ఇప్పటివరకు 10.05 లక్షల టన్నుల సేకరణ
1.02 లక్షల మంది రైతుల నుంచి రూ.2,196 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు
ఇప్పటికే రూ.వెయ్యి కోట్లకు పైగా చెల్లింపులు పూర్తి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రబీ ధాన్యం సేకరణ చురుగ్గా సాగుతోంది. ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ధర అందించడంతోపాటు.. దేశంలోనే తొలిసారిగా రైతులకు గోనె సంచులు (గన్నీ), హమాలీ, రవాణా (జీఎలీ్ట) చార్జీల కింద టన్నుకు రూ.2,523 అదనంగా చెల్లిస్తూ ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ఎన్నికల నేపథ్యంలో రబీ ధాన్యం సేకరణకు పౌర సరఫరాల సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటివరకు 1.02 లక్షల మంది రైతుల నుంచి రూ.2,196 కోట్ల విలువైన 10.05 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది.
వీటిల్లో నిర్దిష్ట సమయానికి 45,468 మంది రైతులకు రూ.1,008.93 కోట్లు చెల్లింపులను పూర్తి చేసింది. ఈసారి ప్రతికూల పరిస్థితుల్లో సాగు చేసిన్పటికీ రైతులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందించడంతో మేలైన దిగుబడులు వస్తాయని వ్యవసాయశాఖ రెండో ముందస్తు అంచనా చెబుతోంది. వాస్తవానికి రబీలో ప్రాథమికంగా 25 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
గత అనుభవాల దృష్ట్యా అకాల వర్షాలు, అనుకోని విపత్తులు సంభవిస్తే తక్షణం ధాన్యాన్ని తరలించే విధానంపై ఇప్పటికే పౌరసరఫరాల సంస్థ పటిష్ట ప్రణాళిక అమలు చేస్తోంది. చాలావరకు కోతలు పూర్తవడంతో ధాన్యాన్ని వేగంగా మిల్లులకు తరలిస్తోంది.50 శాతంపైనే కొనుగోలు తూర్పు, పశి్చమ గోదావరి, ఏలూరు, కోనసీమ, కాకినాడ, బాపట్ల జిల్లాల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఎక్కువగా వస్తోంది. ఎగుమతిదారులు చాలామంది సాధారణ రకాలకు సైతం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుండటం విశేషం. ఉత్తరాంధ్రలో ఫైన్ వెరైటీలు సాగు చేస్తున్నారు.
వాటికి బయటి మార్కెట్‌లో డిమాండ్ ఉండటంతో ప్రైవేటు వ్యాపారులు అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. సీఎం జగన్ ప్రభుత్వం ఏటా దిగుబడుల్లో సగటున 50 శాతంపైనే కొనుగోళ్లు చేస్తూ రైతులకు అండగా నిలుస్తోంది. ఇలా ఐదేళ్లలో 37.68 లక్షల మంది రైతుల నుంచి రూ.65,142.29 కోట్ల విలువైన 3.40 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. టీడీపీ ఐదేళ్లలో కేవలం 17.94 లక్షల మంది రైతుల నుంచి రూ.40,236.91 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించింది.
దొడ్డు ధాన్యానికి డిమాండ్
రబీలో గోదావరి జిల్లాల్లో సాగు చేసే జయ రకం (దుడ్డు/»ొండాలు) ధాన్యానికి మార్కెట్‌లో మంచి ధర లభిస్తోంది. గతేడాది నుంచి ప్రభుత్వం జయ రకం ధాన్యాన్ని సేకరించడం ప్రారంభించడంతో ప్రైవేటు వ్యాపారుల దందాకు అడ్డుకట్ట పడింది. పూర్తి మద్దతు ధరతోపాటు జీఎల్టీ చార్జీలను ఇస్తుండటంతో రైతులకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు ఆసక్తి చూపించారు. దీంతో దిగొచ్చని ప్రైవేటు వ్యాపారులు మద్దతు ధరకు కంటే రూ.100 నుంచి రూ.300 ఎక్కువ ఇచ్చి కళ్లాల నుంచే ధాన్యాన్ని కొనుగోలు చేశారు.
ఫలితంగా రైతులకు మంచి ధర కలి్పంచడంలో ప్రభుత్వం విజయవంతమైంది. ఈ ఏడాది 3 లక్షల టన్నుల వరకు జయ రకం ధాన్యాన్ని సేకరించేలా పౌరసరఫరాల సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్క జయ రకం విషయంలోనే కాకుండా సాధారణ రకాల ధాన్యం ఉత్పత్తులను కూడా మద్దతు ధర/అంతకు మించి ఇచ్చి ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మిల్లుల్లో ధాన్యం నాణ్యత సమస్యలను రైతులతో సంబంధం లేకుండా పరిష్కరించేందుకు కస్టోడియన్ అధికారుల స్థానంలో ప్రతి మండలంలో మొబైల్ బృందాలను నియమించింది.
ప్రస్తుతం ఎన్నికల సమయం నేపథ్యంలో చాలామంది రెవెన్యూ అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే పౌరసరఫరాల సంస్థ ఆయా జిల్లాల జేసీలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు ప్రభుత్వ కాల్‌సెంటర్ వచి్చన ఫిర్యాదులతో పాటు స్థానికంగా రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment