కాసుల కోసం కక్కుర్తి
రాజుపేట(యాదాద్రిభువనగిరి): ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందేందుకు ఓ వ్యాపారి అక్రమ మార్గంలో వెళ్లి అడ్డంగా దొరికిపోయాడు. యాదాద్రిభువనగిరి జిల్లా రాజుపేట మండలం సోమారం గ్రామానికి చెందిన గడ్డం శ్రీను భువనగిరిలో ఉంటూ వ్యాపారం చేస్తున్నాడు. ఇటీవల గ్రామ రైతుల నుంచి ఇటీవల దాదాపు 60 క్వింటాళ్ల కందులను కొనుగోలు చేశాడు.
కందులను రైతు పేరుతో భువనగిరి మార్కెట్లో మద్దతు ధరకు విక్రయించి సుమారు రూ.3 లక్షల మేర అతడు లాభం పొందాడు. అనుమానం వచ్చిన విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టగా శ్రీనుకు వరి పొలం, మామిడితోట మాత్రమే ఉన్నాయని, కంది పంట సాగు చేయలేదని తేలింది. దీనిపై సోమవారం వీఆర్వో పద్మ ఫిర్యాదు మేరకు ఎస్సై బీసన్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.