సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లావ్యాప్తంగా 25 మండలాలలోని 194 ప్రాథమిక పాఠశాలలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు త్వరలో తాగునీటి సౌకర్యం కల్పించనున్నారు. జాతీయ గ్రామీణ తాగునీటి పథకం (ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ) మొదటి విడతలో ఈ పథకాలను చేపట్టనున్నారు. రాష్ట్రస్థాయి పథకాల మంజూరు కమిటీ (ఎస్‌ఎల్‌ఎస్‌ఎస్‌సీ) సుమారు ఐదు నెలల తర్వాత ఎట్టకేలకు శనివారం నిధుల విడుదలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి జె.రేమండ్‌పీటర్ ఉత్తర్వులు జారీ చేశారు.
అసలే తాగునీటి వసతిలేని, కొద్దిపాటి నిధులతో తాగునీటి సౌకర్యం కలిగే ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు నిధులు మంజూరు చేయాలని జిల్లా గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారులు ఈ ఏడాది మే ఎనిమిదిన ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 225 పీఎస్, జడ్‌పీహెచ్‌ఎస్‌లకు రూ.159.47 లక్షలు అవసరమని పేర్కొన్నారు. ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ మొదటి విడతలో ఈ నిధులు మంజూరు చేయాలని కోరారు.
రెండు దఫాలుగా సమీక్ష
ఈ మేరకు నిధుల విడుదలపై ఎస్‌ఎల్‌ఎస్‌ఎస్‌సీలో రెండు దఫాలుగా సమీక్ష జరిగింది. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు పంపిన ప్రతిపాదనలలోని 225లో 31 పాఠశాలల కు జులై 29న నిధులు మంజూరైనట్లు నిర్ధారిం చారు. వాటిని మినహాయించిన మిగతా 194 పాఠశాలలకు రూ.130.17 లక్షలు మంజూరు చేస్తూ ప్రస్తుతం అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిధులతో ఆయా బడులలో మంచినీటి పథకాలను ఏర్పాటు చేయాల ని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఇందులో అత్యధికంగా డిచ్‌పల్లి, భీమ్‌గ ల్, నిజామాబాద్, ఆర్మూరు మండలాలకు పథాలను కేటాయించారు.
డిచ్‌పల్లికి 42, భీమ్‌గల్‌కు 25, నిజామాబాద్‌కు 26, ఆర్మూరుకు 4, నిజాంసాగర్‌కు 12, నందిపేట కు 2, బాల్కొండకు 2, కమ్మర్‌పల్లికి 2, మోర్తాడ్‌కు 5, వేల్పూరుకు 1, బోధన్‌కు 9, నవీపేటకు 3, ఎడపల్లికి 2, భిక్కనూర్‌కు 3, దోమకొండకు 3, కామారెడ్డికి 2, మా చా రెడ్డికి 3, జుక్కల్‌కు 2, జక్రాన్‌పల్లికి 8, ధర్పల్లికి 11, సిరికొండకు 6, బాన్సువాడకు 9, బీర్కూరుకు 1, కోటగిరికి 2, వర్ని మండలానికి 8 మంజూరయ్యాయి. కాగా ఈ పనుల పర్యవేక్షణకు కలెక్టర్ సహా ఎనిమిది మంది ఉన్నతాధికారులతో కమిటీ ఉంటుంది.
కలెక్టర్ రోనాల్డ్‌రోస్ చైర్మన్‌గా వ్యవహరించనుండగా, కన్వీనర్‌గా ఆర్‌డబ్ల్యూ ఎస్ ఎస్‌ఈ శ్రీనివాస్‌రెడ్డి ఉంటారు. సభ్యులుగా జడ్ సీఈఓ రాజారాం, డీపీఓ సురేష్‌బాబు, ఆర్‌అండ్‌బీ ఎస్ ఈ సుకన్య, నీటిపారుదలశాఖ ఎస్‌ఈ షకీల్ అహ్మద్ ఉమ్రాన్, ట్రాన్స్‌కో ఎస్‌ఇ ప్రభాకర్‌తో పాటు గ్రౌండ్‌వాటర్ డిప్యూటీ డెరైక్టర్‌లు ఉంటారు.
తీరనున్న దాహార్తి
Published Sun, Nov 23 2014 2:18 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement