సాగర్ జలాలపై చర్చిస్తాం-మంత్రి ప్రత్తిపాటి | ap formers meet minister pathipati pullarao | Sakshi
Sakshi News home page

సాగర్ జలాలపై చర్చిస్తాం-మంత్రి ప్రత్తిపాటి

Published Thu, Feb 12 2015 11:54 AM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM

సాగర్ జలాలపై చర్చిస్తాం-మంత్రి ప్రత్తిపాటి - Sakshi

సాగర్ జలాలపై చర్చిస్తాం-మంత్రి ప్రత్తిపాటి

గుంటూరు: సాగర్ జలాల విషయంపై తెలంగాణ ప్రభుత్వంతో చర్చిస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి  ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన కౌలు రైతులు గురువారం మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సాగర్ కుడి కాలువకు నీరు నిలుపదల విషయమై తెలంగాణ ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. ఒక వేళ వారు సానుకూలంగా వ్యవహరించకుంటే కోర్టును ఆశ్రయిస్తామన్నారు.

మొక్కజొన్న పంటకు క్వింటాల్ కు రూ.1310 మద్దతు ధర కల్పిస్తామని మంత్రి  హామీ ఇచ్చారు. రైతులు తక్కువ ధరకు పంట అమ్ముకోవద్దని మంత్రి సూచించారు. అవసరమైతే ప్రత్యేకంగా పంట కొనుగోలు చేసేందుకు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.
(చిలకలూరిపేట)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement