ఉల్లి రైతుకు అందని మద్దతు ధర
Published Fri, Jan 27 2017 11:39 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
– పెండింగ్‌లో 3, 000 మంది దరఖాస్తులు
కర్నూలు(అగ్రికల్చర్): తక్కువ ధరకు ఉల్లిని అమ్ముకున్న రైతులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతును పొందేందుకు అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. క్వింటాలు ఉల్లిని మార్కెట్‌లో రూ.60, రూ. 100కి అమ్మకొని రైతులు నష్టపోయారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ.600 ప్రకారం మద్దతు ధర ప్రకటించింది. దీని ద్వారా మద్దతు కింద రైతుకు గరిష్టంగా రూ.300 లభిస్తుంది. అయితే మద్దతు ఇచ్చే విషయాన్ని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ డిసెంబరు నెల 21 వరకు పరిగణలోకి తీసుకున్నారు.
అన్ని వివరాలు సక్రమంగా ఉంటే బ్యాంకు ఖాతాలకు మిగతా మొత్తం జమ చేశారు. ఈ విధంగా 3,800 మంది రైతులకు రూ.3.50 కోట్లు జమ చేశారు. మార్కెట్‌లో తక్కువ ధరలకు అమ్మకంటే గరిష్టంగా రూ.300 మద్దతు పొందే అవకాశం ఫిబ్రవరి వరకు ఉంది. జిల్లా కలెక్టర్ మాత్రం డిసెంబరు 21 నుంచి ఉల్లి రైతులకు మద్దతు ధర ఇచ్చే అంశాన్ని పూర్తిగా పక్కకు పెట్టేయడం విమర్శలకు తావిస్తోంది. మార్కెటింగ్ శాఖ అధికారుల దగ్గర దాదాపు 3000 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి రూ.3కోట్లు అవసరం అవుతాయి. జిల్లా కలెక్టర్ దయ తలిస్తేనే వీరికి మద్దతు లభిస్తుంది.
Advertisement
Advertisement