మద్దతు కరువు | grain changes color due to unseasonal rains | Sakshi
Sakshi News home page

మద్దతు కరువు

Published Tue, Nov 11 2014 3:27 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

grain changes color due to unseasonal rains

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ధాన్యం అమ్మకాలలోనూ రైతులకు కష్టాలు తప్పడం లేదు. 287 కొనుగోలు కేంద్రాలకుగాను ఇప్పటివరకు 168 ప్రారంభం కాగా, 119 కేంద్రాలు ఇంకా ఎప్పుడు తెరుస్తారో తెలియడం లేదు. ఫలితంగా రైతులు ఖరీఫ్ ధాన్యాన్ని విక్రయించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. కేంద్రాలలో అసౌకర్యాలు తిష్టవేయగా, గన్నీ సంచులు, హమాలీల కొరత అక్కడక్కడా ఇబ్బందికరంగా మారింది.

 ఆరుగాలం శ్రమించిన రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చూడాలని ప్రభుత్వం జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ మేరకు కలెక్టర్ రొనాల్డ్ రోస్ మార్కెటింగ్, పౌరసరఫరాల, డీఆర్‌డీఏ తదితర శాఖలను అప్రమత్తం చేసి నా, క్షేత్రస్థాయిలో కొందరి అలసత్వం రైతులకు ఇబ్బందికరంగా మారుతోంది. వారు రైస్ మిల్ల ర్లు, దళారులను ఆశ్రయించక తప్పడం లేదు. మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, సోమవారం నాటికి 7,030 మె.టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు.

 కామారెడ్డిలో హమాలీలు లేరు
 కామారెడ్డి మండలం గర్గుల్ కొనుగోలు కేంద్రం లో హమాలీలు లేక వారం రోజులుగా ధాన్యం అక్కడే ఉంది. రైతులు ధాన్యం కుప్పల వద్దే పడిగాపులు పడుతున్నారు. ఒకవేళ ఎవరైనా కొనుగోలు చేసినా బిల్లులు సరిగ్గా రావడంలేద ని వారు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి మార్కెట్‌లో కొనుగోళ్లు నెమ్మదిగా జరుగుతుం డటంతో రైతులు వారం రోజులుగా అక్కడే ఉంటున్నారు.

 మాచారెడ్డి సింగిల్‌విండోలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినా ఇప్పటి వరకు తెరవలేదు. సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరు. దీంతో రైతులు ధాన్యాన్ని వ్యాపారులకు విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. దోమకొండలో ఆరు కొనుగోలు కేంద్రాలుండగా,కొ న్న ధాన్యానికి సరిగ్గా డబ్బులు ఇవ్వడం లేదు.

 ఆర్మూర్‌లో తూకం లేదు
 ఆర్మూర్ నియోజకవర్గంలో రైతులు ధాన్యం తీసుకువచ్చి వారం గడుస్తున్నా తూకం వేయ డం లేదు. కొనుగోలు కేంద్రాలలో హమాలీల పేరుతో దోపిడీ చేస్తున్నారన్న ఆరోపణలు విని పించాయి. పలు కేంద్రాలలో అకాల వర్షంతో ధాన్యం తడిసిపోగా, రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నారు.

ఆర్మూర్ పట్టణంలో మెప్మా ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో, పీఏసీఎస్ ఆధ్వర్యంలో పీఏసీఎస్ పరిసరాలలో,  పెర్కిట్, మిర్ధాపల్లి, ఆలూర్, దేగాం, పిప్రి, పెర్కిట్, ఫత్తేపూర్, తదితర గ్రామాలలో కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం కొంత మేర తడిసి పోవడంతో రైతులు వేదనకు గురవుతున్నారు. కొనుగోలు కేంద్రంలో 40 కేజీల బస్తాకు హమాలీ పేరుతో రూ.14లు వసూలు చేస్తూ క్వింటాలుకు రెండున్నర కిలోల కోత విధిస్తూ రైతులను దోచుకుంటున్నారు. తూకం వేసి లారీలలో ఎక్కించే వరకు రైతులదే బాధ్యత అని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పేర్కొంటుండటంతో రైతులు రేయింబవళ్లు కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నారు.

 బోధన్‌లో బిల్లులు రావడం లేదు
 బోధన్ వ్యవసాయ మార్కెట్‌లో, సింగిల్‌విం డోలో, సాలూర, సాలంపాడ్, నవీపేట మండలంలోని అభంగపట్నం, రెంజల్ మండలం సాటాపూర్, దండిగుట్ట, ఎడపల్లి మండలంలో ని ఎడపల్లి, ఠానాకలాన్ కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించిన రైతులకు డబ్బులు సకాలంలో అందడం లేదని తేలింది. ఇప్పటివరకు 11 వేల కింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. రైతులకు రూ. 1.37 కోట్లు చెల్లించాల్సి ఉండ గా, ఇందులో రూ. 68 లక్షలు చెల్లించారు.

మిగిలిన డబ్బుల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. కొనుగోలు కేంద్రంలో కాంటా లేదు. సాలూర సొసైటీలో 6 వేల క్వింటాళ్ల వరకు కొనుగోలు చేశారు. ఇక్కడ తేమ కొలత మీటరు పని చేయ డం లేదు. కాంటాలు లేవు. పంట పొలాలు, ఖా ళీ ప్రదేశాలలో తూకం వేస్తున్నారు. సాలంపాడ్ లో ఇప్పటి వరకు 8 వేల క్వింటాళ్లు కొనుగోలు చేశారు. ఇక్కడ కొనుగోలు కేంద్రంలో కాంటా లేదు. పెంటాకుర్థులో ఇదే పరిస్థితి. ఈ సొసైటీ పరిధిలో బీపీటి రకం ధాన్యం సాగు చేశారు. ఇక్కడ కేవలం 2,190 కింటాళ్లు కొనుగోలు చేశారు. రెంజల్ మండలంలోని సాటాపూర్, దండిగుట్ట కేంద్రాలలో తూకం బంద్ ఉంది.

 తేమ, తాలు ఉన్నాయని
 జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు మొక్కుబడిగా మారాయి. కనీస మద్దతు ధర దేవుడెరుగు ఎనలేని ఇబ్బందులను ఎదుర్కుంటున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉందని, తా లు ఉందని చెబుతూ నిరాకరిస్తున్నట్లు రైతులు వెల్లడించారు.

పైగా తెచ్చిన ధాన్యాన్ని జల్లెడ పట్టటంతో చాలా వరకు తరుగు పోతోంది.  గత్యంతరం లేక ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు అమ్ముకుంటున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వానలకు అక్కడక్కడా ధాన్యం తడిసిపోయి రంగు మారింది. ఇదే అదునుగా కొనుగోలు కేంద్రాలలో రైతులను నానా ఇబ్బందులు పెడుతున్నారు. అక్టోబర్ 29న ప్రారంభించిన ‘మెప్మా’ కేంద్రం మొక్కుబడిగా మారింది.

 అకాల వాన కొంప ముంచింది.
 నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కొనుగోలు కేంద్రాల పరిస్థితి దారుణంగా ఉంది. డిచ్‌పల్లి మండలం బర్థిపూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధర్మారం (బి) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం కొద్దిమేర తడిసింది. దీంతో సోమవారం కొనుగోళ్లను నిలిపివేశారు. తరుగు పేరిట బస్తాకు కిలో ధాన్యం తీసేస్తున్నారని రైతులు తెలిపారు.

ధర్పల్లి పీఏసీఎస్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోనూ, సిరికొండ మండలం తాళ్ల రామడుగులోనూ వానకు ధాన్యం తడిసి పోవడంతో కొనుగోళ్లను నిలిపివేశారు. జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో పడకల్ గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించకపోవడం వల్ల తడిసిపోయింది.

 ఇక్కడా అంతే
 జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట, గున్కుల్, మల్లూర్ సింగిల్ విండోల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. మద్నూర్ మండలంలో డోంగ్లిలో ఇంతవరకు ధాన్యం రాకపోవడంతో తూకాలు ప్రారంభం కాలేదు. మదన్ హిప్పర్గలో 6,040 బస్తాల ధాన్యాన్ని కొన్నారు.
 
ఎల్లారెడ్డిలో..
 ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి, సదాశివనగర్, ఎల్లారెడ్డి, లింగంపేట, తాడ్వాయి, నాగిరెడ్డిపేట మండలాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్‌విండోలు, ఐకేపీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి కురిసిన వానకు ధాన్యం తడవడంతో రైతులు ఆరబెట్టడంలో నిమగ్నమయ్యారు. తాటిపత్రు లు లేకపోవడంతో రైతులు స్వయంగా తెచ్చుకుంటున్నారు. తేమశాతం ఎక్కువగా ఉందనే కారణంతో తూకాలు చేయడం లేదు. రైతులకు డబ్బులు రావడానికి 10 నుంచి 20 రోజుల సమయం పడుతోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement