National Rural Drinking Water Programme
-
ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీలో అవినీతి
సాక్షి ప్రతినిధి, వరంగల్ : గ్రామీణులకు రక్షిత తాగునీటిని సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ తాగునీటి కార్యక్రమం(ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ) పథకాన్ని అమలు చేస్తోంది. గ్రామీణులకు తాగునీటిని అందించడం ఎలా ఉన్నా.. ఈ పథకం కింద చేయాల్సిన పనులు చేయకుండానే.. బిల్లులు స్వాహా చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ పథకం కింద మంజూరైన పనులు చేపట్టకుండా తాత్సారం చేస్తూ.. ఇష్టం వచ్చినప్పుడు టెండర్ల ప్రక్రియను నిర్వహిస్తూ భారీగానే దోపిడీ సాగిస్తున్నారు. అధికారులు టెండర్ల ముగుసులో తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు పనులు కట్టబెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీలో నిధులు మంజూరైనా పనులు చేయడం లేదు. ఇతర పథకాల నిధులతో పనులు పూర్తయిన తర్వాత.. అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ నిధులతో పనులు చేసినట్లు రికార్డులుృసష్టిస్తున్నారు. చేయని పనులకు తప్పుడు రికార్డులు తయూరు చేసి రూ.లక్షలు దండుకుంటున్నారు. గ్రామాల్లో తాగు నీటికి తండ్లాట తప్పడం లేదు. ఒక పథకం కింద పనులు.. మరో పథకం కింద నిధులు.. జిల్లా వ్యాప్తంగా ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ కింద దాదాపు రూ.80 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో ఎన్ని పనులు.. ఎక్కడెక్కడ చేశారనే సమాచారం ఈ విభాగం అధికారుల వద్ద లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. తాజాగా ఇతర పథకంలో చేపట్టిన పనులు ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ పథకంలో చేసినట్లు రికార్డులు సృష్టించి విషయం ఆలస్యంగా వెలుగు చూసిం ది. ఎస్టీ ఉప ప్రణాళిక(టీఎస్పీ) పరిధిలోని 13 మండలాల్లో జరుగుతున్న అక్రమాలకు అంతూ అదుపు లేకుండా పోతోంది. ఇటీవల ఐటీడీఏలో చేపట్టిన పనికి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సుమారు రూ.5 లక్షలకు పైగా బిల్లుల రూపం లో చెల్లించిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే... ఏటూరునాగారం మం డలం షాపల్లిలో 2010లో ఐటీడీఏలోని ఇంజినీరింగ్ విభాగం ఏఆర్‌డబ్ల్యూఎస్ పథకంలో రూ. 2 లక్షల వ్యయంతో స్టాస్టిక్ ట్యాంకును నిర్మిం చింది. గ్రామంలో పైపులైను నిర్మించాలని వినతులు మేరకు ఐటీడీఏ అధికారులు 2010-11 లో ఎస్సీఏ గ్రాంటులో పైపులైన్ నిర్మాణానికి రూ.3 లక్షలు కేటాయించారు. ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ సుమారు 1200 మీటర్ల పైపులైన్‌ను గ్రామంలో నిర్మించి 32 నల్లాలను ఏర్పా టు చేశాడు. ఎస్సీఏ గ్రాంటుల్లో కేటాయింపుల కంటే ఎక్కువ పనులు చేపట్టడంతో ఈ పనికి బి ల్లులు చెల్లించేందుకు నిధులు లేకుండా పోయా యి. చేసిన పనికి బిల్లులు రాకపోవడంతో సద రు కాంట్రాక్టర్ పైపులైన్‌ను కట్ చేసినట్లు తెలి సింది. ఈ పైపులైన్‌ను ఇతర పథకంలో చేపట్టినట్లు రికార్డులు సమర్పించి రూ.లక్షల బిల్లుల ను అధికారులు చెల్లించారని.. ఈ పని పూర్తి చే సిన కాంట్రాక్టర్ ఆరోపణలు చేస్తుండడం ఆశ్చర్యంగా ఉంటోంది. ఒకే పనికి.. రెండు బిల్లులు! షాపెల్లిలోని కొత్తూరులో 20 వేల లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంక్, పైపులైన్లు, నల్లాల నిర్మాణం కోసం ఎస్వీఎస్ పథకంలో భాగంగా 2011-12లో రూ.12 లక్షలు మంజూరయ్యాయి. ఈ ప నులకు 2013 ఆగస్టులో టెండర్ నిర్వహించా రు. 4.90 శాతం ఎక్కువ(ఎక్సెస్)తో కాంట్రాక్టర్ పనులు దక్కించుకున్నారు. ఈ పనుల్లో భా గంగా ఓవర్ హెడ్ ట్యాంకును షాపల్లి కొత్తూరులో నిర్మించాల్సి ఉంది. కాంట్రాక్టర్ ముందుచూపుతో షాపల్లి పాత గ్రామంలోనే నిర్మించా డు. ఓవర్ హెడ్ ట్యాంక్‌ను నిర్మించి ఐటీడీఏ నిధులతో గతంలోనే నిర్మించిన పాత పైపులైన్లకు కనెక్షన్ ఇచ్చి నల్లాలను ప్రారంభించినట్లు తెలిసింది. ఈ పనులను అధికారులకు చూపెట్టి రూ.12 లక్షల వరకు బిల్లులు పొందినట్లు అధికారులు తెలిపారు. ఈ నిధులతో 20 వేల లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంక్‌తోపాటు పైపులైను నిర్మిం చాల్సి ఉన్నా ఇదేమీ చేయకుండానే బిల్లులు డ్రా అయినట్లు అధికారులు తెలిపారు. ఆర్‌డబ్ల్యూఎస్‌కు నిధులు కేటాయించిన విధంగానే.. ఐటీడీఏలోని గిరిజన సంక్షేమ విభాగంలో చేపట్టే తాగు నీటి పనులకు ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ నిధులను ప్రభుత్వం కేటాయిస్తోంది. ఐటీడీఏ పరిధిలోని ఎస్టీ ఉప ప్రణాళిక(టీఎస్పీ), మైదాన ప్రాంతాల అభిృద్ధి సంస్థ(మాడా), డిజర్ట్ ట్రైబల్ గ్రూప్(డీటీజీ) వర్తించే గిరిజన గూడేలు, తండాల్లో ఈపనులు చేపడుతున్నారు. ఒకే పనిని ఒకే గ్రామంలో చేపడుతుండడంతో బిల్లులు రెండు శాఖల్లో చెల్లింపులు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. -
తీరనున్న దాహార్తి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లావ్యాప్తంగా 25 మండలాలలోని 194 ప్రాథమిక పాఠశాలలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు త్వరలో తాగునీటి సౌకర్యం కల్పించనున్నారు. జాతీయ గ్రామీణ తాగునీటి పథకం (ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ) మొదటి విడతలో ఈ పథకాలను చేపట్టనున్నారు. రాష్ట్రస్థాయి పథకాల మంజూరు కమిటీ (ఎస్ఎల్ఎస్ఎస్సీ) సుమారు ఐదు నెలల తర్వాత ఎట్టకేలకు శనివారం నిధుల విడుదలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి జె.రేమండ్‌పీటర్ ఉత్తర్వులు జారీ చేశారు. అసలే తాగునీటి వసతిలేని, కొద్దిపాటి నిధులతో తాగునీటి సౌకర్యం కలిగే ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు నిధులు మంజూరు చేయాలని జిల్లా గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారులు ఈ ఏడాది మే ఎనిమిదిన ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 225 పీఎస్, జడ్పీహెచ్ఎస్లకు రూ.159.47 లక్షలు అవసరమని పేర్కొన్నారు. ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ మొదటి విడతలో ఈ నిధులు మంజూరు చేయాలని కోరారు. రెండు దఫాలుగా సమీక్ష ఈ మేరకు నిధుల విడుదలపై ఎస్ఎల్ఎస్ఎస్సీలో రెండు దఫాలుగా సమీక్ష జరిగింది. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పంపిన ప్రతిపాదనలలోని 225లో 31 పాఠశాలల కు జులై 29న నిధులు మంజూరైనట్లు నిర్ధారిం చారు. వాటిని మినహాయించిన మిగతా 194 పాఠశాలలకు రూ.130.17 లక్షలు మంజూరు చేస్తూ ప్రస్తుతం అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిధులతో ఆయా బడులలో మంచినీటి పథకాలను ఏర్పాటు చేయాల ని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఇందులో అత్యధికంగా డిచ్పల్లి, భీమ్గ ల్, నిజామాబాద్, ఆర్మూరు మండలాలకు పథాలను కేటాయించారు. డిచ్పల్లికి 42, భీమ్‌గల్‌కు 25, నిజామాబాద్‌కు 26, ఆర్మూరుకు 4, నిజాంసాగర్‌కు 12, నందిపేట కు 2, బాల్కొండకు 2, కమ్మర్‌పల్లికి 2, మోర్తాడ్‌కు 5, వేల్పూరుకు 1, బోధన్‌కు 9, నవీపేటకు 3, ఎడపల్లికి 2, భిక్కనూర్‌కు 3, దోమకొండకు 3, కామారెడ్డికి 2, మా చా రెడ్డికి 3, జుక్కల్‌కు 2, జక్రాన్‌పల్లికి 8, ధర్పల్లికి 11, సిరికొండకు 6, బాన్సువాడకు 9, బీర్కూరుకు 1, కోటగిరికి 2, వర్ని మండలానికి 8 మంజూరయ్యాయి. కాగా ఈ పనుల పర్యవేక్షణకు కలెక్టర్ సహా ఎనిమిది మంది ఉన్నతాధికారులతో కమిటీ ఉంటుంది. కలెక్టర్ రోనాల్డ్‌రోస్ చైర్మన్‌గా వ్యవహరించనుండగా, కన్వీనర్‌గా ఆర్డబ్ల్యూ ఎస్ ఎస్ఈ శ్రీనివాస్‌రెడ్డి ఉంటారు. సభ్యులుగా జడ్ సీఈఓ రాజారాం, డీపీఓ సురేష్‌బాబు, ఆర్అండ్బీ ఎస్ ఈ సుకన్య, నీటిపారుదలశాఖ ఎస్ఈ షకీల్ అహ్మద్ ఉమ్రాన్, ట్రాన్స్‌కో ఎస్ఇ ప్రభాకర్‌తో పాటు గ్రౌండ్‌వాటర్ డిప్యూటీ డెరైక్టర్లు ఉంటారు.