కాసుల కోసం కక్కుర్తి | business man arrested for cheating in telangana | Sakshi
Sakshi News home page

కాసుల కోసం కక్కుర్తి

Published Mon, Mar 13 2017 8:28 PM | Last Updated on Tue, Sep 5 2017 5:59 AM

business man arrested for cheating in telangana

రాజుపేట(యాదాద్రిభువనగిరి): ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందేందుకు ఓ వ్యాపారి అక్రమ మార్గంలో వెళ్లి అడ్డంగా దొరికిపోయాడు. యాదాద్రిభువనగిరి జిల్లా రాజుపేట మండలం సోమారం గ్రామానికి చెందిన గడ్డం శ్రీను భువనగిరిలో ఉంటూ వ్యాపారం చేస్తున్నాడు. ఇటీవల గ్రామ రైతుల నుంచి ఇటీవల దాదాపు 60 క్వింటాళ్ల కందులను కొనుగోలు చేశాడు.

కందులను రైతు పేరుతో భువనగిరి మార్కెట్‌లో మద్దతు ధరకు విక్రయించి సుమారు రూ.3 లక్షల మేర అతడు లాభం పొందాడు. అనుమానం వచ్చిన విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టగా శ్రీనుకు వరి పొలం, మామిడితోట మాత్రమే ఉన్నాయని, కంది పంట సాగు చేయలేదని తేలింది. దీనిపై సోమవారం వీఆర్వో పద్మ ఫిర్యాదు మేరకు ఎస్సై బీసన‍్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement