
హైదరాబాద్: పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతు ఆత్మహత్యలను అరికట్టాలని కోరుతూ ఓ రైతుబిడ్డ చేపట్టిన రైతు పరుగుయాత్ర శనివారం ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల్లో కనువిప్పు కలగాలని ఫణి అనే యువకుడు హైదరాబాద్‌లోని తెలంగాణ అసెంబ్లీ నుంచి అమరావతిలోని ఏపీ అసెంబ్లీ వరకు ఈ యాత్ర చేపట్టాడు. విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ ప్రజల పార్టీ అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్ వనస్థలిపురం దగ్గర ఫణికి స్వాగతం పలికి మద్దతు ప్రకటించారు.
జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ రైతులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా ఇవ్వడంలేదని, అందుకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేవిధంగా ఫణి రైతు పరుగుయాత్ర చేపట్టడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో విశ్రాంత ఎస్పీ మీనయ్య, తెలంగాణ ప్రజల పార్టీ యువజన విభాగం నాయకులు కోట్ల వాసు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment