తెల్లబంగారం@5500
జమ్మికుంట: ఉత్తర తెలంగాణలోనే అతి పెద్ద వ్యవసాయ మార్కెట్ అయిన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్‌లో తెల్లబంగారమైన పత్తికి ఈరోజు గరిష్ఠ మద్దతు ధర రూ.5500 లభించింది. అక్టోబర్‌లో సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే రికార్డు ధర. కాగా, కనిష్ఠ ధర రూ. 5,300 పలుకుతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా గరిష్ఠ మద్దతు ధర లభించడం పట్ల రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.