ఎకరాకు 200 క్వింటాళ్లు
ఎకరాకు 200 క్వింటాళ్లు
Published Sun, Apr 30 2017 11:42 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
- ఉల్లిసాగులో సీతారామాపురం రైతు ప్రతిభ
సీతారామాపురం(బేతంచెర్ల): ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతుక్కోవాలన్న చందంగా ఏటా పంటలు సాగు చేసి నష్టపోతున్న రైతులు మరుసటి ఏడాది అంతకు రెట్టింపు ఆశలతో పంట సాగు చేస్తారు. ఈ ఏడాదైనా పంట కలసి రాకుండా పోతుందా అన్న ఆశ వారిని నడిపిస్తోంది. ఈ దశలో బేతంచెర్ల మండలం సీతారామాపురం గ్రామానికి చెందిన రైతు మల్లేశ్వరరెడ్డి ఈ ఏడాది ఉల్లి సాగులో సక్సెస్ అయ్యాడు. బోరు నీటి ఆధారంగా రెండెకరాల్లో వెస్టు రకం ఉల్లి సాగు చేసిన ఇతడు 400 క్వింటాళ్ల దిగుబడి సాధించాడు. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ పంటకు ముందు సేంద్రియ ఎరువులను దుక్కిలో వేసినట్లు తెలిపారు. నారు నాటింది మొదలు కోత వరకు డ్రిప్ విధానంలో నీటి తడులు, ఎరువులు అందించాడు. వ్యవసాయ అధికారులు, నిపుణుల సలహాలు పాటించాడు. తాను పడిన కష్టానికి ఫలితం దిగుబడి రూపంలో వచ్చింది. ఎకరాకు 100 నుంచి 150 క్వింటాళ్లకు మించని దిగుబడి ఈయన పొలంలో 200 క్వింటాళ్లు వచ్చింది. క్వింటా రూ. 950 ప్రకారం అమ్మగా మొత్తంగా ఖర్చులు పోను రూ. 2లక్షల వరకు మిగిలిందని మల్లేశ్వరెడ్డి తెలిపారు.
Advertisement