరణ ప్రారంభమైంది. ప్రతి రైతుకు సంపూర్ణ మద్దతు ధర చెల్లింపే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రాథమికంగా ఈ సీజన్‌లో 25 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు భావిస్తున్నారు. కల్లాలో పంట కొనుగోలు దగ్గర నుంచి మిల్లుకు తరలించేంత వరకు ఎక్కడా జాప్యం లేకుండా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది. రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) స్థాయిలో ధాన్యం రవాణాకు వాహనాలను అందుబాటులోకి తెస్తోంది. అకాల వర్షాలు, అనుకోని విపత్తులు సంభవిస్తే తక్షణం ధాన్యాన్ని తరలించే విధానంపై ఇప్పటికే పౌరసరఫరాల సంస్థ యంత్రాంగానికి దిశానిర్దేశం చేసింది. గోదావరి జిల్లాల్లో కోతలు మొదలవడంతో వచి్చన ధాన్యాన్ని వచి్చనట్టు కొనుగోలు చేస్తోంది.
విప్లవాత్మక మార్పులతో..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధాన్యం సేకరణలో విప్లవాత్మక మార్పులు చేసింది. దళారులు, మిల్లర్ల దోపిడీని పూర్తిగా అరికట్టి రైతులను నష్టపోకుండా కాపాడింది. రైతుకు మద్దతు ధర దక్కాలన్న ఉద్దేశంతో దేశంలోనే తొలిసారిగా ఈ–క్రాప్ ఆధారిత ధాన్యం సేకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఫలితంగా టీడీపీ హయాంలో కంటే ఎక్కువ మంది రైతులకు మద్దతు ధర దక్కింది. ఏటా దిగుబడుల్లో సగటున 50 శాతంపైనే కొనుగోళ్లు చేస్తూ రైతులకు అండగా నిలిచింది. ఇప్పటివరకు ఏకంగా 37.68 లక్షల మంది రైతుల నుంచి రూ.65,142.29 కోట్ల విలువైన 3.40 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం విశేషం. అదే టీడీపీ ఐదేళ్లలో కేవలం 17.94 లక్షల మంది రైతుల నుంచి రూ.40,236.91 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించింది. అంటే టీడీపీ హయాంలో కంటే 20 లక్షల మంది రైతులకు అదనంగా మద్దతు ధర అందించింది.
జీఎల్‌టీ లబ్ధి అదనం
టీడీపీ హయాంలో పేరుకే ప్రభుత్వం ధాన్యం సేకరణ చేసేది. కొనుగోలు కేంద్రాలకు పంటతో వచి్చన రైతుల నుంచి ధాన్యం తీసుకోవడానికి ముప్పుతిప్పలు పెట్టేది. దీంతో రైతులు వచి్చనకాడికి దళారులు, మిల్లర్లకు ధాన్యాన్ని అప్పజెప్పాల్సి వచ్చేది. ఇలా సేకరించిన ధాన్యాన్ని దళారులు తిరిగి ప్రభుత్వానికి విక్రయించి రైతుల పేరుతో పూర్తి మద్దతు ధర కొట్టేసేవారు. ఇక్కడ రైతులు మద్దతు ధర కోల్పోవడంతోపాటు కల్లాల నుంచి కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించేందుకు రూ.వేలకు వేలు వెచి్చంచాల్సి వచ్చేది. గతంలో రైతులే ధాన్యాన్ని రవాణా చేస్తే ఆ ఖర్చులను ప్రభుత్వమే భరించినట్టు లెక్కల్లో చూపించి ఏటా రూ.కోట్లు దోచేసేవారు. ఇది గమనించిన సీఎం వైఎస్ జగన్ రైతులకే గన్నీ, హమాలీ, రవాణా (జీఎల్‌టీ) ఖర్చులను చెల్లించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గోనె సంచులు, హమాలీ కూలీ, ధాన్యం రవాణాకు టన్నుకు రూ.2,523 చొప్పున రైతులకు అదనంగా చెల్లిస్తోంది. ఈ పరిస్థితుల్లో మద్దతు ధర కంటే అధికంగా చెల్లించి ప్రైవేటు వ్యాపారులు రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.
బొండాలు రకానికీ మార్కెట్‌లో మంచి ధర
గోదావరి జిల్లాల్లో సాగు చేసే జయ రకం (బొండాలు) ధాన్యానికి మార్కెట్‌లో మంచి రేటు లభిస్తోంది. గతేడాది నుంచి ప్రభుత్వం జయ రకం ధాన్యాన్ని కూడా సేకరించడం ప్రారంభించడంతో ప్రైవేట్ వ్యాపారుల దందాకు అడ్డుకట్ట పడింది. దీంతో దిగొచి్చన వ్యాపారులు మద్దతు ధర కంటే రూ.100 నుంచి రూ.300 కంటే ఎక్కువ ఇచ్చి కల్లాల నుంచే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ ఏడాది 3 లక్షల టన్నుల వరకు జయ రకం ధాన్యాన్ని సేకరించాలని పౌరసరఫరాల సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
రైతులకు సమస్య లేకుండా..
మిల్లుల్లో ధాన్యం నాణ్యత సమస్యలను రైతులతో సంబంధం లేకుండా పరిష్కరించేందుకు కస్టోడియన్ అధికారుల స్థానంలో ప్రతి మండలంలో మొబైల్ బృందాలను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం రెవెన్యూ అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే పౌరసరఫరాల సంస్థ జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ కాల్‌సెంటర్‌కు వచి్చన ఫిర్యాదులతో పాటు స్థానికంగా రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment